ఐపీఎల్‌కు ధోనీ గుడ్‌బై.. ఆదివారం బిగ్ అనౌన్స్‌మెంట్ అంటూ బాంబు పేల్చిన సీఎస్‌కే కెప్టెన్!

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రెండేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన భారత దిగ్గజం.. అప్పటి నుంచి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా టైటిల్ అందించిన ధోనీ.. గత సీజన్‌లో బ్యాట్‌తో రాణించి తనలో ఇంకా సత్తా ఉందని చాటిచెప్పాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటి నుంచి ధోనీ ఐపీఎల్‌కు కూడా వీడ్కోలు పలుకుతున్నాడని ప్రచారం జరుగుతోంది. గతేడాదే సీఎస్‌కేకు గుడ్ బై చెబుతాడని ప్రచారం జరిగింది. కానీ సొంతమైదానంలో ఆడిన తర్వాతే ఆటకు అల్విదా ప్రకటిస్తానని ధోనీ ఈ వార్తలకు చెక్ పెట్టాడు.
2 గంటలకు బిగ్ అనౌన్స్‌మెంట్..
తాజాగా ఏమైందో ఏమో కానీ సోషల్ మీడియా వేదికగా ఓ కీలక ప్రకటన చేశాడు. మాములుగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే మహీ శనివారం.. ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. అందులో సెప్టెంబర్ 25(ఆదివారం) మధ్యాహ్నం 2 గంటలకు ఫేస్ బుక్‌లో లైవ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ఓ కీలక ప్రకటన చేస్తానని చెప్పాడు. దాంతో ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడనే ప్రచారం ఊపందుకుంది.
రైనా, ఊతప్ప బాటలో..
ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన సురేశ్ రైనా, రాబిన్ ఊతప్ప అన్ని రకాల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడు ధోనీ కూడా ఓ కీలక ప్రకటన చేస్తానని పేర్కొనడంతో రిటైర్మెంట్ విషయమేననే సందేహాలు కలుగుతున్నాయి. సౌతాఫ్రికా వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన జోహన్నెస్ బర్గ్ జట్టు తరఫున మెంటార్‌గా ఉండేందుకే ధోనీ ఈ నిర్ణయం తీసుకుంటున్నాడా? అనే సందేహం కలుగుతోంది. ఇక విదేశీ లీగ్స్ ఆడేందుకే రైనా, రాబిన్ ఊతప్ప భారత్‌లోని అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు.

ఫ్యాన్స్ ఆందోళన..
ధోనీ ఫేస్ బుక్ పోస్ట్‌ను చూసి అభిమానులు కలవరపాటుకు గురయ్యారు. తాము ఊహించేది అస్సలు జరగవద్దని కోరుకుంటున్నారు. 'రైనా మొదలుపెట్టాడు. రాబిన్ ఊతప్ప కొనసాగించాడు. ఇప్పుడు ధోనీ లైవ్ అంటున్నాడు. మేం ఊహించేది అస్సలు జరగకూడదు.'అని హార్ట్ బ్రేక్ ఏమోజీతో ఓ అభిమాని ట్వీట్ చేయగా.. ధోనీ పోస్ట్ మమల్ని భయపెడుతుందని మరికొందరు కామెంట్ చేశారు. ప్రస్తుతం ధోనీ రిటైర్మెంట్ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications