Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సినిమాల్లోకి ధోనీ.. నయనతారా హీరోయిన్‌గా...

 MS Dhoni will make his Kollywood Entry, Joins Hands With Nayanthara For Maiden Film

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. భారత కెప్టెన్‌‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాలందించి విశేష అభిమాన గణాన్ని అందుకున్న ధోనీకి.. తమిళనాడు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలోనే కోలివుడ్‌లోకి ధోనీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ రోల్‌లో ఓ తమిళ చిత్రం నిర్మించే యోచనలో ధోనీ ఉన్నాడని కోలివుడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన అనంతరం ఈ మూవీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

ఎంఎస్ ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ బాక్సాఫిస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. పలు భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోనీ పాత్రను పోషించగా.. దిషా పటాని, కైరా అద్వానీ అతని సతీమణి, ప్రియురాలి పాత్రలను పోషించారు.

ఇక నయనతార ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌‌ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీతో పాటు పలు తమిళ చిత్రాలతోనూ నయనతార బిజీగా ఉంది.

నయనతార-విఘ్నేశ్‌ శివన్‌ల పెళ్లి గత కొంతకాలంగా చర్చనీయాంశం అవుతుంది. 5ఏళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లాక్‌డౌన్‌లో వీరిద్దరు నిశ్చితార్థం చేసుకోవడంతో వీరి పెళ్లి అంశం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్‌ 9న తిరుమల తిరుపతి దేవస్థానంలో నయన్‌-శివన్‌లు పెళ్లి బంధంతో ఒక్కటవ్వబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

Story first published: Wednesday, May 11, 2022, 17:30 [IST]
Other articles published on May 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+