Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐసీసీ దశాబ్దపు టీ20 టీమ్: భారత్ నుంచి నలుగురికి చోటు.. కెప్టెన్‌ ధోనీనే!

MS Dhoni named captain of ICC Mens T20I Team of the Decade; Kohli, Rohit, Bumrah also in the side

న్యూఢిల్లీ: అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తూన్న దశాబ్దపు టీ20 టీమ్‌ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదివారం ప్రకటించింది. 2010 నుంచి 2020 మధ్య అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 11 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసిన ఈ జట్టులో భారత్ నుంచి నలుగురికి చోటు దక్కింది. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ప్రస్తుత సారథి విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల తాత్కలిక కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు..యార్కర్ల కింగ్ స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ డికేడ్ బెస్ట్ ఎలెవన్‌‌కు ఎంపికయ్యారు. ఈ జట్టుకు మన మహేంద్ర సింగ్ ధోనీనే సారథిగా నియమించారు. అభిమానుల ఓటింగ్ ద్వారా ఐసీసీ అవార్డులు అందజేస్తుందన్న విషయం తెలిసిందే.

ఓపెనర్లుగా రోహిత్, గేల్

ఓపెనర్లుగా రోహిత్, గేల్

ఈ దశాబ్దపు అత్యుత్త టీ20 ఎలెవన్‌లో రోహిత్ శర్మ, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌ను ఓపెనర్లుగా తీసుకున్న ఐసీసీ.. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను నంబర్ త్రీగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌లను 4,5వ స్థానాల్లో బరిలోకి దిగే బ్యాట్స్‌మన్‌గా ఎంచుకుంది. వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ ధోనీకి 6వ స్థానంలో తీసుకున్నారు.

మ్యాక్సీ, పోలార్డ్..

మ్యాక్సీ, పోలార్డ్..

ఆల్‌రౌండర్ల జాబితాలో ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు గ్లేన్ మ్యాక్స్ వెల్, వెస్టిండీస్ స్టార్ కీరన్ పొలార్డ్ చోటు దక్కించుకున్నారు. 7, 8 స్థానాల్లో ఐసీసీ వీరికి అవకాశం కల్పించింది. అఫ్గానిస్థాన్ సంచలనం రషీద్ ఖాన్ స్పెషల్ స్సిన్నర్‌గా ఎంపికవ్వగా.. జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా‌లు పేసర్లుగా జట్టులో చోటు దక్కించుకున్నారు.

ఐసీసీ దశాబ్దపు టీ20 టీమ్

రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, మహేంద్ర సింగ్ ధోనీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగా

ఐసీసీ అవార్డ్స్ ఆఫ్ ది డికేడ్‌'గా..

ఐసీసీ అవార్డ్స్ ఆఫ్ ది డికేడ్‌'గా..

గత నెలలో ఐసీసీ డికేడ్ అవార్డుల నామినేషన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. పలు కేటగిరీలకు సంబంధించి ఐసీసీ మెన్స్, ఉమెన్స్ క్రికెటర్ల అవార్డుల కోసం ఆన్‌లైన్‌లో ఓటింగ్ నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా 1.3 మిలియన్ మంది అభిమానులు 5 మిలియన్ల ఓట్లను వేశారు. అభిమానుల ఓట్లతో పాటు జ్యూరీ ఓట్లను కూడా జతచేసి విజేతలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా, విరాట్ కోహ్లీ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డ్ ఫర్ మేల్ క్రికెటర్ అవార్డును గెలుచుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే భారత క్రికెటర్లలో కోహ్లీతో పాటు రవిచంద్రన్ అశ్విన్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, జులన్ గోస్వామి, మిథాలి రాజ్‌కూడా పలు కేటగిరీల్లో నామినేట్ అయ్యారు.

ఫ్యాన్స్‌కు ప్రైజ్‌లు..

ఫ్యాన్స్‌కు ప్రైజ్‌లు..

ఇక ఓట్లు వేసిన అభిమానులకు కూడా ఐసీసీ బహుమతులు ఇవ్వనుంది. టాప్ ప్రైజ్ అందుకున్న వ్యక్తికి భారత్‌లో జరగనున్న 2021 టీ20 ప్రపంచకప్‌ సూపర్ 12 మ్యాచ్‌ల హజరవ్వచ్చు. విమాన, వసతీ సౌకర్యాలన్నీ కల్పిస్తారు. ఇతర బహుమతుల్లో 45 జతల మ్యాచ్ టికెట్లు, ఓప్పో మొబైల్ ఫోన్లు, ఐసీసీ టీ20 ప్రపంచకప్ వోచర్లు ఇవ్వనున్నారు. గత 10 ఏళ్లుగా అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఈ అవార్డులకు నామినీలుగా ఎంపిక చేస్తారు.

Story first published: Sunday, December 27, 2020, 16:38 [IST]
Other articles published on Dec 27, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+