ప్రధాని మోదీ అంత పాపులారిటీ ఉన్నా.. రాజకీయాలకు దూరంగా ఉంటా: ధోనీ

న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతటి పాపులారిటీ తనకు ఉన్నా.. రాజకీయాల జోలికి పోనని టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. తాను చాలా ముక్కుసూటిగా మాట్లాడుతానని, రాజకీయాల్లో ఇది పనికిరాదని అభిప్రాయపడ్డాడు. భారత రాజకీయాలకు తన వ్యక్తిత్వం సూట్ అవ్వదనే అటువైపు వెళ్లడం లేదని స్పష్టం చేశాడు. తనకు రాజకీయనాయకుడిగా ఉండటం కంటే సైనికుడిగా ఉండటమే చాలా ఇష్టమని తెలిపాడు. ఆర్మీతో ఉండటాన్ని తాను బాగా ఆస్వాదిస్తానని చెప్పుకొచ్చాడు. మాస్టర్ కార్డ్ ప్రమోషన్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ధోనీ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

రాజకీయాలు నాకు సెట్ అవ్వవు...
'నేను పొలిటిషియన్ కంటే సైనికుడిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతాను. ఆర్మీతో గడపడాన్ని ఎక్కువ ఆస్వాదిస్తాను. నేను చాలా ముక్కు సూటిగా ఉంటాను. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటే.. నాకున్న నాలెడ్జ్ సరిపోదు. చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎన్నో విషయాలు మార్చుకొని పరిస్థితులను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఇది నాతో అయ్యే పని కాదు. క్రికెట్ వల్లే నాకు ఇంత ఆదరణ లభించింది. నేను క్రికెటర్ కాకపోయి ఉంటే.. ఇంత మంది నాపై ప్రేమను చూపించేవారు కాదు. క్రికెట్‌కు నా కృతజ్ఞతలు. 'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

పాలిటిక్స్ టఫ్..
రాజకీయల్లో రాణించడం చాలా కఠినమని చెప్పిన ధోనీ.. విమర్శలు గుప్పించినంత తేలికైన పని కాదని చమత్కరించాడు. ప్రధాని నరేంద్ర మోదీ తర్వాత అత్యంత ఆధరణ కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందినా.. రాజకీయాల్లో నెగ్గుకు రావడం చాలా కష్టమన్నాడు. తన ఆట సహజసిద్దంగా ఉండటంతో ప్రజలు ఎక్కువ కనెక్ట్ అయ్యారని ధోనీ చెప్పుకొచ్చాడు. గల్లీ క్రికెట్ మాదిరి, సాధారణ ప్రజలు ఆడే ఆట తాను ఆడటంతోనే వారి ప్రేమను మరింత ఎక్కువగా అందుకోగలిగానని చెప్పాడు. తనలో వారి ఆటను చూసుకున్నారని, దాంతో ఈ ఆదరణ దక్కిందన్నాడు.

ఆ రెండు ఘటనలు..
తన జీవితంలో రెండు సంఘటనలు ఎప్పుడు మరిచిపోలేనని ధోనీ తెలిపాడు. 2007 ప్రపంచకప్ విజయం తర్వాత భారత్‌లో తమకు లభించిన స్వాగతం ఎప్పటికీ మరిచిపోలేని ఘటనని ధోనీ చెప్పుకొచ్చాడు. డబుల్ డెక్కర్ బస్‌లో వాంఖడే మైదానానికి బయల్దేరిన తమకు వేల మంది అభిమానులు నవ్వుతూ స్వాగతం పలికారని చెప్పాడు. ఇక 2011 వన్డే ప్రపంచకప్ గెలిచినప్పుడు కూడా ఇంత ఘనమైన స్వాగతం పలకలేదన్నాడు. ఇక 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో తాను, యువీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గ్యాలరీలో ఉన్న ప్రేక్షకులు వందేమాతరం అంటూ చేసిన నినాదాలు ఇప్పటికీ తన చెవిలో మారుమోగుతున్నాయని తెలిపాడు. ఈ రెండు ఘటనలు తన జీవితంలోనే ప్రైస్‌లెస్ మూమెంట్స్ అని చెప్పుకొచ్చాడు.

జీవా అంటే వెలుగు..
దేశం తరఫున ఆడటం ఎప్పుడూ గొప్ప మోటీవేషన్ అని చెప్పిన ధోనీ.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలనే ఎప్పుడూ కోరుకునేవాడినని తెలిపాడు. క్రికెటర్‌గా అవకాశం దొరకడం గొప్ప విషయమన్నాడు. జీవా అంటే వెలుగు అని, ఆమె పుట్టినప్పుడు తాను లేనని ధోనీ తెలిపాడు. ఇప్పటికీ తన భార్య ఈ విషయంలో తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తుందని తెలిపాడు. అయితే 2015 వన్డే ప్రపంచకప్ అనంతరం భారత్‌కు వచ్చిన తాను నెల రోజుల జీవాను చూశానని, ఆ క్షణం నా జీవితంలో మరిచిపోలేని మూమెంటని చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications