For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2020: చెన్నై చేరుకున్న ధోనీ.. ఇక ప్రాక్టీసే తరువాయి!

MS Dhoni reaches chennai to start practice for IPL 2020
IPL 2020 : MS Dhoni & Co Reaches Chennai For CSK Training Camp || Oneindia Telugu

రాంచీ: ఐపీఎల్ 2020 సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శుక్రవారం చెన్నై చేరుకున్నాడు. మహీకి నిర్వహించిన కరోనా టెస్ట్‌లో నెగటీవ్ రావడంతో ఈ జార్ఖండ్ డైనమైట్ ప్రత్యేక విమానంలో చెన్నైకి వచ్చాడు. ఇక్కడ రేపటి(ఆగస్టు 15) నుంచి 20 వరకు జరగనున్న సీఎస్‌కే కండీషనింగ్ క్యాంప్‌లో పాల్గొననున్నాడు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి రాంచీలోని తన ఫామ్ హౌస్‌లోనే ఉంటున్న మహీ.. బుధవారం స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రికి కరోనా టెస్ట్‌కు సంబంధించిన శాంపిల్స్ ఇచ్చాడు. అందులో నెగటీవ్ రావడంతో ప్రాక్టీస్ క్యాంప్ కోసం చెన్నై వచ్చాడు. ఇక ధోనీ చెన్నై వచ్చిన విషయాన్ని సీఎస్‌కే ట్వీట్ చేసింది. 'తాల దర్శనం రిలోడెడ్.. #WhistlePodu #StartTheWhistles' అనే హ్యాష్ ట్యాగ్‌లతో క్యాప్షన్‌గా పేర్కొంది.

ధోనీతో పాటు పీయూష్ చావ్లా, సురేశ్ రైనా, కరణ్ శర్మ, దీపక్ చాహర్ కూడా చెన్నైకి చేరుకున్నారు. వీరంతా ఒకే ఫ్లైట్‌లో వచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో అందరు కలిసి దిగిన ఫొటోను సురేశ్ రైనా ట్వీట్ చేశాడు. ఈ ప్రాక్టీస్ శిబిరానికి బౌలింగ్ కోచ్ ఎల్ బాలాజీ నేతృత్వం వ‌హించనున్నాడు. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తప్ప ఈ క్యాంప్‌కు భారత్‌కు చెందిన సీఎస్‌కే ఆటగాళ్లు అందరూ హాజరవుతున్నారు. క్యాంప్ అనంతరం ఆగస్టు 21న చెన్నై జట్టు దుబాయ్‌కు బయలుదేరనుంది. కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, అసిస్టెంట్‌ కోచ్‌ మైఖేల్‌ హస్సీ 22న దుబాయ్‌లో జట్టుతో కలుస్తారు.

ఇక చెన్నై జట్టుతో ఎనిమిది మంది తమిళనాడు బౌలర్లు దుబాయ్‌కు వెళ్లనున్నారు. వీరంతా నెట్ బౌలర్లుగా సేవలందించనున్నారు. అశ్విన్ క్రిస్ట్‌, జే కౌశిక్‌, ఎం మొహ‌మ్మ‌ద్‌, ఔశిక్ శ్రీనివాస్‌, ఎల్ విఘ్నేశ్‌, అభిషేక్ త‌న్వార్‌లు నెట్ బౌలర్లుగా ఎంపికైన‌ వారిలో ఉన్నారు. వీరందరూ 21న చెన్నై జ‌ట్టుతో పాటు యూఏఈ వెళ్లనున్నారు.

నిబంధనల ప్రకారం దుబాయ్‌కు వెళ్లేముందు రెండు సార్లు.. అక్కడికి చేరుకున్న తర్వాత మొదటి రోజు, మూడో రోజు, ఆరో రోజు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ టెస్ట్‌ల్లో నెగటీవ్ వస్తే బయోబబుల్ వాతావరణంలో మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతిస్తారు. ఇక టోర్నీ జరుగుతున్నంత కాలం ఐదు రోజులకోసారి బయోబబుల్‌లో ఉన్నందరికి పరీక్షలు నిర్వహిస్తారు. ఈ బయోబబుల్‌లో ఆటగాళ్లంతా మాస్క్‌లు పెట్టుకోవడంతో పాటు భౌతిక దూరం తప్పనిసరి పాటించాలి. ఒకవేళ ఎవరైనా బబుల్ రూల్స్ బ్రేక్ చేస్తే.. వాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సిందే.

Story first published: Friday, August 14, 2020, 18:50 [IST]
Other articles published on Aug 14, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+