అందుకే సిరాజ్ గొప్ప క్రికెటర్ అయ్యాడు.. డీఎస్పీ సాబ్‌కు నా సెల్యూట్: ఎమ్మెస్కే ప్రసాద్
టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్‌పై మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసల జల్లు కురిపించాడు. సిరాజ్‌ది మంచి మనుసని, దాంతోనే గొప్ప క్రికెటర్‌గా ఎదిగాడని కితాబిచ్చాడు. సంకల్పం ఉంటే పరిస్థితులతో సంబంధం లేకుండా విజయం సాధించవచ్చని సిరాజ్ నిరూపించాడని చెప్పుకొచ్చాడు.
తాజాగా సుధీర్ టాక్స్ అనే తెలుగు పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎమ్మెస్కే ప్రసాద్.. గ్రౌండ్స్‌మెన్‌కు రూ.10 లక్షలు విరాళంగా ఇవ్వడాన్ని గుర్తు చేసుకుంటూ సిరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.
సంకల్పం ఉంటే..
'సిరాజ్ క్రికెట్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. ప్రతీ ఒక్కరికి చెప్పేది ఏంటంటే.. ఎలాంటి ఆర్థిక పరిస్థితి నుంచి వచ్చినా.. ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అనేదాని కంటే కూడా ఒక మనిషి సక్సెస్‌ఫుల్‌గా ఉండటానికి మానసికంగా ఎంత దృడంగా ఉండాలనేదానికి మహమ్మద్ సిరాజ్ సరైన నిదర్శనం.

శ్రీలంకలో జరిగిన ఆసియా కప్ 2023 టోర్నీకి వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. మ్యాచ్‌లు సజావుగా సాగేందుకు 100 మందికి పైగా గ్రౌండ్స్‌మెన్ కష్టపడ్డారు. కవర్లు వేస్తూ..తీస్తూ.. టోర్నీ మొత్తం మైదాన సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. ఫైనల్లో కూడా వర్షం అంతరాయం కలిగించింది. అప్పుడు కూడా గ్రౌండ్స్‌మెన్ శ్రమించారు. ఆ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ బహుషా ఐదో, 6 వికెట్లు తీసాడు. చాలా తక్కువ పరుగులిచ్చి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రూ. 10 లక్షలు ఇచ్చేసాడు..
ఈ అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ అవార్డు ద్వారా సిరాజ్‌కు రూ.10 లక్షల రివార్డు లభించింది. ఆ క్షణమే ఆ రూ.10 లక్షలను సిరాజ్ గ్రౌండ్స్‌మెన్‌కు విరాళంగా ఇచ్చేసాడు. ఒక ఆటోడ్రైవర్ కొడుకు.. ఎన్నో ఆర్థిక కష్టాలను ఎదుర్కొన్న వ్యక్తి.. రూ.10 లక్షల రూపాయాలను విరాళంగా ఇచ్చేసాడంటే సిరాజ్‌ది ఎంత పెద్ద హృదయం. అందుకే సిరాజ్ గొప్ప క్రికెటర్ అయ్యాడు. గ్రౌండ్స్‌మెన్‌కు రూ.10 లక్షలు విరాళం ఇవ్వడం మాటలా..? ఇది నిజంగా గొప్ప స్ఫూర్తిదాయకమైన విషయం. డీఎస్‌పీ సిరాజ్‌కు లేచి నిలబడి సెల్యూట్ చేయాల్సిందే.'అని ఎమ్మెస్కే ప్రసాద్ ప్రశంసించాడు.
6 వికెట్లతో నిప్పులు చెరిగిన సిరాజ్..
కొలంబో వేదికగా జరిగిన ఆసియా కప్ 2023 ఫైనల్లో సిరాజ్ నిప్పులు చెరిగాడు. ఏకంగా కెరీర్ బెస్ట్ (6/21) బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక పతనాన్ని శాసించాడు. సిరాజ్ ధాటికి ఈ మ్యాచ్‌లో శ్రీలంక 15.2 ఓవర్లలోనే 50 పరుగులకు కుప్పకూలింది.
పాతుమ్ నిస్సంక, కుశాల్ మెండీస్, సదీర సమరవిక్రమా, చరిత్ అసలంక, ధనంజయ డిసిల్వా, డసన్ షనకలను సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. హార్దిక్ పాండ్యా మరో మూడు వికెట్లు తీయగా.. బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం భారత్ 6.1 ఓవర్లలోనే 51 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

