IPL 2022: కోహ్లీ వికెట్ కోసం ధోనీ మాస్టర్ ప్లాన్.. రిప్లే చూసి అవాక్కయిన ఆర్‌సీబీ ఆటగాళ్లు! (వీడియో)

ముంబై: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి తన మార్క్ కెప్టెన్సీని చూపెట్టాడు. సారథ్య బాధ్యతల నుంచి అధికారికంగా తప్పుకున్నా.. అనధికారికంగా కొనసాగుతున్నాడు. కెప్టెన్‌గా రవీంద్ర జడేజా తడబడుతుండటంతో ఎంతో అనుభవం కలిగిన ధోనీ అతనికి అండగా నిలుస్తున్నాడు.
ఫీల్డ్ సెటప్, బౌలింగ్ మార్పులతో పాటు కీలక నిర్ణయాలను తానే తీసుకుంటున్నాడు. జడేజా కూడా ధోనీ సలహాలు స్వీకరిస్తున్నాడు. నాలుగు వరుస పరాజయాల తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగులతో గెలిచి తొలి విజయాన్నందుకున్న విషయం తెలిసిందే.
మహీ మాస్టర్ ప్లాన్..
అయితే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ వికెట్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ మాస్టర్ ప్లాన్ రచించాడు. ధోనీ వ్యూహాన్ని పసిగట్టలేకపోయిన కోహ్లీ ఆ ఉచ్చులో చిక్కుకున్నాడు. కోహ్లీ డగౌట్‌కి వెళ్లి రిప్లై చూసిన తర్వాతగానీ.. ధోనీ ప్లాన్ అతనికి అర్థం కాలేదు.
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా ఐదో ఓవర్‌ను యువ పేసర్ ముఖేష్ చౌదరికి ఇచ్చిన ధోనీ.. లెగ్ సైడ్ షార్ట్ లెంగ్త్ బాల్ వేయాలని సూచించాడు. దానికి తగ్గట్లే డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో ఫీల్డర్‌ను ఉంచాడు.కోహ్లీ కోసమే అక్కడికి ఫీల్డర్ శివమ్ దూబెని తీసుకొచ్చిన ధోనీ.. క్యాచ్ వస్తుందని కూడా అతన్ని హెచ్చరించాడు.

బిత్తరపోయిన కోహ్లీ..
ధోనీ చెప్పినట్లుగానే.. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ మొదటి బంతికే ముకేశ్ చౌదరి విసిరిన షార్ట్ పిచ్ బాల్‌ను విరాట్ కోహ్లీ ఫుల్ చేశాడు. కానీ.. ఎక్స్‌ట్రా బౌన్స్ కారణంగా షాట్ అతను ఆశించిన విధంగా కనెక్ట్ కాలేదు. గాల్లోకి లేచిన బంతి నేరుగా శివమ్ దూబె చేతుల్లోకి వెళ్లింది. కోహ్లీ ఔట్‌కి ముందు ధోనీ చేసిన ఫీల్డింగ్ మార్పును డగౌట్‌లో కూర్చుని రిప్లైలో చూస్తేగానీ.. కోహ్లీకి ఏం జరిగిందో అర్థం కాలేదు. రిప్లై చూస్తూ.. కోహ్లీతో పాటు బెంగళూరు టీమ్ ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోతూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

చెన్నై బోణీ..
ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 216 పరుగుల భారీ స్కోర్ చేసింది. శివమ్ దూబె ( 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95 నాటౌట్), రాబిన్ ఉతప్ప ( 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లతో 88) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అనంతరం బెంగళూరు.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 193 పరుగులు చేసింది.
షాబాజ్ అహ్మద్( 27 బంతుల్లో 4 ఫోర్లతో 41), సూయాశ్ ప్రభుదేశాయ్ ( 18 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 34), దినేశ్ కార్తీక్ ( 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 34) రాణించారు. ఛేదనలో చకచకా నాలుగు వికెట్లు పడ్డా బెంగళూరు పోరాడింది. తీక్షణ (4/33), జడేజా (3/39) బెంగళూరును దెబ్బతీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications