
ముంబై: భారత క్రికెట్ జట్టు మాజీ సారధి ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వార్త తెలియగానే క్రికెట్ అభిమానులు బరువెక్కిన హృదయంతో ఉన్నారు. ఇక ధోనీ రిటైర్మెంట్ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సురేశ్ రైనా ప్రకటించాడు. రైనా రిటైర్మెంట్ ప్రకటనపై అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇద్దరు టాప్ ఆటగాళ్లు, అందూలోనూ ఒకే జట్టుకు చెందిన ప్లేయర్స్ ఇలా ఓకేరోజు రిటైర్‌మెంట్ ఇవ్వడం ఏంటని చెవులుకొరుకున్నారు.
సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటనపై సహచరులు హర్భజన్ సింగ్, రోహిత్ శర్మలు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం వారు ట్విటర్ వేదికగా స్పందించారు. 'సురేష్ రైనా రిటైర్మెంట్‌తో షాక్‌కు గురయ్యాను. రైనా.. నీకు మంచి ఫిట్‌నెస్, వయసు ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు నీ అవసరం చాలా ఉందనుకుంటున్నాను. కానీ అప్పుడే రిటైర్మెంట్ ఇచ్చేశావు. నీ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్ ది బెస్ట్' అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్వీట్ చేశారు.
'సురేష్ రైనా రిటైర్మెంట్ ప్రకటనపై కొద్దిగా షాక్ తిన్నాను. కానీ రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్నావు, తీసుకున్నావు. మంచి కెరీర్, గొప్ప రిటైర్‌మెంట్ అవ్వాలి. మనం రంగంలోకి దిగిన రోజు నాకింకా గుర్తే!!. నువ్వు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా' అని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రాసుకొచ్చాడు. 'రైనా.. నీకు అభినందనలు. భారతదేశం తరఫున అద్భుతమైన కెరీర్ ఆడావు. మీ తొలి టెస్ట్ సమయంలో మన భాగస్వామ్యం, ఆన్-ఫీల్డ్ సంభాషణలను ఇప్పటికీ గుర్తున్నాయి' అని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. 'టాప్ కెరీర్ "భవేష్"కు అభినందనలు. నీ సెకండ్ ఇన్నింగ్స్‌కు ఆల్ ది బెస్ట్' అని కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీటాడు.
2005లో వన్డే క్రికెట్ అరంగేట్రం చేసిన సురేష్ రైనా.. మొత్తం 266 వన్డేల్లో 5,615 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 116 పరుగులు. వన్డే ఫార్మాట్లో ఐదు సెంచరీలు, 36 అర్ధ శతకాలు నమోదు చేశాడు. వన్డేల్లో 36 వికెట్లు కూడా తీశాడు. 2010లో టెస్టు క్రికెట్‌లోకి అడుగు పెట్టిన రైనా.. 18 టెస్టుల్లో 768 రన్స్ బాదాడు . ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. 2006లో అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన రైనా.. టీ20ల్లో 134.79 స్ట్రైక్‌రేట్‌తో 1,604 పరుగులు చేశాడు. గత ఏడాది జూలైలో చివరిగా వన్డే ఆడిన రైనా.. ఆ తర్వాత పేలవ ఫామ్ కారణంగా జట్టులో చోటు కోల్పోయాడు. చివరికి రిటైర్మెంట్ ఇచ్చాడు.