చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్‌కు ఆ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిదా అయ్యాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
అయితే ఆకాశ్ మధ్వాల్ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ కొట్టిన సిక్సర్‌కు ధోనీ ఫిదా అయ్యాడు. డ్రెస్సింగ్ రూమ్ నుంచి ధోనీ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ టీవీ కెమెరాల్లో కనిపించింది. వారెవ్వా అంటూ ధోనీ తన హవా భావాలను పలికించాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ధోనీ మెచ్చిన ఆటగాడు అంటే మజాకా అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఆకాశ్ మధ్వాల్ వేసిన 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ ఐదో బంతిని ఆకాశ్ మధ్వాల్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేయగా.. స్టెప్ ఔట్ అయిన గైక్వాడ్.. ఓవర్ డీప్ పాయింట్ దిశగా స్లైస్ షాట్‌తో సిక్సర్ రాబట్టాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్(40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 69), శివమ్ దూబే(38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 66 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటగా.. చివరి ఓవర్‌లో మహేంద్ర సింగ్ ధోనీ(4 బంతుల్లో 3 సిక్స్‌లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీయగా.. గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్ తలో వికెట్ తీసారు. రచిన్ రవీంద్రతో కలిసి 52 పరుగులు జోడించిన రుతురాజ్ గైక్వాడ్.. శివమ్ దూబేతో కలిసి మూడో వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.