
3 వికెట్ల తేడాతో బంగ్లాపై భారత్ విజయం
ఇదిలా ఉంటే, బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. ఇది భారత్‌కు ఏడో ఆసియా కప్ టైటిల్. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్ దాస్ (117 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 121) సెంచరీ సాధించగా సౌమ్య సర్కార్ (33), మెహదీ హసన్ (32) ఫర్వాలేదనిపించారు.

భారత విజయానికి 18 బంతుల్లో 13 పరుగులు
భారత బౌలర్లలో కుల్దీప్‌కు మూడు, కేదార్ జాదవ్‌కు రెండు వికెట్లు దక్కగా బంగ్లా ఇన్నింగ్స్‌లో ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి గెలిచింది. భారత విజయానికి 18 బంతుల్లో 13 పరుగులు చేయాలి. మామూలుగా అయితే అనుభవజ్ఞులైన భారత్‌కు ఇది పెద్ద లక్ష్యం కాదు.

ఆరు బంతుల తేడాలో జడేజా, భువీని ఔట్ చేసిన బంగ్లా బౌలర్లు
కానీ బంగ్లా బౌలర్లు పోరాట స్ఫూర్తిని చూపెడుతూ ఆరు బంతుల తేడాలో జడేజా, భువనేశ్వర్‌ను ఔట్ చేశారు. దీంతో విజయ సమీకరణం 11 బంతుల్లో 9గా మారింది. గాయంతో జాదవ్, కుల్దీప్ క్రీజులోకి వచ్చారు. వీరిద్దరు 3 సింగిల్స్ తీయడంతో చివరి ఓవర్‌లో 6 పరుగులు చేయాల్సిన స్థితి నెలకొంది. మహ్మదుల్లా బౌలింగ్‌కు దిగాడు.. తొలి మూడు బంతులకు 4 పరుగులు వచ్చాయి.

ధావన్‌కే మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు
గెలవాలంటే మరో రెండు పరుగులు అవసరం... నాలుగో బంతికి పరుగు రాలేదు. 2 బంతుల్లో 2 పరుగులు.. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ.. కానీ ఐదో బంతికి కుల్దీప్ సింగిల్ తీయగా, తర్వాతి బంతిని జాదవ్ లెగ్‌సైడ్ వైపు మళ్లించడంతో చిరస్మరణీయ విజయం భారత్ సొంతమైంది. భారత్ తరఫున ఒక్క బ్యాట్స్‌మన్ కూడా హాఫ్ సెంచరీ చేయలేదు. రోహిత్ శర్మ మరో (48) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు బంగ్లాదేశ్ క్రికెటర్ లిటన్ దాస్‌కు దక్కగా.. శిఖర్ ధవన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది.


Click it and Unblock the Notifications













