Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CSK vs DC: అదే కొంపముంచిందన్న ధోనీ.. నా హీరోపైనే గెలవడం సంతోషంగా ఉందన్న రిషభ్ పంత్!

MS Dhoni says Starting IPL games at 7.30pm gives team bowling first an advantage

ముంబై: గురు-శిశ్యుల సమరంగా సాగిన హై స్కోరింగ్ హై ఓల్డేజ్ మ్యాచ్‌ను కాస్తా వన్‌సైడ్‌ వార్‌గా మార్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. ఐపీఎల్ 2021 సీజన్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టింది. బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో భారీ టార్గెట్‌ను ఊదేసి.. మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌కు షాకిచ్చింది. అయితే ఈ మ్యాచ్‌లో తమ వ్యూహాలన్ని బెడిసి కొట్టాయని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. టాస్ ఓడిపోవడం, డ్యూ ప్రభావం, బౌలర్ల వైఫల్యం తమ ఓటమిని శాసించాయని తెలిపాడు.

మా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు..

మా ప్లాన్స్ వర్కౌట్ కాలేదు..

'మా బౌలింగ్‌ ఆలోచనలు బెడిసికొట్టాయి. ఇక ముందు మ్యాచుల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తాం. టాస్‌ గెలిస్తే బౌలింగే తీసుకునేవాళ్లం. ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో రాత్రి పూట మంచు ప్రభావం ఉంటుంది. 7.30కే మ్యాచ్ ప్రారంభమవ్వడం చేజింగ్ టీమ్‌కు అడ్వాంటేజ్‌గా మారింది. ఈ టైమ్‌లో తొలుత బ్యాటింగ్ చేస్తే ఖచ్చితంగా 15-20 పరుగులు ఎక్కువ చేయాల్సిందే. ఎందుకంటే మంచు ప్రభావం కారణంగా చేజింగ్ టీమ్‌ను ఆపడం కష్టం అవుతుంది. బంతిపై బౌలర్లకు పట్టు చిక్కదు.

అదే ఆలోచనతో..

అదే ఆలోచనతో..

టాస్ ఓడగానే వీలైనన్ని పరుగులు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలనుకున్నాం. అదే వ్యూహంతో బరిలోకి దిగాం. కానీ అద్భుత బంతులకు మా ఓపెనర్లు వెనుదిరిగారు. ఇక మా బౌలింగ్ చాలా పేలవంగా ఉంది. పదే పదే బౌండరీలు కొట్టే బంతులు వేసారు. మా బౌలింగ్ మరింత మెరుగవ్వాలి తదుపరి మ్యాచ్‌కు మా తప్పిదాలను సరిదిద్దుకొని బరిలోకి దిగుతాం. ఢిల్లీ బౌలర్లు చాలా చక్కగా బౌలింగ్ చేశారు. మంచి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు సంధించారు'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

 ఎప్పటికీ మరిచిపోలేను..

ఎప్పటికీ మరిచిపోలేను..

తన అభిమాన క్రికెటర్, స్పూర్తి ప్రదాత మహేంద్ర సింగ్ ధోనీతో కలిసి టాస్‌కు వెళ్లడం, అతని‌పై విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని విన్నింగ్ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు. ఈ అద్భుత క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పుకొచ్చాడు. '189 పరుగుల ఛేదనలో శిఖర్ ధావన్‌, పృథ్వీషాలు అర్ధసెంచరీలతో కదంతొక్కి అద్భుతంగా ఆడారు. టాస్‌కు ధోనీతో కలిసి వెళ్లడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇక బౌలింగ్​లో క్రిస్‌ వోక్స్‌, ఆవేశ్‌ ఖాన్‌లు చక్కటి ప్రదర్శన చేశారు. నోర్ట్జే, రబాడల గైర్హాజరీలో కూడా అద్భుతంగా రాణించారు. నాకు స్ఫూర్తిగా నిలిచిన ధోనీపైనే పైచేయి సాధించడం సంతోషంగా ఉంది'అని పంత్ చెప్పుకొచ్చాడు.

అలవోకగా..

అలవోకగా..

తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్‌ రైనా (36 బంతుల్లో 54; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా... మొయిన్‌ అలీ (24 బంతుల్లో 36; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్యామ్‌ కరన్‌ (15 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. వోక్స్, అవేశ్‌ ఖాన్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. అనంతరం ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌ (54 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృథ్వీ షా (38 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

Story first published: Sunday, April 11, 2021, 16:07 [IST]
Other articles published on Apr 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+