ధోనీ దేశీవాలీ క్రికెట్‌లో ఆడుకోవడం మంచిది!!


న్యూ ఢిల్లీ: టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు చెప్పి పరిమిత ఓవర్ల సిరీస్‌లలో రాణిస్తున్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ఇప్పుడు అతణ్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి దేశీవాలీ క్రికెట్‌లో ఆడాలంటూ సూచిస్తున్నాడు టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. ఆసియా కప్‌లో భాగంగా టీమిండియాలో భాగమైన ధోనీ జట్టును నడిపిస్తున్న తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌కు అండగా ఉంటున్నాడు.

బ్యాటింగ్‌లో మునుపటి వేగం కనిపించక
బ్యాటింగ్‍లో తనదైన దూకుడును ప్రదర్శించకపోయినా.. జట్టుకు సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ధోనీ ఆటతీరు పట్ల సునీల్ గవాస్కర్ పెదవి విరిచాడు. ఇటీవల మ్యాచ్‌లలో ధోనీ బ్యాటింగ్ ప్రదర్శనపై గవాస్కర్ మాట్లాడుతూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్‌లో మునుపటి వేగం కనిపించడం లేదని తెలిపాడు.
తొలి ఆసియా వికెట్ కీపర్‌గా ధోని ఖాతాలో మరో మైలురాయి

ధోనికి సూచనలు ఇస్తోన్న సునీల్ గవాస్కర్:
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తన ఉనికిని చాటినప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం కాస్త వెనకబడిపోతున్నారు. దానిపై ధోనికి మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ కొన్ని సూచనలు చేశారు. ధోని దేశవాళీ క్రికెట్ ఆడితే మునపటి ఫామ్‌ను అందుకోవచ్చని విశ్వాసం వ్యక్తం వేశారు. ‘

కొత్తగా క్రికెట్లోకి వచ్చే ఆటగాళ్లకు ధోని
ధోని కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలి. నాలుగు రోజుల గేమ్స్ ఆడాలి. 50 ఓవరల్లో అంతగా అవకాశాలుండవు. నాలుగు రోజుల ఆట వల్ల సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడొచ్చు. దానివల్ల ఆటలో మునపటి రిథమ్ వస్తుంది. అలాగే ఝార్ఖండ్ నుంచి కొత్తగా క్రికెట్లోకి వచ్చే ఆటగాళ్లకు ధోని ఉపయోగడతాడు' అని సన్నీ అన్నారు.

తిరుగులేదని టీమిండియా మరోసారి
ఆసియా కప్‌లో తనకి తిరుగులేదని టీమిండియా మరోసారి నిరూపించుకుంది. దుబాయ్ వేదికగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్ మ్యాచ్‌లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన భారత్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా రెండోసారి టైటిల్‌ని చేజిక్కించుకుంది. ఢాకా వేదికగా 2016లో జరిగిన ఆసియా కప్ ఫైనల్లోనూ బంగ్లాదేశ్‌ని ఓడించే భారత్ జట్టు విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. సుదీర్ఘ ఆసియా కప్ చరిత్రలో టీమిండియా విజేతగా నిలవడం ఇది ఏడోసారి కావడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications