
ధోనీకి శాశ్వత సీటు:
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెబుతున్నట్టు శనివారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. 16 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ తప్పుకుంటున్నట్లు ఆయన వెల్లడించాడు. మహీ వీడ్కోలు నేపథ్యంలో అతని గౌరవార్థం ముంబై క్రికెట్ అసోషియేషన్ (ఎంసీఏ) వాంఖడేలో ఒక సీటుకి అతని పేరు పెట్టనుంది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ బాదిన ఫినిషింగ్ సిక్స్ పడిన సీటుకే.. ధోనీ పేరు పెట్టనుంది.

ఎంసీఏకు లేఖ:
ముంబై క్రికెట్ అసోషియేషన్ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు అజింక్య నాయక్ సోమవారం ఈ ప్రతిపాదనతో ఎంసీఏకు ఓ లేఖ రాశారు. 'భారత క్రికెట్ జట్టుకు ఎంఎస్ ధోనీ చేసిన అపారమైన కృషికి కృతజ్ఞతలు. మహీ గౌరవార్థం ఎంసీఏ.. వాంఖడేలో ఒక సీటుకి అతని పేరు పెట్టనుంది. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన ఫినిషింగ్ సిక్స్ పడిన సీటుని ఇప్పటికే స్టేడియంలో గుర్తించాం. ఆ సీటుని ప్రత్యేకంగా డెకరేట్ చేస్తాం. శాశ్వత సీటుగా ప్రకటిస్తాం' అని నాయక్ తెలిపారు.

గవాస్కర్‌కి రెండు శాశ్వత సీట్లు:
ఇప్పటికే వాంఖడే స్టేడియంలో సునీల్ గవాస్కర్‌కి రెండు శాశ్వత సీట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇటీవల 71వ పుట్టిన రోజు జరుపుకున్న లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్‌కు బర్త్ డే గిప్ట్‌గా.. స్టేడియంలోని ప్రెసిడెంట్స్ బాక్స్‌లో సన్నీ, అతని భార్యకు కలిపి రెండు శాశ్వత సీట్లని ఎంసీఏ కేటాయించింది. 1987లో అంతర్జాతీయ క్రికెట్‌కి గవాస్కర్ వీడ్కోలు చెప్పినప్పుడు ఎంసీఏ గర్వారె పెవిలియన్‌లోని రెండు సీట్లను సన్నీ, అతని భార్యకు కేటాయించింది. అయితే 2011 వన్డే ప్రపంచకప్ ముందు స్టేడియం నవీకరణ పనుల్లో భాగంగా సీటింగ్‌లో మార్పులు చేర్పులు జరగడంతో ఆ సీట్లు కనిపించకుండాపోయాయి. ఆ తర్వాత ఎంసీఏ కూడా పట్టించుకోలేదు. సన్నీ పుట్టినరోజు సందర్భంగా తిరిగి ఆ రెండు సీట్లను మళ్లీ కేటాయించింది.

350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్:
అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్ మ్యాచ్‌ల్లో 4,876 పరుగులు సాధించాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10,773 రన్స్ చేశాడు. వీటిల్లో 10 శతకాలలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. వ్యక్తిగత అత్యధిక స్కోర్ 183. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1,600 పరుగుల బాదాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ తర్వాత 10,733 పరుగులు సాధించిన ఆటగాడిగా ఎంఎస్ ధోనీ వన్డేల్లో భారత ఆల్ టైమ్ రన్ స్కోరర్స్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications

సురేష్ రైనా కేవలం ఆటగాడు మాత్రమే కాదు.. (వీడియో)!!










