For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni Retirement: హార్ట్ ట‌చ్ చేసిన ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ సాంగ్!!

MS Dhoni Retirement: MS Dhoni posted a video montage along with the Bollywood song

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్ ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్టు శనివారం ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ప్రకటించాడు. ఇన్నేళ్లు తనకు మద్దతుగా నిలిచిన అభిమానులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపాడు. ధోనీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి సాధించింది. మహీ అనూహ్య నిర్ణయంతో యావత్‌ క్రీడాలోకం ఆశ్చర్యంలో మునిగింది. అయితే ధోనీ త‌న కెరీర్‌కు చెందిన బెస్ట్ ఫోటోస్‌తో రిటైర్మెంట్‌ వీడియోను రూపొందించాడు.

హార్ట్ ట‌చ్ చేసిన ధోనీ:

హార్ట్ ట‌చ్ చేసిన ధోనీ:

మై ఫ‌ల్ దో ఫ‌ల్ కా షాయ‌ర్ హూ.. ఫ‌ల్ దో ఫ‌ల్ మేరీ క‌హానీ హై.. ఫ‌ల్ దో ఫ‌ల్ మేరీ హ‌స్తీ హై.. ఫ‌ల్ దో ఫ‌ల్ మేరీ జ‌వానీ హై.. ఇది బాలీవుడ్ ఫేమస్ పాట‌. ఎంఎస్ ధోనీ త‌న కెరీర్‌కు చెందిన బెస్ట్ ఫోటోస్‌తో రిటైర్మెంట్‌ వీడియోను రూపొందించాడు. ఆ వీడియోకు ఈ సాంగ్‌ను జత చేశాడు. త‌న ఇన్‌స్టాలో పోస్టు చేసిన రిటైర్మెంట్ కామెంట్స్‌తో పాటు ఈ వీడియోను మహీ అటాచ్ చేశాడు. ధోనీ త‌న రిటైర్మెంట్ వీడియోకు ఈ పాట‌ను ఎంపిక చేసుకున్న తీరు అత‌ని మ‌న‌సును తెలుపుతున్న‌ది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో అందరి హార్ట్ ట‌చ్ చేస్తోంది.

బాలీవుడ్‌లో క్లాసిక్ సాంగ్‌:

'మై ఫ‌ల్ దో ఫ‌ల్ కా షాయ‌ర్ హూ' అనే పాట బాలీవుడ్‌లో క్లాసిక్ సాంగ్‌. 1976లో రిలీజైన 'క‌బీ క‌బీ' సినిమాలోనిది. సీనియర్ హీరో అమితాబ్ బచ్చన్ న‌టించిన ఆ సినిమా అప్ప‌ట్లో బంపర్ హిట్ అయింది. ముఖేశ్ ఈ పాట‌ను పాడారు. ఖ‌య్య‌మ్ సంగీతం అందించారు. సాహిర్ లుదియాన్వి ఈ పాట‌ను రాశారు. య‌శ్ చోప్రా ఆ సినిమాకు డైర‌క్ట‌ర్‌. అయితే ఈ సినిమాలో ఉన్న అన్ని పాట‌లు హైలెట్‌. ఖ‌య్య‌మ్ స్వ‌ర‌ప‌రిచిన‌ బాణీలు అప్పట్లో సినీ ప్రేక్ష‌కుల్ని ఎంతో థ్రిల్ చేశాయి. ఈ సినిమాకు బెస్ట్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ అవార్డు కూడా ద‌క్కింది.

 న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్:

న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్:

39 ఏళ్ల ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌లో పలు రికార్డులు నమోదు చేశాడు. ప్రపంచ క్రికెట్‌లో టీమిండియాను నెంబర్‌ 1 స్థానానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాట్స్‌మెన్‌, వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌గా ధోనీ టీమిండియాకు ఎంతో కృషి చేశాడు. 2004 డిసెంబర్‌ 23న బంగ్లాదేశ్‌తో వన్డే మ్యాచ్‌లో టీమిండియా జట్టులోకి మహీ అరంగ్రేటం చేశాడు. ఆ మ్యాచ్‌లో పరుగులేమీ చేయకుండా రనౌట్‌ అయ్యాడు. ఇక 2005లో శ్రీలంకతో మ్యాచ్‌లో తొలి టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2006లో తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. చివరి సారిగా 2019 జులై 19న ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు.

90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు:

90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు:

అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్‌ బాదాడు. వీటిల్లో 10 సెంచరీలతో పాటు 73 అర్థ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183‌. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,600 పరుగుల చేశాడు. సారథిగా టీమిండియాను ముందుండి నడిపించిన ధోనీ.. ఓ సమయంలో క్రికెట్‌ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన బీసీసీఐని శాసించే స్థాయికి ఎదిగాడు.

ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌కు కారణం ఇదేనా?

Story first published: Saturday, August 15, 2020, 22:48 [IST]
Other articles published on Aug 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+