టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై దిగ్గజ క్రికెటర్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రశంసల జల్లు కురిపించాడు. ప్రపంచ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాటర్ అని కొనియాడాడు. ధోనీ సారథ్యంలోనే విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
కెరీర్ ఆరంభంలో విఫలమైన విరాట్ కోహ్లీకి ధోనీ పూర్తిగా అండగా నిలిచాడు. ధోనీ సహకారంతో అవకాశాలు అందుకున్న కోహ్లీ.. అంచెలంచెలుగా ఎదిగాడు. అత్యుత్తమ బ్యాటర్‌గా ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్నాడు. ధోనీ జట్టులో ఉండగానే.. అతని గైడెన్సీలోనే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు.

తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీని.. కోహ్లీతో ఉన్న రిలేషన్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'మేం 2008-09 నుంచి కలిసి ఆడాం. మా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం ఉంది. కాబట్టి నేను కోహ్లీకి పెదన్ననా?.. సహచర ఆటగాడినా? మీరు ఏమని పిలుస్తారో నాకు తెలియదు.
కానీ చివరకు మేం ఇద్దరం సహచర ఆటగాళ్లం. మా ఇద్దరిలో ఎవరూ సుదీర్ఘ కాలం ఆడారనేది కూడా మీకు తెలుసు. ప్రపంచ క్రికెట్ విషయానికి వస్తే మాత్రం విరాట్ కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు.'అని ధోనీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
విరాట్ కోహ్లీ సైతం ధోనీతో తనకు ఉన్న సంబంధాన్ని తరుచూ గుర్తు చేస్తుంటాడు. ధోనీ తనకు పెద్దన్న అని, అరంగేట్ర ఆటగాడిగా.. కెప్టెన్‌గా అండగా నిలిచాడని చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. మరోవైపు ధోనీ కూడా కోహ్లీని కొనియాడుతూనే ఉన్నాడు. అతని బ్యాటింగ్ నైపుణ్యం, ఆటపట్ల ఉన్న అంకిత భావం, ఫిట్‌నెస్‌ను ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు.
కోహ్లీ సామర్థ్యాన్ని పసిగట్టే అతనికి అండగా నిలిచానని కూడా ధోనీ చెప్పుకొచ్చాడు. ధోనీ జట్టులో ఉండగానే విరాట్ కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ధోనీ సూచనలు, గైడెన్సీలోనే అతను సారథ్య బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే ధోనీని తన మెంటార్‌గా కోహ్లీ అభివర్ణించాడు.

మైదానంలో కోహ్లీ, ధోనీ అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. మిడిలార్డర్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అసాధారణ విజయాలు అందించారు. ధోనీకి తన గుండెలో ప్రత్యేకమైనచోటు కూడా ఉందని, తన కెరీర్ అసాంతం ధోనీ అండగా నిలిచాడని కూడా కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.