ధోనీ బైక్ రైడ్:
ఎంఎస్ ధోనీ మంగళవారం (జులై 7) 39వ పుట్టిన రోజు జరుపుకొన్నాడు. మహీ జన్మదినం సందర్భంగా సహచర క్రికెటర్లు, సెలబ్రిటీలు, అభిమానులు సోషల్‌మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. మహీకి రైడింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి.. తన బర్త్ డే సందర్భంగా ఫామ్‌హౌజ్‌లో బైక్‌పై చక్కర్లు కొట్టాడు. మాజీ కెప్టెన్ కనబడితే జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని కొంతమంది అభిమానులు మహీ ఫామ్‌హౌస్ ఇంటి గేటు వద్ద వేచి చూస్తున్నారు. ఈ సమయంలో ధోనీ బైక్‌పై రావడంతో.. ఫ్యాన్స్ అతనికి బర్త్ డే విషెస్ చెప్పారు. కొందరు అభిమానులు అయితే.. 'మహీ ఒక్కసారి ఆగండి' అని అరిచారు. అయితే అతను అభిమానులకు అభివాదం చేసి వెళ్లిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

రిటైర్మెంట్ ఆలోచనలు లేవు:
ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్‌పై ఇటీవల వార్తలు రావడంతో అతని అభిమానులను కలవరానికి గురయ్యారు. ఈ విషయంపై ధోనీ మేనేజర్ మిహిర్ దివాకర్ తాజాగా స్పందించాడు. 'మేమిద్దరం స్నేహితులుగా ఉన్నాం కాబట్టి తన క్రికెట్ గురించి ఎక్కువగా మాట్లాడుకోం. కానీ ధోనీని చాలా దగ్గరగా చూశాను కాబట్టి ఒక విషయం అందరికీ చెప్పగలను. మహీకి రిటైర్మెంట్‌పై ఇప్పుడే ఎటువంటి ఆలోచనలు లేవు. ఐపీఎల్ 2020 ఆడాలని ఎంతో ఆశగా ఉన్నాడు. టోర్నీ కోసం ఎంతో కష్టపడ్డాడు కూడా. లాక్‌డౌన్ కంటే ఒక నెల ముందే చెన్నైలో సాధన మొదలుపెట్టాడు' అని దివాకర్ స్పష్టం చేసాడు.

లాక్‌డౌన్ ఎత్తేశాక మళ్లీ సాధన:
కరోనా వైరస్ లాక్‌డౌన్ సమయంలోనూ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన ఫామ్‌హౌజ్‌లోనే ఫిట్‌నెస్ కాపాడుకున్నాడని మిహిర్ దివాకర్ చెప్పాడు. పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ఎత్తేశాక మహీ మళ్లీ సాధన మొదలుపెడతాడని, కరోనా పరిస్థితులు సద్దుమణిగడంపై మహీ ప్రాక్టీస్ ఆధారపడి ఉంటుందని ఆయన వివరించాడు. అంతర్జాతీయ కెరీర్‌లో ధోనీ ఇప్పటివరకు 90 టెస్టుల్లో, 350 వన్డేల్లో, 98 టీ20 మ్యాచ్‌ల్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. క్రికెట్ చరిత్రలోనే అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఘనతను ధోనీ అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 332 మ్యాచ్‌లకు మహీ కెప్టెన్సీ వహించాడు. ధోనీ తర్వాతి స్థానంలో ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్ (324 మ్యాచ్‌లు) ఉన్నాడు.

ఏకైక సారథిగా చరిత్ర:
క్రికెట్ ప్రపంచంలోనే తనదైన సారథ్యంతో గొప్ప కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఈ రాంచీ డైనమైట్.. ఎవరికీ సాధ్యం కానీ అరుదైన ఘనతను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. యువ క్రికెటర్‌గానే 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన మహీ.. మూడు దశాబ్దాలుగా ఊరించిన ప్రపంచకప్‌ను 2011లో అందించి యావత్ భారతం ఉప్పొంగేలా చేశాడు. అనంతరం 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచి.. ఐసీసీ టైటిళ్లన్నీ గెలిచిన ఏకైక సారథిగా చరిత్రకెక్కాడు.
సెలక్షన్‌లోని పొరపాట్లే ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ఓటమికి కారణం: మాజీ కెప్టెన్


Click it and Unblock the Notifications












