MS Dhoni Retires: ధోనీ రిటైర్మెంట్‌పై సాక్షి భావోద్వేగ పోస్ట్!!

రాంచీ: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. శనివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఓ పోస్ట్ ఉంచాడు. 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. మహీ వీడ్కోలుపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక మహీ రిటైర్మెంట్‌పై ఎందరో స్పందించారు. కొందరు ఆయనతో కలిసి నడిచిన కాలాన్ని గుర్తుచేసుకోగా.. మరికొందరు శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు మహీ ఘనతల్ని గుర్తు చేసుకుంటూ ఫొటోలు, వీడియోల్ని ట్విటర్‌లో షేర్ చేస్తున్నారు.

కన్నీళ్లను దిగమింగుకొని
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై ఆయన సతీమణి సాక్షిసింగ్ ధోనీ స్పందించారు. దేశం గర్వపడేలా ఎన్నో విజయాలను మహీ అందిచారని, ప్రజలు వాటిని మర్చిపోతారు కానీ ఆ క్షణంలో వారికి ఆయన అందించిన అనుభూతిని మర్చిపోలేనిదని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పేర్కొన్నారు. 'మహీ.. మీరు సాధించిన విజయాలను చూసి గర్వపడాలి. రిటైర్మెంట్ ప్రకటించినందుకు అభినందనలు. మీరు సాధించిన విజయాలను చూసి నేను గర్విస్తున్నా. మీకిష్టమైన ఆటకు గుడ్‌బై చెప్పే క్రమంలో మీరు పడిన మనోవేదన నాకు తెలుసు. కన్నీళ్లను దిగమింగుకొని రిటైర్మెంట్ ప్రకటించారని అనుకుంటున్నాను' అని సాక్షి ట్వీట్ చేశారు.

ఆ అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు
'మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పిన మాటలు, చేసిన పనిని ప్రజలు మర్చిపోతారేమో కానీ.. వాళ్లకు అందించిన అనుభూతిని ఎప్పుడూ మర్చిపోలేరు' అని అని సాక్షి పేర్కొన్నారు. 2004లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ధోనీ.. తొలుత ఫినిషర్‌గా వెలుగులోకి వచ్చి ఆ తర్వాత వికెట్ కీపర్, కెప్టెన్‌గా భారత్ జట్టులో తిరుగులేని ముద్ర వేశాడు. ధోనీ బ్యాటింగ్‌లో బాదుడు తప్ప.. టెక్నిక్ లేదని అప్పట్లో విమర్శించిన వాళ్లకి భారీ ఇన్నింగ్స్‌లతో సమాధానం చెప్పిన మహీ.. కీపింగ్‌లోనూ అత్యున్నత ప్రమాణాల్ని అందుకున్నాడు.

ఏకైక కెప్టెన్
దాదాపు 16 ఏళ్ళ పాటు భారత జట్టుకు ఎంఎస్ ధోనీ సేవలు అందించాడు. మూడు ఫార్మాట్లలో కూడా టీమిండియాకు ధోనీ అన్ని విధాలుగా తన బాధ్యతలు నిర్వహించి మంచి విజయాలు అందించాడు. 2007లో టీ20 ప్రపంచకప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్ (2011)తో పాటు 2013లో చాంపియన్ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు.

చెన్నైలో ధోనీ
ప్రస్తుతం ఎంఎస్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే. బీసీసీఐ రూల్స్ ప్రకారం ధోనీ బుధవారం రాంచీలో కోవిడ్19 పరీక్షలు చేయించుకోగా.. రిపోర్టులో నెగటివ్ అని తేలింది. దీంతో చెన్నై ప్రాంచైజీ ఏర్పాటు చేసిన ఫిట్‌నెస్ క్యాంప్ కోసం చెన్నై చేరుకున్నాడు. యూఏఈ వెళ్లే ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తమ ఆటగాళ్ల కోసం ఒకవారం పాటు ఫిట్‌నెస్ క్యాంప్ ఏర్పాటు చేసింది. అందుకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం నుంచి సైతం అనుమతులు లభించాయని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి 20 వరకు చెన్నై చెపాక్ స్టేడియంలో ఫిట్‌నెస్ క్యాంప్ జరగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
రైనా చివరి మ్యాచ్ ఎప్పుడు ఆడాడో తెలుసా?!!