Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్టన్నింగ్ లుక్‌లో ధోనీ..! (వీడియో)

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ స్టన్నింగ్ లుక్‌లో కనిపించాడు. బిజినెస్ టైకూన్ రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కూమారుడు అనంత అంబానీ-రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ కోసం ధోనీ సతీ సమేతంగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చాడు. బాలీవుడ్ హీరోను తలపించిన ధోనీ పప్పరాజీల కెమెరాలకు సతీమణి సాక్షి సింగ్‌తో కలిసి ఫోజిచ్చాడు.

కెరీర్ ప్రారంభంలోలా లాంగ్ హెయిర్ స్టైల్‌ను మెయింటేన్ చేస్తున్న ధోనీ.. రెడ్ టీషర్ట్‌లో తళక్కున మెరిసాడు. ధోనీ స్టన్నింగ్ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 42 ఏళ్ల వయసులోనూ ధోనీ కుర్రాడిలా కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. నాలుగేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు.

MS Dhoni sets social media on fire with new look goes viral

గత 4 ఏళ్లుగా తన ఐపీఎల్ రిటైర్మెంట్ విషయంపై అభిమానులను గందరగోళానికి గురి చేస్తున్నాడు. 2021 నుంచి ప్రతీ సీజన్ ధోనీకి అదే చివరిదని ప్రచారం జరుగుతోంది. కానీ ధోనీ మాత్రం ప్రతీ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా కొనసాగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈసారి కూడా ధోనీకి ఇదే చివరి సీజన్ అని ప్రచారం జరుగుతున్నా.. మరో రెండేళ్ల పాటు ధోనీ ఆడే అవకాశం ఉందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.

గత సీజన్ ముగిసిన వెంటనే మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న ధోనీ.. అప్ కమింగ్ ఐపీఎల్ 2024 సీజన్ కోసం సద్దమవుతున్నాడు. నెట్స్‌లో గంటలకొద్దీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ధోనీ బ్యాటింగ్‌లో కాస్త జోరు తగ్గినా.. కీపింగ్‌లో మాత్రం మునపటిలానే చెలరేగుతున్నాడు.

ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు అన్ని రంగాలకు చెందిన సెలెబ్రిటీలు తరలివచ్చారు. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ ముందస్తు పెళ్లి వేడుకలు జరగనున్నాయి. డ్వేన్ బ్రావో, ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లతో పాటు స్టార్ ఆటగాళ్లంతా ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అంబానీ గ్రూప్ అధినేతకు క్రికెట్ సంబంధిత వ్యాపారాల్లో నేరుగా పెట్టుబడులు ఉండటంతో దేశ విదేశాలకు చెందిన స్టార్ క్రికెటర్లు ఈ ఈవెంట్ హాజరవుతున్నారు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం సతీ సమేతంగా ఈ ఈవెంట్‌కు వచ్చాడు.

Story first published: Friday, March 1, 2024, 18:26 [IST]
Other articles published on Mar 1, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+