ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం!
టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్, తెలుగు తేజం ఎమ్మెస్కే ప్రసాద్‌కు ఘోర అవమానం ఎదురైంది. ప్రపంచకప్ విన్నర్, తెలుగు తేజం శ్రీచరణికి ఘన స్వాగతం పలికేందుకు గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఎమ్మెస్కే ప్రసాద్‌ను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంది.
ఈ వ్యవహారంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎమ్మెస్కే ప్రసాద్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. మాజీ క్రికెటర్, చీఫ్ సెలెక్టర్‌గా తనకు ప్రోటోకాల్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెస్కే ప్రసాద్.. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రతినిధులపై కూడా బీసీసీఐకి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నారు.

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్ అద్భుత పనితీరు కనబర్చాడు. 2009 నుంచి 2014 వరకు ఈ బాధ్యతలు నిర్వర్తించిన ఎమ్మెస్కే ప్రసాద్.. క్రికెటర్లకు అనేక మౌళిక వసతులు కల్పించాడు. ఏసీ క్రికెట్ అకాడమీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీఏ మైదానాల అభివృద్ధికి కృషి చేశారు. ఈ పని తీరుకు రివార్డ్‌గానే అతనికి చీఫ్ సెలెక్టర్ పదవి దక్కింది. అలాంటి ఆటగాడిని సెక్యూరిటీ అడ్డుకోవడంపై క్రికెట్ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ అయిన ఎమ్మెస్కే ప్రసాద్.. 1999-2000 మధ్య భారత్ తరఫున ఆరు టెస్టు మ్యాచ్‌లు మరియు 17 వన్డేలు ఆడాడు. 2016 నుంచి 2019 వరకు భారత చీఫ్ సెలెక్టర్‌గా పని చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications