IPL 2023: అప్పుడే ప్రాక్టీస్ షురూ చేసిన ధోనీ.. బౌలర్లకు దబిడి దిబిడే..! (వీడియో)

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ బ్యాట్ పట్టాడు. రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. గత సీజన్‌తోనే ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెబుతాడని అంతా భావించినా.. కరోనా వైరస్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసేలా చేసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా సొంత అభిమానుల మధ్య వీడ్కోలు పలకాలని భావిస్తున్నట్లు తన మనసులోని మాట చెప్పాడు. దాంతో ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడటం ఖాయమైంది. ఐపీఎల్ 2023 సీజన్‌కు మరో 6 నెలలు సమయం ఉన్నా.. ధోనీ అప్పుడే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
అప్పుడే ప్రాక్టీస్ షురూ...
గత ఐపీఎల్ తర్వాత మళ్లీ క్రికెట్ ఆడని ధోనీ.. వచ్చే సీజన్ వరకు రిథమ్ అందుకోవాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంత ముందుగా నెట్స్‌లో శ్రమిస్తున్నాడు. అతని ప్రాక్టీస్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. గత సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బాధ్యతలను జడేజాకు అప్పగించి చేతులు కాల్చుకున్న ధోనీ.. లీగ్ చివరి దశలో మళ్లీ జట్టు పగ్గాలను అందుకున్నాడు. తన తర్వాత జట్టును నడిపించే ఆటగాడి కోసం అన్వేషిస్తున్నాడు.
జడేజా విఫలమవ్వడంతో..
కెప్టెన్సీ ఒత్తిడిని భరించలేకపోయిన జడేజా.. దారుణంగా విఫలమయ్యాడు. ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ మూడు విభాగాల్లో చేతులెత్తేసాడు. అతను ఒత్తిడికి గురువుతున్నాడని భావించిన ధోనీ.. కెప్టెన్సీ నుంచి తప్పించాడు. అయితే ఈ విషయం జడేజాకు నచ్చలేదని, అతను జట్టును వీడే అవకాశం ఉందనే ఊహగానాలు వెలువడ్డాయి. సీఎస్‌కే మాత్రం జడేజాను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.

తాజాగా తమిళనాడులోని హోసూరులో సూపర్ కింగ్స్
అకాడమీని ధోనీ ప్రారంభించాడు. సీఎస్‌కే యాజమాన్యంతో పాటు ధోనీ ఇందులో భాగస్వామిగా ఉన్నాడు. ఈ కార్యక్రమంలో ధోనీ తన ఆరాధ్య క్రికెటర్ ఎవరో చెప్పాడు. సచిన్ టెండుల్కర్‌ను చూస్తూ పెరిగానని, ఆయనలా ఆడాలని కలలు కనేవాడినని చెప్పుకొచ్చాడు. తన రోల్ మోడల్, క్రికెటింగ్ ఐడల్.. అన్నీ టెండుల్కరేనని వ్యాఖ్యానించాడు. అందరిలాగే తానూ సచిన్ టెండుల్కర్‌కు పెద్ద అభిమానినని చెప్పాడు.

సచిన్‌లా ఆడాలని కలలు...
గ్రౌండ్‌లో దిగబోయే ముందు- లిటిల్ మాస్టర్‌లా పరుగుల వరద పారించాలని భావించేవాడినని, కానీ ఆయనలా ఆడలేకపోయేవాడినని తెలిపాడు. సచిన్ టెండుల్కర్‌తో కలిసి ధోనీ పలు మ్యాచ్‌లను ఆడాడు. ఇందులో 117 వన్డే ఇంటర్నేషనల్స్, 70 టెస్ట్ మ్యాచ్‌లు ఉన్నాయి. ఒక టీ20 ఇంటర్నేషనల్‌లో ఇద్దరూ కలిసి ఆడారు. 2013 నవంబర్‌లో సచిన్ టెండుల్కర్ తన కేరీర్‌కు వీడ్కోలు పలికాడు. 2020 ఆగస్టులో ధోనీ అన్ని ఫార్మట్లు అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications