For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni vs Bravo Fight:మ్యాచ్ విన్నర్‌ను మందలించిన ధోనీ.. ఎవడు రమ్మన్నాడంటూ ఫైర్! (వీడియో)

MS Dhoni vs Dwayne Bravo Fight Video: CSK Captain Losses His Cool In Mumbai Indians Match
IPL 2021: MS Dhoni భయ్యా అది Bravo క్యాచ్ నే.. అనవసరంగా అరిచావ్ | CSK VS MI || Oneindia Telugu

దుబాయ్: ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ప్రశాంతతకు మారుపేరైన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సారథి మహేంద్ర సింగ్ ధోనీ సహనం కోల్పోయాడు. సహచర ఆటగాడు, ఈ మ్యాచ్ విన్నర్ అయిన డ్వేన్ బ్రావోపై నోరుపారేసుకున్నాడు. సౌరభ్ తివారీ ఇచ్చిన క్యాచ్ నేలపాలవ్వడంతో మహీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. దీపక్ చాహర్ వేసిన 18వ ఓవర్ నాలుగో బంతిని సౌరభ్ తివారీ ఫైన్ లీగ్ దిశగా ఆడగా.. బ్యాట్ ఎడ్జ్ తాకిన బాల్ గాల్లోకి లేచింది. ఇక బంతిని అందుకునేందుకు ఆ దిశగా ఫీల్డింగ్ చేస్తున్న డ్వేన్ బ్రావోతో పాటు వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ పరుగెత్తారు. కానీ ఇద్దరి మధ్య సమన్వయం లోపించడంతో క్యాచ్ చేజారింది.

దాంతో చిర్రెత్తుకుపోయిన ధోనీ.. బ్రావోపై నోరుపారేసుకున్నాడు. చూసుకోవా? ఎవడు రమ్మన్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి బ్రావో సైతం ఏందీది.. ఇది నా క్యాచ్‌ అంటూ రెండు చేతులను చాపుతూ బదులిచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వెంటనే వెనక్కుతగ్గి నిదానంగా నడుచుకుంటూ వెళ్లిపోయాడు. మహీ మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే ఈ క్యాచ్ విషయంలో ఎవరో ఒకరు కాల్ తీసుకోవాల్సిందని కామెంటేటర్లు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి ఆ క్యాచ్‌ను బ్రావో సునాయసంగా అందుకునేవాడని, కానీ కీపర్ గ్లోవ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా సులువు అవుతుందని మహీ భావించి ఉండవచ్చన్నారు. మొత్తానికి ఈ ఘటన అభిమానులను ఆశ్చర్య పరిచింది. మహీ ఆగ్రహం ఏంటో మరోసారి తెలిసొచ్చింది.

అయితే మహీ ఆగ్రహం వెనుక కూడా బలమైన కారణం ఉందని, అది క్రీజులో పాతుకుపోయిన సౌరభ్ తివారీ క్యాచ్ అని, అందుకే అంతా రియాక్టయ్యాడని కూడా కామెంటేటర్లు చెప్పుకొచ్చారు. ఈ తప్పిదం చెన్నై కొంపముంచిన ఆశ్చర్యపోనకర్లేదన్నారు. కానీ సీఎస్‌కే చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్‌చేసి గెలుపొందింది.

యువ క్రికెటర్ రుతురాజ్ గైక్వాడ్ వీరోచిత బ్యాటింగ్‌కు డ్వేన్ బ్రావో(23, 3/25) ఆల్‌రౌండ్ ప్రదర్శన, దీపక్ చహర్(2/19) పవర్‌పుల్ బౌలింగ్ తోడవడం‌తో ఆదివారం జరిగిన ఫేజ్ 2 ఫస్ట్ మ్యాచ్‌లో సీఎస్‌కే 20 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రుతురాజ్‌ గైక్వాడ్ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88 నాటౌట్‌) అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా రవీంద్ర జడేజా (33 బంతుల్లో 26; 1 ఫోర్‌), డ్వేన్‌ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్‌లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

ముంబై బౌలర్లలో ఆడమ్‌ మిల్నే, బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్‌ తివారీ (40 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు బ్రావో (3/25), దీపక్‌ చహర్‌ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మోకాలి గాయంతో ముంబై రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంకాగా. పొలార్డ్‌ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.

Story first published: Monday, September 20, 2021, 13:48 [IST]
Other articles published on Sep 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+