Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తొందరేం లేదు.. టీ20 ప్రపంచకప్ తర్వాతే మహీ రిటైర్మెంట్: ధోనీ చిన్ననాటి కోచ్

 MS Dhonis childhood coach Keshav Banerjee Says former Team India skipper can play the T20 World Cup even next year

రాంచీ: భారత మాజీ కెప్టెన్, సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ వ్యవహారంపై తీవ్ర చర్చ నడుస్తున్న వేళ అతని చిన్ననాటి కోచ్ కేశవ్ బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 ప్రపంచకప్ వాయిదా పడినా.. వచ్చే ఏడాది జరిగినా ధోనీ ఆడుతాడని ఆయన స్పష్టం చేశాడు. ఆ మెగా టోర్నీ తర్వాతే తన ఆటకు వీడ్కోలు పలుకుతాడన్నాడు.

తన నిర్ణయాన్ని ప్రకటించే ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి సమాచారం అందిస్తాడని ఈ విషయంలో అత్యుత్సాహం పనికిరాదని విమర్శకులకు సూచించాడు. ఓ ప్రాపర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి, అందరి సమక్షంలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని తెలిపాడు. ఇక బుధవారం #DhoniRetires అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్‌మీడియాలో ట్రెండ్ అవడంతో ధోనీ రిటైర్మెంట్ వ్యవహారం మరో సారి చర్చకు దారి తీసింది.

ఈ నేపథ్యంలో ఓ వార్త సంస్థతో కేశవ్ బెనర్జీ మాట్లాడుతూ.. ధోనీ రిటైర్మెంట్ గురించి నేరుగా ప్రజలకు చెప్పి తప్పుకునే వ్యక్తి కాదన్నాడు. 'ధోనీ ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని నేరుగా ప్రజలకు చెప్పి తప్పుకునే వ్యక్తి కాదు. ఆ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో ఎలా చెప్పాలో అతనికి బాగా తెలుసు. ఆ సమయం వచ్చిందని అతను ఫీలైతే వెంటనే బీసీసీఐకి సమాచారం ఇచ్చి ఓ ప్రాపర్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విధంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడు.

సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. అందులో చాలా ఫేక్ న్యూస్ ట్రెండ్ అవుతాయి. ధోనీ రిటైర్మెంట్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. కానీ అతని గురించి నాకు బాగా తెలుసు. రిటైర్మెంట్ తీసుకునే సమయం ఆసన్నమైందని ధోనీ భావిస్తే అతనే మనందరికి చెప్పి ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తాడు. ఇప్పటికీ అతను ఎంత ఫిట్‌గా ఉన్నాడో ఐపీఎల్‌లో మీకే తెలుస్తుంది. టీ20 ప్రపంచకప్ వాయిదా పడినా.. వచ్చే ఏడాది జరిగినా అతను ఆ మెగా టోర్నీ ఆడగలడు.'అని బెనర్జీ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికే ఈ వార్తలను ధోనీ సతీమణి సాక్షిసింగ్ ఖండించింది. లాక్‌డౌన్‌తో జనాల మతిభ్రమించినట్లుందని ఘాటుగా ట్వీట్ చేసింది. అభ్యంతరాలు రావడంతో వెంటనే దాన్ని తొలగించింది. కానీ అప్పటికే ఆ ట్వీట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి. ఇక ధోనీ అభిమానులు, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కౌంటర్‌గా #DhoniNeverTires ట్యాగ్‌ను ట్రెండ్ చేసారు. భారత మాజీ కోచ్ గ్యారీ క్రిస్టన్ కూడా రిటైర్మెంట్‌పై నిర్ణయం తీసుకొనే అధికారం మహీకే ఉందని ఆ విషయాన్ని అతనికే వదిలేయాలన్నాడు.

Story first published: Thursday, May 28, 2020, 20:20 [IST]
Other articles published on May 28, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+