మా నాన్న.. నేను టెన్త్ కూడా పాసైతానో లేదోనని కంగారు పడ్డాడు: ధోనీ

చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం తెరిచిన పుస్తకం. క్రికెటర్ అయ్యేందుకు అతను పడ్డ కష్టాలు.. టికెట్ కలెక్టర్ ఉద్యోగం చేసిన విషయం.. పెళ్లికి ముందు ప్రేమాయణం.. సాక్షి సింగ్‌తో పెళ్లి.. ఇలా ప్రతీ విషయం అందరికి తెలిసిందే. తన జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ధోనీ అన్‌టోల్డ్ స్టోరీ సినిమాతో అతని కష్ట, సుఖాలను జనాలను తెలుసుకున్నారు. అయితే ఎవరికి తెలియని ఓ విషయాన్ని ధోనీ తాజాగా పంచుకున్నాడు. వరల్డ్ బెస్ట్ క్రికెటర్‌గా ఎదిగి.. ప్రస్తుతం కోట్లు ఆర్జిస్తున్న ధోనీ.. అసలు టెన్త్ కూడా పాసవుతాడో లేడోనని అతని తండ్రి తెగ కంగారు పడ్డాట. ఈ విషయాన్ని ధోనీనే స్వయంగా తెలిపాడు.

టెన్త్ పాస్సవ్వడం డౌటే..
స్కూల్ డేస్‌లో క్రికెట్ కోసం తాను క్లాస్‌లకు డుమ్మా కొట్టిఎక్కువగా గ్రౌండ్‌లోనే ఉండటంతో మళ్లీ సంప్లిమెంటరీలు రాయాల్సి వస్తుందని తన తండ్రి పాన్ సింగ్ ఆందోళన చెందినట్లు ధోనీ వెల్లడించాడు. ధోనీ ఏడో తరగతిలోనే క్రికెట్ ఆడటాన్ని ప్రారంభించాడు. మొదట్లో అతను స్కూల్ ఫుట్‌బాల్ టీమ్‌కి గోల్ కీపర్‌గా ఉండేవాడు. కానీ ఆ తర్వాత కోచ్ సూచన మేరకు క్రికెట్ టీమ్‌కి వికెట్ కీపర్‌గా మారిన విషయం తెలిసిందే.

క్లాస్‌లో కంటే గ్రౌండ్‌లోనే..
తాజాగా సూపర్ కింగ్స్ అకాడమీని తమిళనాడులోని హోసూరులో ప్రారంభించిన ధోనీ అనంతరం ఎంఎస్ ధోనీ గ్లోబల్ స్కూల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఈ క్రమంలో తన స్కూల్ డేస్‌ను కూడా ధోనీ గుర్తు చేసుకున్నాడు. 'నేను ఏడో తరగతిలో క్రికెట్ ఆడటాన్ని ప్రారంభించాను. అప్పటికి నేను ఓ యావరేజ్ స్టూడెంట్‌ను. అయితే క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసిన తర్వాత క్లాస్‌లో నా అటెండెన్స్ నెమ్మదిగా తగ్గుతూ వెళ్లింది. ఒక అటెండెన్స్ విషయం వదిలేస్తే నేను చాలా గుడ్ స్టూడెంట్. టెన్త్ క్లాస్‌కి వచ్చేసరికి ఎక్కువగా గ్రౌండ్‌లోనే ఉండేవాడ్ని.

పాఠాలపై అవగాహన లేదు..
దాంతో టెన్త్ క్లాస్‌లో చాలా ఛాప్టర్స్‌పై నాకు కనీసం అవగాహన కూడా లేకపోయింది. కానీ ఎగ్జామ్స్‌లో ఆ ఛాప్టర్స్‌కు సంబంధించిన ప్రశ్నలే వస్తే ఎంత బాధగా ఉంటుంది. ఇక మా నాన్న నేను కనీసం టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ కూడా పాసవ్వనని అనుకున్నాడు. మళ్లీ సంప్లిమెంటరీలు రాసుకోవాల్సిందేనని ఆయన ఫిక్సైపోయారు. కానీ నేను పదో తరగతి పాసయ్యాను. అది కూడా 66 శాతం మార్కులతో. దాంతో చాలా సంతోషపడ్డాడు.'అని ధోనీ గుర్తు చేసుకున్నాడు.

ఏకైక కెప్టెన్..
కెప్టెన్‌గా భారత జట్టుకి 2007లో టీ20 వరల్డ్‌కప్, 2011లో వన్డే ప్రపంచకప్ అందించిన ధోనీ.. 2013 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియాని విజేతగా నిలిపాడు. క్రికెట్ ప్రపంచంలో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ ధోనీనే. అలాను ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని నాలుగు సార్లు టైటిల్ విజేతగా ధోనీ నిలిపాడు. 2020 ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ.. కేవలం ఐపీఎల్‌లోనే కొనసాగుతున్నాడు. ఈ ఏడాది చెన్నై చెపాక్ వేదికగా జరగనున్న మ్యాచ్‌తో ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పేందుకు ధోనీ సిద్దమవుతున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications