Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అసత్య వార్తలపై ధోనీ వైఫ్ సాక్షి సింగ్ ఫైర్!!

MS Dhoni’s wife Sakshi Singh hits out at false news
MS Dhoni Wife Sakshi Singh Trashes Out Media For Spreading Fake News

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కరోనాపై పోరాడేందుకు రూ. లక్ష రూపాయలు సాయం చేశాడనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రూ.800 కోట్ల నికర విలువ కలిగిన ధోనీ లక్ష రూపాయలు సాయం చేయడం ఏంటని అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇవన్నీ అసత్య వార్తలేననీ ధోనీ సతీమణి సాక్షిసింగ్ స్పష్టం చేసింది.

బాధ్యత ఉండక్కర్లేదు..

ఇంత విపత్కర కాలంలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయడం తగునా? అని మీడియాను ట్విటర్ వేదికగా ప్రశ్నించింది. ‘సెన్సిటీవ్ సమయంలో ఇలాంటి తప్పుడు వార్తల ప్రచారాన్ని ఆపాలని అన్నీ మీడియా చానెళ్లను కోరుతున్నా. బాధ్యతాయుతమైన జర్నలిజం ఎక్కడా కనిపించకపోవడం ఆశ్చర్యకరం. మీరు చేసిన ఈ పని పట్ల సిగ్గుపడుతున్నా'అని సాక్షి సింగ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇంతకీ ఏం జరిగిందంటే..

ఇక కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన పూణేలోని పేదలను ఆదుకునేందుకు కృషి చేస్తున్నా ప్రముఖ ఫండ్ రైసింగ్ సంస్థ మాధ‌వ్‌ ఫౌండేషన్‌కు ధోనీ లక్ష రూపాయల విరాళం అందజేశాడు. ఈ విష‌యాన్ని ధోనీ భార్య సాక్షి సింగ్ సోష‌ల్ మీడియాలో ప్ర‌క‌టించిందనే ప్రచారం జరిగింది. సాక్షి మాత్రం ఇవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేస్తుంది.

సాక్షి ట్వీట్‌లో నో క్లారిటీ..

సాక్షి ట్వీట్‌లో నో క్లారిటీ..

అయితే ధోనీ రూ. లక్ష రూపాయలు ఇచ్చాడనా? లేక ఈ విషయాన్ని తను చెప్పినట్లు జరుగుతున్న ప్రచారం తప్పా అనే విషయంలో సాక్షి క్లారిటీ ఇవ్వలేకపోయింది. మరోవైపు ఇండియా టూడే ఎడిటర్ విక్రాంత్ గుప్తా మాత్రం ధోనీ లక్ష రూపాయలే సాయం చేయడానికి గల కారణం ఏంటో తెలియజేశాడు.

‘లక్ష రూపాయలే సాయం చేశాడని సిగ్గులేని ప్రజలు ధోనీని విమర్శిస్తున్నారు. సదరు ఫండ్ రైసింగ్ సంస్థ 12 లక్షల 50 వేల రూపాయలను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ధోనీ లక్ష రూపాయలు సాయం చేశాడు. సాయం చేశానని చెప్పుకునే వ్యక్తి కాదు. నాకు తెలిసి ఇప్పటికే అతను విరాళం ఇవ్వచ్చు. 'అని ట్వీట్ చేశారు.

Story first published: Friday, March 27, 2020, 17:54 [IST]
Other articles published on Mar 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+