Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే శివమ్ ధూబేను పక్కనపెట్టాం: ధోనీ

చెన్నై: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం.

ఈ వికెట్‌పై ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లు ఆడాం. మ్యాచ్ జరుగుతున్నా కొద్ది వికెట్ నెమ్మదించే అవకాశం ఉంది. ఈ పిచ్‌పై ఫిర్యాదు చేయడం లేదు. పరిస్థితులను సాధారణంగా మార్చాలనుకుంటున్నాం. ప్రణాళికలకు తగ్గట్లు ఆడాలనుకుంటున్నాం. మా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేసే ప్రయత్నం చేస్తాం.

Shivam Dube

తప్పని పరిస్థితుల్లో జట్టులో ఒక మార్పు చేయాల్సి వచ్చింది. ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న శివమ్ దూబే స్థానంలో అంబటి రాయుడ్ని తుది జట్టులోకి తీసుకున్నాం.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.అయితే శివమ్ దూబే ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగాడు. బ్యాటింగ్ మాత్రమే చేయనున్నాడు.

ఇంపాక్ట్ ప్లేయర్ పేరు చెప్పే క్రమంలో ధోనీ తప్పిదం చేశాడు. దాంతో సూపర్ ఫామ్‌లో ఉన్న దూబేను ఎలా పక్కనపెడతారని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్‌గా దూబే జట్టులోకి రావడంతో అందరూ సీఎస్‌కే తప్పిదాన్ని గ్రహించారు. ఫిట్‌నెస్ సమస్యలతోనే దూబే కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కానున్నాడు.

పిచ్ చాలా డ్రైగా ఉందని ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ అన్నాడు. తమ ఆటగాళ్లు సత్తా చాటాల్సిన అవసరం ఉందన్నాడు.

పవర్ ప్లేలో మెరుగ్గా బ్యాటింగ్ చేయడంపై ఫోకస్ పెట్టామన్నాడు. పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేసి ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కు కట్టడి చేయాలన్నాడు. మనీశ్ పాండే స్థానంలో లలిత్ యాదవ్ జట్టులోకి వచ్చాడు.

తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్(కెప్టెన్), ఫిలిప్ సాల్ట్(కీపర్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, అక్షర్ పటేల్, ఆమన్ హకీమ్ ఖాన్, రిపల్ పటేల్, లలిత్ యాదవ్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డేవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహీశ్ తీక్షణ

Story first published: Wednesday, May 10, 2023, 19:38 [IST]
Other articles published on May 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+