Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ధోనీ తల్లిదండ్రులకు కరోనా.. ఆసుపత్రికి తరలింపు!

MS Dhonis mother and father tested positive for COVID-19 at ranchi

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తల్లిదండ్రులు దేవకి దేవీ, పాన్ సింగ్‌లు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ వైరస్ లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా ఇద్దరికి పాజిటీవ్ అని తేలింది. దాంతో వారిని వెంటనే రాంచీలోనీ పల్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా బిజీగా ఉన్న ధోనీ.. ముంబై‌లో మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ రోజు వాంఖడే మైదానం వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగే మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తెల్చుకోనుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు రెండింటిలో విజయం సాధించింది.

ఐపీఎల్ 2020 సీజన్ అనంతరం ఆటకు దూరమైన మహీ.. పూర్తిగా కుటుంబంతో గడిపాడు. ట్రైనింగ్ క్యాంప్‌లో భాగంగా మార్చిలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కలిసాడు. అనంతరం చెన్నై జట్టు ముంబైకి చేరుకోగా.. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏడు రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతుండగా.. ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి.

బీసీసీఐ నిబంధనల ప్రకారం పకడ్బందీ బయో బబుల్‌లో ఆటగాళ్లను ఉంచారు. గత 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 2.95 లక్షల కేసులు నమోదయ్యాయి. పలు రాష్టాల్లో లాక్‌డౌన్ అమలవుతుంగా.. మరికొన్ని రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించారు.

Story first published: Wednesday, April 21, 2021, 10:58 [IST]
Other articles published on Apr 21, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+