Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ చికెన్.. కేజీ రూ.1000

'కాదేదీ బిజినెస్‌కు అనర్హం'అనే సూక్తిని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పాటిస్తున్నాడు. తనకు నచ్చిన పని చేసేందుకు ధోనీ ఏ మాత్రం వెనుకాడడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత అనేక వ్యాపారాలు ప్రారంభించిన ధోనీ.. సతీమణి సాక్షి సింగ్ సాయంతో అన్ని రంగాల్లోకి అడుగుపెట్టాడు. చివరకు సినిమా రంగంతో పాటు వ్యవసాయాన్ని కూడా అతను వదిలి పెట్టలేదు.

కరోనా లాక్‌డౌన్ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉండలేకపోయిన ధోనీ.. తన 40 ఎకరాల ఫామ్ హౌస్‌లో వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. స్వయంగా తానే టాక్టర్ సాయంతో పొలం దున్నాడు. ఈ ఫామ్‌ హౌస్‌లో డైరీ, స్ట్రాబెర్రీ, కాలిఫ్లవర్, వరి వంటి పంటలను పండించిన ధోనీ..కడక్ నాథ్ కోళ్ల‌ను కూడా పెంచాడు.

ఫుల్‌ డిమాండ్..

ఈ కడక్‌నాథ్ కోళ్లకు మార్కెట్‌లో ఫుల్ డిమాండ్ ఉంది. ఈ కోళ్లు ప్రత్యేకమైన జాతికి చెందినవి. వీటి మాంసం, ఎముకలు, రక్తం కూడా నలుపు రంగులో ఉంటాయి. ఇవి సాధారణ బ్రాయిలర్ కోళ్ల కంటే ఆరోగ్యకరమైనవని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. ఈ బ్లాక్ చికెన్‌లో తక్కువ కొలెస్ట్రాల్, అధిక ప్రోటిన్ ఉంటాయి. మార్కెట్‌లో ఈ కడక్ నాథ్ కోళ్లు కిలోకు రూ. 700 నుంచి 1500 ధర పలుకుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఒక్క కోడి ధర రూ. 3000-4000గా ఉంది. ధోనీ ఫామ్‌లో పెంచిన కడక్ నాథ్ కోడి మాంసం కిలో ధర రూ. 1000గా ఉందని వార్తలు వచ్చాయి.

MS Dhoni Selling Kadaknath Chicken for Rs 1000 a Kilo in Ranchi

ధోనీ తన ఫామ్‌ హౌస్‌లో రేసు గుర్రాలను కూడా పెంచుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తన బైక్, కార్ కలెక్షన్స్‌కు సంబంధించి షెడ్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. రాంచీకి వచ్చిన టీమిండియా ఆటగాళ్లకు కూడా ధోనీ ఎన్నో సార్లు ఈ ఫామ్ హౌస్‌లోనే విందు ఇచ్చాడు. రాంచీలో ధోనీ హెల్మెట్ సాయంతో బైక్‌పై చక్కర్లు కొట్టిన వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి.

రూ. 1000 కోట్ల ఆస్థి..

దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ధోనీ కోట్లు సంపాదించినా.. సాధారణంగా జీవించడానికే ఎక్కువ ఇష్టపడుతాడు. ఐపీఎల్ టైమ్‌లో మినహా.. మిగతా సమయాన్ని మొత్తం ఫామ్ హౌస్‌లో గడిపేందుకు ప్రయత్నిస్తాడు. వ్యాపారాల విషయంలో తన సతీమణికి అండగా ఉంటాడు. తాజా నివేదికల ప్రకారం ధోనీ నెట్ వర్త్ రూ. 1000 కోట్లుగా ఉంది. ధోనీ ప్రధాన ఆధాయ వనరులు బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే వస్తాయి. పెప్సీ, రీబాక్, టీవీఎస్ మోటార్స్, గల్ఫ్ ఆయిల్, డ్రీమ్11, ఓరియంట్ ఎలక్ట్రిక్, మాస్టర్‌కార్డ్ వంటి 30కి పైగా బ్రాండ్‌లకు అతను ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారానే ఏడాదికి రూ.100 కోట్లు ఆర్జిస్తున్నాడు. ధోనీకి సొంతంగా సెవెన్(లైఫ్‌స్టైల్ బ్రాండ్), చెన్నైయిన్ ఎఫ్‌సీ(ఫుట్‌బాల్ టీమ్), స్పోర్ట్స్‌ఫిట్ వరల్డ్ (జిమ్), హోటల్ మహి రెసిడెన్సీ, 7ఇంక్ బ్రూస్, కడక్ నాథ్ కోళ్ల వ్యాపారం, ఎంఎస్ ధోనీ గ్లోబల్ స్కూల్‌లు ఉన్నాయి. ఖతాబుక్ , కార్స్24 , బ్లూస్మార్ట్ మొబిలిటీ , గరుడ ఏరోస్పేస్, రిగి , ఎమోటోరాడ్ వంటి అనేక స్టార్టప్స్‌లో ఏంజిల్ ఇన్వెస్టర్‌గా ధోనీ పెట్టుబడులు పెట్టారు.

Story first published: Tuesday, July 1, 2025, 10:43 [IST]
Other articles published on Jul 1, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+