MS Dhoni: చిక్కుల్లో భారత మాజీ కెప్టెన్.. చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్న ధోనీ!

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఇప్పటికే ఆమ్రపాలి కన్‌స్ట్రక్షన్ కేసుతో అప్రతిష్టపాలైన ధోనీ.. తాజాగా చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కున్నాడు. బిహార్‌లోని బెగుసరైలో అతనితో సహా మరో ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. న్యూ గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా కంపెనీ ఇచ్చిన రూ.30 లక్షల చెక్కు బౌన్స్ అవ్వడంతో ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ అనే సంస్థ కేసు పెట్టింది. బెగుసరై సీజేఎం కోర్టులో సోమవారం ఈ కేసు విచారణ జరిగింది.
న్యూ గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా కంపెనీకి ధోనీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. దాంతో అతని పేరునూ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. సోమవారం కోర్టు విచారణ పూర్తయ్యాక ఈ కేసును జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ అజయ్ కుమార్ మిశ్రా వద్దకు పంపించారు. జూన్ 28కి విచారణ వాయిదా వేశారు.

అసలు కేసు ఏంటంటే..?
న్యూ గ్లోబల్ ప్రొడ్యూస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వద్ద ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ రూ.30 లక్షల విలువైన ఎరువులను ఆర్డర్ చేసింది. ఆ సరుకును న్యూ గ్లోబల్ కంపెనీ డెలీవరీ చేసింది. అయితే సరఫరాదారు నిబంధనలను డీలర్ పాటించలేదన్న ఆరోపణలు వచ్చాయి. దాంతో భారీమొత్తంలో సరకు అమ్ముడుపోలేదు. మిగిలిన ఎరువులను న్యూ గ్లోబల్ వెనక్కి తీసుకొని రూ.30 లక్షల విలువైన చెక్కు ఇచ్చింది. దానిని బ్యాంకులో డిపాజిట్ చేశాక బౌన్స్ అయింది.

స్పందించకపోవడంతో..
లీగల్ నోటీసు పంపించినా కంపెనీ స్పందించలేదు. దాంతో ఆ ప్రొడక్టును ప్రమోట్ చేసిన ఎంఎస్ ధోనీతో సహా ఏడుగురిపై ఎస్‌కే ఎంటర్‌ప్రైజెస్ నీరజ్ కుమార్ నీరాలా కేసు పెట్టారు. దాంతో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఆమ్రపాలి కేసులో..
ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ గ్రూప్‌నకు 2009 నుంచి 2016 వరకు ధోనీ ప్రచారకర్తగా వ్యవహరించాడు. ధోనీని చూసి చాలా మంది ఈ సంస్థ దగ్గర ఫ్లాట్స్ కొనుగోలు చేయగా.. ఆమ్రపాలి యాజమన్యం నిర్ణీత సమయంలో ఫ్లాట్స్ నిర్మించలేకపోయింది. దాంతో తాము తీవ్రంగా మోసపోయామని భావించిన బాధితులు కోర్డును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం కోర్డులో ఉంది. ధోనీని చూసే ఫ్లాట్స్ కొనుగోలు చేశామని, అతను మమ్మల్ని దారుణంగా మోసం చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications