Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: ముంబై ఇండియన్స్‌ను ఓడించేలా ధోనీ మాస్టర్ ప్లాన్! ఏంటంటే?

MS Dhoni’s master move CSK training camp shifts from Chennai to Surat ahead of IPL 2022

న్యూఢిల్లీ: వరల్డ్ బెస్ట్ కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐసీసీ ట్రోఫీలన్నీ అందించిన ఏకైక సారథి ధోనీనే. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్‌కు నాలుగు టైటిళ్లు అందించాడు. సీనియర్ ఆటగాళ్లతో కూడిన డాడీస్ ఆర్మీని పలుమార్లు విజేతగా నిలబెట్టి విమర్శకుల నోళ్లు మూయించాడు. వేలం నుంచి ఆటగాళ్ల ఎంపిక, టీమ్ కాంబినేషన్.. ఇలా ప్రతీ విషయంలో కీలకంగా వ్యవహరించే ధోనీ తన మాస్టర్ మైండ్‌తో చెన్నై సూపర్ కింగ్స్‌ను మేటీ జట్టుగా నిలిపాడు. ఇటీవల బెంగళూరు వేదికగా ముగిసిన వేలంలోనూ ధోనీ తన మార్క్‌ను చూపించాడు. గతేడాది ఫైనల్ ఆడిన తుది జట్టులో నుంచి 8 మంది ఆటగాళ్లను మళ్లీ తీసుకున్నాడు.

ఆ విషయంలో ధోనీ దిట్ట..

ఆ విషయంలో ధోనీ దిట్ట..

పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించడంలో ధోనీ దిట్ట. అతని ముందు చూపు ఎక్కవు. ఈ స్పెషల్ క్వాలిటీస్‌తోనే టీమిండియా కెప్టెన్‌గా.. చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ పలు రికార్డులను నమోదు చేశాడు. ఇక ఐపీఎల్ 2022 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఖారారు చేసింది. మార్చి 26 నుంచి మే 29 వరకు ధనాధన్ లీగ్ నిర్వహిస్తామని చెప్పింది. 10 జట్ల రాకతో ఫార్మాట్‌లో కొద్దిగా మార్పులు చేసింది.

అంతేకాకుండా మహరాష్ట్రాలోనే లీగ్ మొత్తాన్ని పూర్తి చేస్తామని వెల్లడించింది. 70 లీగ్‌ మ్యాచ్‌ల్లో 20 మ్యాచ్‌లు ముంబై వాంఖెడే స్టేడియంలో, 20 మ్యాచ్‌లు ముంబై డీవై పాటిల్‌ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు ముంబై బ్రబోర్న్‌ స్టేడియంలో, 15 మ్యాచ్‌లు పుణే స్టేడియంలో నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది. నాలుగు ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌ లు అహ్మదాబాద్‌లో జరిగే అవకాశం ఉంది.

ముంబైని ఢీకోట్టేందుకు..

ముంబైని ఢీకోట్టేందుకు..

ముంబై వేదికగా మ్యాచ్‌లు జరగడం ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి అడ్వాంటేజ్ అవుతుందనే ఇతర ఫ్రాంచైజీల వాదనను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ధోనీ తన మాస్టర్ మైండ్‌తో వ్యూహాత్మక అడుగు వేసాడు. ప్రతీ ఏడాది అందరి కన్నా ముందే చెన్నై వేదికగా ట్రైనింగ్ క్యాంప్ మొదలు పెట్టే సీఎస్‌కే.. ఈ సారి కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించనుంది.

కానీ చెన్నై వేదికగా కాకుండా తమ శిక్షణ శిభిరాన్ని సూరత్‌కు మార్చింది. మ్యాచ్‌లన్నీ మహారాష్ట్రలోనే జరుగనుండటంతో ధోనీ సూచనలతో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై ఇండియన్స్‌ను ఓడించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సూరత్‌కే ఎందుకంటే..?

సూరత్‌కే ఎందుకంటే..?

సూరత్‌లోని లాల్‌భాయి కాంట్రాక్టర్‌ స్టేడియంను ఇటీవలే కొత్తగా నిర్మించారు. ఇక్కడి పిచ్‌ల ముంబై మాదిరి పిచ్‌లనే పోలి ఉంటాయి. ఈ విషయం తెలుసుకున్న ధోనీ, సీఎస్‌కే క్యాంపును సూరత్‌లో నిర్వహించాలని వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నాడట. సూరత్‌ జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నైనేశ్‌ దేశాయి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఈ విషయాన్ని వెల్లడించాడు.

'ధోనీ, డ్వేన్‌బ్రావో, రవీంద్ర జడేజా వంటి అంతర్జాతీయ క్రికెటర్లు ప్రాక్టీస్ కోసం సూరత్‌కు రానున్నారు. ఇక్కడి మట్టి ముంబై మట్టిని పోలి ఉంటుంది. అందుకే దీనిని వాళ్లు సెలక్ట్‌ చేసుకున్నారు'' అని తెలిపారు. మార్చి 2 నుంచి సీఎస్‌కే ప్రాక్టీస్ క్యాంప్ మొదలు కానుంది.

చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు..

చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు..

రవీంద్ర జడేజా(రూ.16 కోట్లు), మహేంద్ర సింగ్ ధోనీ(రూ.12 కోట్లు), మొయిన్ అలీ(రూ.8 కోట్లు), రుతురాజ్ గైక్వాడ్(రూ.6 కోట్లు), దీపక్ చాహర్(రూ.14 కోట్లు), అంబటి రాయుడు(రూ.6.75 కోట్లు), డ్వేన్ బ్రావో(4.40 కోట్లు), శివమ్ దుబే(రూ.4 కోట్లు), క్రిస్ జోర్డాన్(రూ.3.60 కోట్లు), రాబిన్ ఊతప్ప(రూ.2 కోట్లు), మిచెల్ సాంట్నర్(రూ.1.90 కోట్లు), ఆడమ్ మిల్నే(రూ.1.90 కోట్లు), రాజ్‌వర్ధన్ హంగార్గేకర్(రూ.1.50 కోట్లు), ప్రశాంత్ సోలంకీ (రూ.1.20 కోట్లు), డేవాన్ కాన్వే(రూ. కోటి), మహీష్ తీక్షణ(రూ.70 లక్షలు), డ్వేన్ ప్రిటోరియస్(రూ.50 లక్షలు), హరి నిశాంత్(రూ.20 లక్షలు), జగదీషన్(రూ.20 లక్షలు), ఆసిఫ్(రూ.20 లక్షలు), తుషార్ దేశ్‌పాండే(రూ.20 లక్షలు), సిమ్రజీత్ సింగ్(రూ.20 లక్షలు), సుభ్రాన్షు సేనాపతి(రూ.20 లక్షలు), ముఖేష్ చౌదరి(రూ.20 లక్షలు), కే భగత్ వర్మ(రూ.20 లక్షలు)

Story first published: Saturday, February 26, 2022, 16:17 [IST]
Other articles published on Feb 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+