Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే నాకు చెన్నై అంటే ఇష్టం: ధోనీ

న్యూఢిల్లీ: చెన్నై నగరంతో తనకు విడదీయని బంధం ఉందని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. చెన్నై నగరమన్నా.. తమిళ ప్రజలన్నా తనకు చాలా ఇష్టమని తెలిపాడు. చాలా ఏళ్ల క్రితమే చెన్నై తన సొంత ఊరిగా అడాప్ట్ చేసుకున్నానని తెలిపాడు. ఇటీవలే సినిమా రంగంలో నిర్మాతగా అడుగుపెట్టిన ధోనీ సతీమణి సాక్షి సింగ్.. 'ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' పేరుతో ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించింది.

తమ బ్యానర్‌లో మొదటి సినిమాగా 'ఎల్‌జీఎమ్'(లెట్స్ గెట్ మ్యారీడ్)'తమిళ మూవీని నిర్మించింది. తెలుగులో 'కాదలి', 'జెర్సీ' వంటి సినిమాల్లో నటించిన హరీశ్ కళ్యాణ్ హీరోగా నటిస్తుంటే 'లవ్‌ టుడే' సినిమాతో యూత్‌లో బీభత్సమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఇవాన హీరోయిన్‌గా నటిస్తోంది. నదియా, రోగి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ఇప్పటికే విడుదలై అభిమానులను ఆకట్టుకుంది.

 MS Dhoni says Chennai is more special to me, I was adopted here long back on LGM Trailer Launch

నేడు చెన్నై వేదికగా ఈ మూవీ ట్రైలర్, ఆడియో రిలీజ్ వేడుక జరగ్గా.. ధోనీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఎల్‌జీఎమ్ మూవీ ట్రైలర్‌తో పాటు ఆడియోను తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా చెన్నై, తమిళ ప్రజలతో తనకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు.

'నా కెరీర్‌ తొలి టెస్ట్ మ్యాచ్ చెన్నై వేదికగానే ఆడాను. హయ్యెస్ట్ టెస్ట్ స్కోర్ కూడా ఇక్కడే సాధించాను. ఇప్పుడు నా ప్రొడక్షన్‌లో తొలి తమిళ మూవీ రాబోతుంది. చెన్నైతో నాది విడదీయలేని బంధం. చాలా రోజుల క్రితమే చెన్నైని నా హోమ్ టౌన్‌గా అడాప్ట్ చేసుకున్నాను'అని ధోనీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

అంతకుముందు చెన్నై విమానశ్రయంలో ధోనీ దంపతులకు ఘన స్వాగతం లభించింది. ధోనీ రాకను తెలుసుకున్న చెన్నై అభిమానులు పెద్ద ఎత్తున హాజరైన ధోనీకి స్వాగతం పలికారు. కొందరైతే 'మహీ భాయ్ మోకాలి సర్జరీ అయ్యింది.. ఇప్పుడు ఎలా ఉంది?'అని గట్టిగా అరుస్తూ ధోనీ యోగ క్షేమాలు అడిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మాహీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌, క్రేజ్‌కు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే చాలు, సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించనుంది. ఒకవేళ ఈ సినిమాలో మాహీ చిన్న పాత్రలో కనిపిస్తే, టాక్‌తో సంబంధం లేకుండా ధోనీ ఫ్యాన్స్, థియేటర్‌కి పరుగులు పెట్టడం ఖాయం.

'మంచి కథలతో సినిమాలు తీయాలని అనుకుంటున్నాం. ఈ సినిమాతో కొత్త కెరీర్‌ని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఇంటిల్లిపాదీ ఆనందంగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ చూసేలా ఉంటుంది 'అని సాక్షి సింగ్ చెప్పుకొచ్చింది.

Story first published: Monday, July 10, 2023, 20:08 [IST]
Other articles published on Jul 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+