Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ, రైనా బ్రొమాన్స్.. నెట్టింట వైరల్(వీడియో)

MS Dhoni, Suresh Raina say hello as Chennai Super Kings target 4th title
IPL 2020 : Suresh Raina MS Dhoni Warm Hug & Kiss | Fans On Twitter...#Whistlepodu | Oneindia Telugu

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ రీ ఎంట్రీకి సిద్ధమైన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ ఓటమి అనంతరం మైదానానికి దూరమైన ఈ జార్ఖండ్ డైనమైట్ మార్చి 29 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్‌‌తో అభిమానులను అలరించనున్నాడు. సుమారు 8 నెలలు ఆటకు దూరమైన ధోనీ.. ఎప్పుడెప్పుడు మైదానంలో అడుగుపెడతారా? అని అభిమానులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు.

ఇక ఐపీఎల్-2020 సీజన్ కోసం ట్రైనింగ్‌ షురూ చేసిన మహీ.. ఆదివారం చెన్నై చేరుకున్న విషయం తెలిసిందే. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అతడికి ఘన స్వాగతం లభించింది. అనంతరం జట్టు హోటల్‌లోనూ ఈ మాజీ కెప్టెన్‌కు ఆత్మీయ పలకరింపు లభించింది. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేసిన సీఎస్‌కే మంగళవారం మరో ఆసక్తికర వీడియోను అభిమానులతో పంచుకుంది. అతనికి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ను మినట్ టు మినట్ అన్నట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నెట్స్‌లో ధోనీ ప్రాక్టీస్ చేసిన దగ్గర నుంచి జట్టులో ఆటగాళ్లతో కలిసినంత వరకు ధోనీకి సంబంధించిన ప్రతీ విషయాన్ని షేర్ చేసింది.

ధోనికి ముద్దిచ్చిన రైనా..

ధోనీ సహచరుడు, సీఎస్‌కే ఆటగాడు సురేశ్‌ రైనా హోటల్లో ధోనీని కలిశాడు. ఇద్దరూ ఆత్మీయంగా ఆలింగనం చేసుకొని పలకరించుకున్నారు. ఈ సందర్భంగా రైనా ఒకడుగు ముందుకేసి ధోనీ మెడపై ప్రేమతో ముద్దుపెట్టుకున్నాడు. ఈ వీడియో చెన్నై అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తాలా, చిన్న తాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. వారిద్దరినీ ఇలా చూడటం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మార్చి 29న చెన్నై సూపర్‌ కింగ్స్‌ vs ముంబై ఇండియన్స్‌ మధ్య వాంఖడే వేదికగా జరిగే తొలి మ్యాచ్‌తో ఈ సీజన్‌కు తెరలేవనుంది.

ధోనీ గొప్పతనం..

అందరి క్రికెటర్లతో పోలిస్తే ధోనీ కాస్త భిన్నం. ముఖ్యంగా అభిమానుల మనసులను గెలుచుకునే విషయంలో ధోనీ ఎప్పుడూ ముందుంటాడు. ఆదివారం కూడా ధోనీ అదే పనిచేశాడు. చెన్నై‌లోని జట్టు హోటల్‌కు చేరుకున్న మహీకి అక్కడి గార్డ్ నమస్కారంతో విష్ చేస్తూ స్వాగతం పలికాడు. వెంటనే ధోని అతని దగ్గరకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ షేక్ హ్యాండ్ ఫోటో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాలా అంటే ఇలానే ఉంటుందని ఒకరంటే.. ఎంత ఎదిగిన ఒదిగి ఉండటం.. ఇతరులకు గౌరవం ఇవ్వడం ధోనీని చూసే నేర్చుకోవాలని మరొకరు కామెంట్ చేశారు.

ధోనీని వెంటాడిన అభిమానులు

సోమవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో మహీ పాల్గొన్నాడు. స్టేడియంలో ప్రాక్టీస్‌ అనంతరం చెన్నై ఆటగాళ్లు బస్సులో హోటల్‌కు వెళ్తుండగా.. ధోనీని చూసిన ఫాన్స్ ఫాలో చేయడం మొదలెట్టారు. ఫాన్స్ అందరూ తన టూ వీలర్‌లతో వెంబడించారు. చెన్నైలోని ఓ సిగ్నల్స్‌ దగ్గర బస్సు ఆగినప్పుడు ధోనీని తమ మొబైల్‌ కెమెరాలతో ఫొటోలు తీసేందుకు ఫాన్స్ ఎగబడ్డారు. మహీకి అభివాదం చేస్తూ కేకలు, ఈలలతో హోరెత్తించారు. ధోనీ.. ధోనీ అంటూ బస్సు వెళుతున్నా కొద్ది ఫాలో అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Story first published: Tuesday, March 3, 2020, 21:49 [IST]
Other articles published on Mar 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+