టాప్ 3గా ధోనీ.. సచిన్ నెం.4.. కోహ్లీ నెం.6


న్యూ ఢిల్లీ: మహేంద్ర సింగ్ ధోని భారత క్రికెట్ చరిత్రలో సరికొత్త ఒరవడి సృష్టించిన సంచలనమైన ఆటగాడు. ఓ బ్యాట్స్‌మెన్‌గా ఆటకు మెరుగైన ముగింపు పలకడంలో అతని రూటే సెపరేటు. జట్టు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినప్పుడు ధోని మైదానంలో ఉండి చక్కటి వ్యూహాలు రచిస్తాడు. అతడి ఆటకే కాదు. వ్యక్తిత్వంలోనూ వైవిధ్యం ఉంటుంది. మంచి ఆటగాడిగా, జట్టు సహచరుడిగా, మంచి భర్తగా, మంచి తండ్రిగా కూడా ఉన్నాడు.

ప్రభావం చూపే వ్యక్తుల్లో ధోని మూడో స్థానంలో
ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టే అభిమానులకు అతనంటే అంత క్రేజ్. ఆటగాడిగా ఎన్నో రికార్డులు ధోని సొంతం. అయితే ఇప్పుడు అతడికి మరో అరుదైన గౌరవం దక్కింది. ‘యుగోవ్ ప్రభావిత సూచి-2018' అనే పేరుతో చేసిన సర్వేలో అత్యంత ఎక్కువ ప్రభావం చూపే వ్యక్తుల్లో ధోని మూడో స్థానంలో నిలిచారు. ఇతడికంటే ముందు తొలి రెండు స్థానాల్లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనె ఉన్నారు.

ధోని తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్
అయితే ధోని తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉండగా.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆరోస్థానంలో నిలిచాడు. ఇక బాలీవుడ్ తారలైన అక్షయ్ కుమార్ ఐదో స్థానంలో ఉండగా.. ఆమిర్ ఖాన్ ఆరోస్థానంలో నిలిచారు. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ ఏడో స్థానాలకు పరిమితమయ్యారు. అలియా భట్ తొమ్మిదో స్థానంలో, ప్రియాంక చోప్రా పదో స్థానంలో నిలిచారు. బాలీవుడ్, క్రీడల నుంచి సుమారు 60మంది ప్రముఖులపై ఈ సర్వే నిర్వహించారు.
లైంగిక ఆరోపణల నుంచి బయటపడ్డ బీసీసీఐ సీఈఓ

పరిగణనలోకి తీసుకున్న అంశాలు
విషయావగాహన, ఇష్టం, నిజాయతీ, సమయస్ఫూర్తి, ప్రభావితం చేసే అంశాలు తదితర అంశాలను ఆధారంగా తీసుకుని ఈ ఆన్‌లైన్ సర్వే చేశారు. అయితే ధోనికి మాత్రం ఆయన సమయస్ఫూర్తి, నిజాయతీ విభాగాల్లో ఎక్కువ మార్కులొచ్చాయని సర్వే నివేదికలో వెల్లడైంది.

ధోనీ, సచిన్ టెండూల్కర్‌లు సమతూకంగా
అమితాబ్ బచ్చన్ పాపులారిటీ చాలా ఏళ్ల క్రితమే సుప్రీం స్థాయికి చేరింది. ఎందుకంటే కార్పొరేట్స్, ప్రభుత్వ సంస్థలు, అవగాహన కార్యక్రమాలకు సైతం అతను ప్రచార కర్తగా వ్యవహరిస్తుండటమే అయితే.. వారికి ధోనీ ఏ మాత్రం తీసిపోడంట. ఆటోమొబైల్, టెక్నాలజీ రంగంలో ధోనీ, సచిన్ టెండూల్కర్‌లు ఆయనకి సమతూకంగా నిలుస్తారని సర్వే చెబుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications