Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs SA: అందుకే బుమ్రాకు వైస్ కెప్టెన్సీ.!

MSK Prasad explains why Bumrah was appointed ODI vice-captain over Pant and Iyer

న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ప్రకటించిన సెలెక్టర్లు చాలా మందిని సర్‌ప్రైజ్ చేశారు. అతను ఈ ఒక్క సిరీస్‌కే వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నా.. భారత టాప్ బౌలర్‌గా రాణిస్తున్న బుమ్రాకు తగిన గుర్తింపుగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ అవడాన్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యుండొచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. అయితే, ఇప్పటికే ఐపీఎల్‌లో కెప్టెన్లుగా నిరూపించుకున్న శ్రేయస్‌ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ లాంటి ఆటగాళ్లు జట్టులో ఉండగా.. బుమ్రాకే ఎందుకు ఆ బాధ్యతలు అప్పగించారనే విషయంపై బీసీసీఐ స్పష్టతనిచ్చింది.

కమిన్స్ నియామకం నేపథ్యంలో..

కమిన్స్ నియామకం నేపథ్యంలో..

'ఇటీవల ఆస్ట్రేలియా సీనియర్‌ బౌలర్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. అలాగే, మేం బుమ్రాకు బాధ్యతలు అప్పగించాం. అతడు 2016 నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎలివేట్‌ చేస్తే.. శ్రేయస్ అయ్యర్‌, రిషభ్‌ పంత్‌ లాంటి యువ ఆటగాళ్లు నిలకడగా రాణించేందుకు ప్రయత్నిస్తారని సెలెక్టర్లు భావించి ఉండొచ్చు. ఎలాగూ వెస్టిండీస్, శ్రీలంక జట్లతో స్వదేశంలో జరుగనున్న సిరీసులకు వన్డే కెప్టెన్ రోహిత్‌ శర్మ అందుబాటులోకి వస్తాడు. కాబట్టి ఈ ఒక్క సిరీస్‌కే బుమ్రా వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతాడు' బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

స్వాగతించిన ఎమ్మెస్కే..

స్వాగతించిన ఎమ్మెస్కే..

బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించడాన్ని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్వాగతించాడు. 'ఒక ఫాస్ట్ బౌలర్‌ను వైస్‌ కెప్టెన్‌గా నియమించడం చాలా మంచి నిర్ణయం. బుమ్రా నిలకడగా రాణిస్తూ అన్ని ఫార్మాట్లలో ప్రధాన బౌలర్‌గా ఎదిగాడు. అయితే, ఒక్క సిరీస్‌లో బాధ్యతలు అప్పగించి.. అతడి నాయకత్వ పటిమపై ఓ నిర్ణయానికి రాలేం. ఒక వేళ రోహిత్, కేఎల్‌ రాహుల్ ఇద్దరూ అందుబాటులో లేకపోతే.. పరిస్థితి మరోలా ఉండేది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న శ్రేయస్‌ అయ్యర్, రిషభ్‌ పంత్.. మరింత కాలం స్థిరంగా రాణించాల్సిన అవసరం ఉంది' అని ఎమ్మెస్కే ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.

పంత్, అయ్యర్‌కు మెసేజ్..

పంత్, అయ్యర్‌కు మెసేజ్..

బుమ్రాను వైస్ కెప్టెన్‌గా నియమించడం వల్ల.. పంత్, అయ్యర్ ఇద్దరికీ అన్ని ఫార్మాట్లలోనూ మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే మెసేజ్ ఇచ్చారని సెలెక్షన్ కమిటీ వర్గాలు చెబుతున్నాయి. 2016 నుంచి బుమ్రా మూడు ఫార్మాట్లలో గొప్పగా ఆడుతూ టీమ్‌లో టాప్ ప్లేయర్‌గా ఎదిగాడు. పంత్, అయ్యర్ కూడా మరింత నిలకడ చూపిస్తే మున్ముందు వాళ్లకూ చాన్స్ వస్తుందని సెలెక్టర్లు పరోక్షంగా సూచించారు. ఐపీఎల్-2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు శ్రేయస్ అయ్యర్‌ కెప్టెన్‌గా వ్యవహరించి ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఆ తర్వాత 2021 సీజన్‌లో ఢిల్లీ పగ్గాలు చేపట్టిన రిషభ్‌ పంత్‌ కూడా మెరుగ్గానే రాణించాడు.

Story first published: Sunday, January 2, 2022, 15:45 [IST]
Other articles published on Jan 2, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+