
వైరస్ కారణంగా
సెప్టెంబర్ 19 నుంచి యూఏఈ వేదికగా ఆరంభంకానున్న ఐపీఎల్-13 సీజన్‌లో ఎంఎస్ ధోనీ సత్తా నిరూపించుకుంటే మళ్లీ భారత జట్టులోకి వస్తాడని అభిమానులుందరూ ఆశించారు. కానీ మహీ హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేశాడు. వాస్తవానికి టీ20 ప్రపంచకప్ అనంతరం ధోనీ తన కెరీర్‌ను ముగించాలనుకున్నాడు. కానీ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మహీ తన రిటైర్మెంట్ ప్లాన్‌ను మార్చుకోవాల్సి వచ్చింది.

పూర్తి మద్దతు
ఏడాదికి పైగా ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నప్పటికీ.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి అతనికి పూర్తి మద్దతు ఉంది. ఐపీఎల్ 2020 తర్వాత మాజీ సారథి తిరిగి జట్టులోకి వస్తాడని హెడ్ కోచ్ రవిశాస్త్రి కూడా చెప్పాడు. ధోనీ ఎన్నిరోజులు ఆడకున్నా.. మైదానంలోకి దిగితే పరుగులు చేయగలడన్న నమ్మకం వారిది. జాతీయ జట్టులోకి వచ్చేందుకు మహీకి ఎలాంటి ఇబ్బందులు లేవు. అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ వాయిదా పడటంతో.. ధోనీ తన ఆలోచనను మార్చుకొని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

స్నేహితుడితో చర్చ?
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్లాన్ గురించి తన స్నేహితులలో ఒకరితో చర్చించాడు. మహీ 2020 టీ20 ప్రపంచకప్ ఆడటానికి ఆసక్తి చూపించాడని సన్నిహితుడొకరు చెప్పారు. ఈ ఏడాది జరగాల్సిన ప్రపంచకప్ 2022లో జరగనుంది. ధోనీ రిటైర్మెంట్ వార్తల గురించి అతని మేనేజర్, చిన్ననాటి స్నేహితుడు గతంలో మిహిర్ దివాకర్ మాట్లాడుతూ... 'చిన్ననాటి స్నేహితులమైనప్పటికీ.. అతని క్రికెట్ గురించి మేం ఎప్పుడూ మాట్లాడుకోం. కానీ ధోనీ మాటల్ని బట్టి చూస్తుంటే.. అతనికి రిటైర్మెంట్ ఆలోచనే లేదని తెలుస్తోంది. ప్రస్తుతం అతని లక్ష్యం ఒక్కటే ఐపీఎల్‌లో రాణించడం. దానికోసం ఈ ఏడాది ఆరంభంలో అతను దాదాపు 30 రోజులు చెన్నైలో ప్రాక్టీస్ చేశాడు. ఐపీఎల్ కోసం ధోనీ చాలా శ్రమిస్తున్నాడు' అని వెల్లడించాడు.

చెన్నైలో ప్రాక్టీస్:
ఎంఎస్ ధోనీ ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ నిర్వహిస్తున్న ప్రాక్టీస్ క్యాంప్ కోసం తాజాగా చెన్నై చేరుకున్నాడు. శనివారం ప్రాక్టీస్ ప్రారంభం అయింది. ఆ ప్రాక్టీస్ ఆదివారం కూడా కొనసాగింది. ఈ ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన వీడియోను సీఎస్‌కే అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలో ఆటగాళ్లు తమ ప్రాక్టీస్ ముగించుకొని హోటల్‌కు పయనమవుతున్నారు. ఈ సందర్భంగా క్యాంప్ పర్యవేక్షకుడు, సీఎస్‌కే బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ రైనాను అప్యాయంగా కౌగిలించుకోగా.. రైనా.. ధోనీకి హగ్ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications

రైనా రిటైర్మెంట్.. షాక్‌లో రోహిత్, హర్భజన్!!










