టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ హీరోను తలపించేలా ఉన్న ధోనీ కొత్త లుక్ నెటిజన్లను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్రెండ్‌కు తగ్గట్లు తన హెయిర్ స్టైల్ మార్చే ధోనీ.. తాజాగా మరో కొత్త హెయిర్ స్టైల్‌లో మెరిసాడు. షార్ట్ హెయిర్, స్టైలిష్ గడ్డంతో బ్లాక్ టీషర్ట్ గాగుల్స్‌తో తళుక్కుమన్నాడు.
ధోనీ న్యూలుక్ ఏదో యాడ్ షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ధోనీ న్యూలుక్‌కు ఫిదా అవుతున్న నెటిజన్లు.. అదిరింది బాసూ అంటూ కామెంట్ చేస్తున్నారు.
జులపాల జుట్టుతో భారత జట్టులోకి వచ్చిన ధోనీ హెయిర్ స్టైల్‌కు అప్పట్లో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. చాలా మంది అభిమానులు ధోనీలా జులపాలు పెంచుకున్నారు. ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా పాకిస్థాన్ మాజీ ప్రధాని పర్వేజ్ ముషార్రఫ్ కూడా ధోనీ హెయిర్‌స్టైల్‌ను అప్పట్లో కొనియాడాడు. 2011 వన్డే ప్రపంచకప్ తర్వాత జులపాల జుట్టును తీసేసిన ధోనీ.. ట్రెండ్‌కు అనుగుణంగా తన హెయిర్ స్టైల్‌ను మార్చుతున్నాడు. ముఖ్యంగా యాడ్ షూట్స్ కోసం ప్రత్యేకమైన హెయిర్ స్టైల్‌ను మెయింటేన్ చేస్తున్నాడు.

ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై 5 ఏళ్లు పూర్తవుతున్నా.. అతని క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ.. వ్యాపార ప్రకటనల ద్వారా ఏడాదికి సుమారు రూ. 100 కోట్లు ఆర్జిస్తున్నాడు. యాడ్ షూటింగ్స్, ఐపీఎల్ లేని సమయంలో ధోనీ.. తన 40 ఎకరాల ఫామ్‌హౌస్‌లో వ్యవసాయం చేస్తున్నాడు. స్వయంగా తానే అన్నీ పనులు చేస్తున్నాడు. ఈ ఫామ్ హౌస్‌లో డైరీ, స్ట్రాబెర్రీ, కాలిఫ్లవర్, వరి వంటి పంటలను పండించిన ధోనీ..కడక్ నాథ్ కోళ్లను కూడా పెంచుతున్నాడు.
దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ధోనీ కోట్లు సంపాదించినా.. సాధారణంగా జీవించడానికే ఎక్కువ ఇష్టపడుతాడు. ఐపీఎల్ టైమ్‌లో మినహా.. మిగతా సమయాన్ని మొత్తం ఫామ్ హౌస్‌లో గడిపేందుకు ప్రయత్నిస్తాడు. వ్యాపారాల విషయంలో తన సతీమణికి అండగా ఉంటాడు. తాజా నివేదికల ప్రకారం ధోనీ నెట్ వర్త్ రూ. 1000 కోట్లుగా ఉంది. ధోనీ ప్రధాన ఆధాయ వనరులు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే వస్తాయి. పెప్సీ, రీబాక్, టీవీఎస్ మోటార్స్, గల్ఫ్ ఆయిల్, డ్రీమ్11, ఓరియంట్ ఎలక్ట్రిక్, మాస్టర్‌కార్డ్ వంటి 30కి పైగా బ్రాండ్‌లకు అతను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.
బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే ఏడాదికి రూ.100 కోట్లు ఆర్జిస్తున్నాడు. ధోనీకి సొంతంగా సెవెన్(లైఫ్‌స్టైల్ బ్రాండ్), చెన్నైయిన్ ఎఫ్‌సీ(ఫుట్‌బాల్ టీమ్), స్పోర్ట్స్‌ఫిట్ వరల్డ్ (జిమ్), హోటల్ మహి రెసిడెన్సీ, 7ఇంక్ బ్రూస్, కడక్ నాథ్ కోళ్ల వ్యాపారం, ఎంఎస్ ధోనీ గ్లోబల్ స్కూల్‌లు ఉన్నాయి. ఖతాబుక్ , కార్స్24 , బ్లూస్మార్ట్ మొబిలిటీ , గరుడ ఏరోస్పేస్, రిగి , ఎమోటోరాడ్ వంటి అనేక స్టార్టప్స్‌లో ఏంజిల్ ఇన్వెస్టర్‌గా ధోనీ పెట్టుబడులు పెట్టారు.