Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పెళ్లంటే నిప్పుతో చెలగాటమే: ధోనీ (వీడియో)

"వద్దురా సోదరా పెళ్లంటే నూరెళ్ల మంటరా" అని మన్మధుడు చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగర్జున యువతను హెచ్చరించాడు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం పెళ్లంటే నిప్పుతో చెలగాటమని చెబుతూ నవ్వులు పూయించాడు. ప్రపంచకప్ గెలిచినా.. వరల్డ్ బెస్ట్ కెప్టెన్ అయినా భార్యల ముందు సాధారణ భర్తేనని స్పష్టం చేశాడు. ఓ వివాహ వేడుకలో ధోనీ మాట్లాడిన ఈ మాటలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా వధూవరులకు ధోనీ కొన్ని సలహాలు, సూచనలు కూడా చేశాడు.

'పెళ్లి మంచిదే. ప్రస్తుతం మీరు పెళ్లి చేసుకునే హడావుడిలో ఉన్నారు. పెళ్లంటే నిప్పుతో చెలగాటం ఆడటమే. ఉత్కర్ష్(పెళ్లి కొడుకు) కూడా ఆ ఆటను ఆడాలనుకుంటున్నాడు. పెళ్లి విషయంలో నాకు కూడా ఎలాంటి మినహాయింపు లేదు. నా భార్య కూడా ఇంతే. ఇక్కడ ఉన్న భర్తల అందరి పరిస్థితి కూడా ఇంతే. నువ్వు ప్రపంచకప్ గెలిచావా? లేదా? అనేది ఇక్కడ అసలు విషయమే కాదు.'అని ధోనీ అనగా.. అక్కడ నవ్వులు పూసాయి.

MS Dhoni s Remark Marriage Is Like Playing With Fire Goes Viral

తర్వాత ధోనీ.. వధువుకు కొన్ని సలహాలిచ్చాడు. 'భర్త కోపంగా ఉన్నప్పుడు శాంతంగా ఉండాలి. భర్త కోపం ఐదు నిమిషాల్లో ఆవిరవుతుంది. మీకు నా శుభాకాంక్షలు'అని చెప్పాడు. అయితే ఈ వివాహ వేడుక ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలపై స్పష్టత లేదు. కానీ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. ధోనీ కూడా మనలానే పెళ్లాం బాధితుడేని, ధోనీ బయట పులి అయినా.. ఇంట్లో పిల్లే అంటూ నెటిజన్లు వ్యంగ్రాస్త్రాలు సంధిస్తున్నారు.

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ.. కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న సంగతి తెలిసిందే. 44 ఏళ్ల వయసులోనూ తన ఆటతో అభిమానులను అలరిస్తున్నాడు. బ్యాటింగ్‌లో మునపటిలా రాణించలేకపోతున్నా.. కీపింగ్‌లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌ కోసం ధోనీ సిద్దమవుతున్నాడు. ఈ సీజన్‌తో అతను రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉంది.

Story first published: Saturday, November 29, 2025, 11:59 [IST]
Other articles published on Nov 29, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+