Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MS Dhoni ఆస్థులు ఎన్ని కోట్లో తెలుసా?

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ‌కి సంబంధించి 'స్టాక్‌గ్రో' అనే సంస్థ ఆసక్తిక విషయాన్ని వెల్లడించింది. వరల్డ్ బెస్ట్ కెప్టెన్‌గా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న మహేంద్ర సింగ్ ధోనీ ఆస్థుల విలువను వెల్లడించింది. స్టాక్‌ గ్రో లెక్కల ప్రకారం ధోనీ నెట్ వర్త్ రూ.1040 కోట్లు ఉండగా.. అతనికి సొంత కంపెనీలు ఉన్నాయని తెలిపింది.

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడటం ద్వారా ధోనీ ఏడాది రూ.12 కోట్లు తీసుకుంటున్నాడని, బ్రాండ్ల ఎండార్స్‌మెంట్ ద్వారా రూ.4-6 కోట్లు, సోషల్ మీడియా‌లో వాణిజ్య ప్రకటనలకు రూ.1-2 కోట్లు ఆర్జిస్తున్నాడని పేర్కొంది. అలాగే వివిధ కంపెనీల్లో ధోనీ పెట్టుబడులు పెట్టారని, అతని దగ్గర ఎన్నో విలువైన కార్లు, బైక్స్ ఉన్నాయని తెలిపింది.

MS Dhonis Net Worth

ధోనీ ఆస్తుల లెక్కలతో ఓ పోస్ట్ డిజైన్ చేసి విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రకారం.. కొన్ని స్పోర్ట్స్ కంపెనీల్లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. రియల్ ఎస్టేట్‌లోనూ ధోనీ ప్రధాన భాగస్వామిగా ఉన్నాడు., సొంతంగా కంపెనీలు కూడా ఉన్నాయి.

సెవెన్, ఖతాబుక్, షాకాహరీ, గరుడ, ఆర్‌ఐజీఐ, కార్స్ 24, హోమ్‌లేన్ కంపెనీల్లో ధోనీ పెట్టుబడులు పెట్టాడు. ధోనీ ఎంటర్‌‌టైన్‌మెంట్ పేరిట సొంతంగా చిత్ర నిర్మాణ సంస్థ ఉంది. మహీ రెసిడెన్సీ పేరిట హోటల్, బెంగళూరులో ఎంఎస్ ధోనీ గ్లోబల్ స్కూల్‌లు ఉన్నాయి.

రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పాటు 17.8 కోట్లు విలువ చేసి ఇల్లు డెహ్రాడూన్‌లో ఉంది. రాచీలో పెద్ద ఫామ్ హౌజ్ కూడా ఉంది. జియోసినిమా, అన్‌అకాడమీ, స్కిప్కర్, విన్జో, ఓరియో, వయాకామ్ 18, కోల్‌గేల్, కార్స్ 24, ఒప్పో, గో డాడీ, పోకర్స్ స్టార్స్, లైవ్ ఫాస్ట్, స్నీకర్స్, సియారామ్స్, అమిటీ యూనివర్సీటీ, డ్రీమ్ ఎలెవన్, మాస్టర్ కార్డ్, రీబోక్, లావా, ఓరియంట్ అనే కంపెనీలకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు.

ఒక్క ప్రకటనకు ధోనీ రూ.4-6 కోట్లు వసూలు చేస్తున్నాడు. పలు క్రీడా లీగ్స్‌లోని జట్లకు ధోనీ సహ భాగస్వామిగా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మూడేళ్ల క్రితమే గుడ్ బై చెప్పినా... ధోనీ క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. వ్యాపార ప్రకటనల కోసం ఆయా కంపెన్లీ ఇంకా ధోనీ కోసం క్యూ కడుతున్నాయి. ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నెట్ వర్త్ రూ.1050 కోట్లుగా ఉంది. ధోనీ కంటే రూ.10 కోట్లు మాత్రమే ఎక్కువ.

Story first published: Saturday, July 8, 2023, 12:35 [IST]
Other articles published on Jul 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+