For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni Retirement: ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌కు కారణం ఇదేనా?

Is this the reason for MS Dhonis retirement?
MS Dhoni Retirement : T20 Worldcup ఆడాలనుకున్న Dhoni..ఇంతలో ఎందుకు Retirement ప్రకటించారంటే..?

చెన్నై: కొద్దిసేపటి క్రితమే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈమేరకు ఓ పోస్ట్ ఉంచాడు. 'కెరీర్‌ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని మహీ ఓ వీడియో పోస్ట్ చేశాడు. మహీ వీడ్కోలుపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా మహీ రిటైర్మెంట్‌ ప్రకటించడంతో అభిమానుల హృదయం ముక్కలైంది. ఊహించని విధంగా మహీ రిటైర్మెంట్‌ ప్రకటించడానికి కారణాలు వెతికే పనిలో పడ్డారు.

 రిటైర్మెంట్‌కు కారణం ఇదే?:

రిటైర్మెంట్‌కు కారణం ఇదే?:

అంతర్జాతీయ క్రికెట్‌లో, భారత క్రికెట్ చరిత్ర‌లో అత్యంత విజయవంతమైన సారథి ఎంఎస్ ధోనీ షెడ్యూల్‌ ప్రకారం ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ వరకు పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కొనసాగాలని భావించాడు. ఆ విజయంతో క్రికెట్ జీవితం నుంచి నిష్క్రమించాలని కోరుకున్నాడు. అయితే కరోనా వైరస్ మహమ్మారి అంతా తలక్రిందులు చేసింది. కరోనా వల్ల టీ20 ప్రపంచకప్‌ వాయిదా పడటం, ఇప్పట్లో టీమిండియా వన్డే, టీ20 సిరీస్‌లో తలపడే అవకాశాలు లేకపోవడంతో మహీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం తెలుస్తోంది.

జట్టు సభ్యులతో కలిసి చెన్నైలో:

జట్టు సభ్యులతో కలిసి చెన్నైలో:

సెప్టెంబర్‌ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌-13 సీజన్‌ ఆరంభం కాబోతుండటంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా జట్టుకు మరోసారి టైటిల్‌ సాధించిపెట్టాలని ఎంఎస్ ధోనీ భావిస్తున్నాడు. ఐపీఎల్‌లో ప్రదర్శన ఆధారంగా మహీ జాతీయ జట్టులోకి వచ్చే అవకాశాలను సెలక్టర్లు పరిగణిస్తారని, కుర్రాళ్ల కోసం ధోనీ తన స్థానం నుంచి తప్పుకోవాలని గత కొద్దిరోజులుగా క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత క్రికెట్లో ధోనీని మించిన ఫినిషర్ లేడని మాజీ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న మహీ ప్రస్తుతం జట్టు సభ్యులతో కలిసి చెన్నైలో ఉన్నాడు. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్‌ 10వరకు ఐపీఎల్ 2020 జరుగనున్న సంగతి తెలిసిందే.

 2004లో అరంగేట్రం:

2004లో అరంగేట్రం:

ఎంఎస్ ధోనీ 2004లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో మహీ పరుగులేమీ చేయకుండా రనౌట్‌ అయ్యాడు. ఇక చివరిగా గతేడాది జులైలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఆడాడు. ఇక టెస్టుల విషయానికొస్త.. 2005లో శ్రీలంకతో మహీ తొలి టెస్టు ఆడగ.. 2014లో ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.

 ‌2007లో తొలిసారి నాయకత్వం:

‌2007లో తొలిసారి నాయకత్వం:

2007లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ జట్టుకు తొలిసారి ఎంఎస్ ధోనీ నాయకత్వం వహించాడు. పాకిస్థాన్‌పై జరిగిన ఉత్కంఠ పోరులో ధోనీసేన విజయం సాధించింది. అదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన ఏడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు మహీ తొలిసారి కెప్టెన్‌ అయ్యాడు. 2008లో టెస్ట్‌ సిరీస్‌ నిమిత్తం ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో పర్యటించగా.. అనిల్‌ కుంబ్లే గాయపడటంతో అప్పటివరకూ వైస్‌ కెప్టెన్‌గా ఉన్న ధోనీ పూర్తిస్థాయి టెస్ట్‌ జట్టు‌కు కెప్టెన్ అయ్యాడు. మహీ నాయకత్వంలో భారత క్రికెట్‌ జట్టు 2009 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తొలి స్థానానికి చేరుకుంది.

Story first published: Saturday, August 15, 2020, 21:59 [IST]
Other articles published on Aug 15, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+