For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'సీఎస్‌కేకు ధోనీ ఆత్మ లాంటివాడు.. మహీ ఉన్నంత‌కాలం ఆ జట్టు బ‌తికే ఉంటుంది'

MS Dhoni Is The Biggest Strength for Chennai Super Kings says Aakash Chopra

ముంబై: చెన్నై సూప‌ర్ కింగ్స్‌ (సీఎస్‌కే)లో ఎంఎస్ ధోనీ ప్రభావవంతమైన వ్యక్తిగా కొనసాగుతున్నాడ‌ని, జ‌ట్టుకు మహీనే పెద్ద బ‌లం అని టీమిండియా మాజీ క్రికెట‌ర్, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అన్నాడు. సీఎస్‌కేకు ధోనీ ఆత్మ లాంటివాడని, అతడు ఉన్నంత‌కాలం చెన్నై జట్టు బ‌తికే ఉంటుందన్నాడు. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌లో మాట్లాడుతూ సీఎస్‌కే బలాబలాలపై ఆకాశ్ చోప్రా స్పందించాడు.

సీఎస్‌కేకు ఆత్మ లాంటివాడు

సీఎస్‌కేకు ఆత్మ లాంటివాడు

'ఎంఎస్ ధోనీ చెన్నై జట్టుకు అతిపెద్ద బలం. మొత్తం ఫ్రాంచైజీ అతడిపై ఆధారపడి ఉంది. మహీ సీఎస్‌కేకు ఆత్మ లాంటివాడు. అతడు ఉన్నంత‌కాలం సీఎస్‌కే బ‌తికే ఉంటుంది. ధోనీ గొప్ప కెప్టెన్, మంచి బ్యాట్స్‌మెన్‌. చాలా కాలం త‌రువాత క్రికెట్ ఆడ‌బోతున్నాడు. మైదానంలో పరుగులు తీయగలడా, గతంలో లాగా బ్యాటింగ్ చేయ‌గ‌ల‌డా అనే ప్ర‌శ్న‌లు అంద‌రిలో ఉండడం సహజం. కానీ ఇక్క‌డ ఒక్క‌టి గుర్తుంచుకోండి. అతడు చాలా అనుభ‌వజ్ఞుడు. మెరుగ్గా రాణిస్తాడ‌ని నేను అనుకుంటున్నా' అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎంఎస్ ధోనీ 2019 ప్రపంచ కప్ త‌రువాత మ‌ళ్లీ క్రికెట్ ఆడలేదు. 39 ఏళ్ల ధోనీ ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు.

మేటి స్పిన్న‌ర్లు ఉన్నారు:

మేటి స్పిన్న‌ర్లు ఉన్నారు:

సీనియ‌ర్ ఆఫ్ స్పిన్న‌ర్ హ‌ర్భ‌జ‌న్ సింగ్ చెన్నై జ‌ట్టులో లేకపోవడం ఇబ్బందికరమే అయినా.. వారికి మిచెల్ సాంట్నర్, ఇమ్రాన్ తాహిర్, కర్న్ శర్మ, రవీంద్ర జడేజా, పియూష్ చావ్లా వంటి మేటి స్పిన్న‌ర్లు ఉన్నార‌ని ఆకాశ్ చోప్రా అభిప్రాయప‌డ్డాడు. ఇంత మంది స్పిన్నర్లు ఉండడంతో ఒకేసారి ఇద్దరు లేదా ముగుర్ని ఆడించే అవకాశం ఉంటుందన్నాడు. యూఏఈ లాంటి పిచ్‌లపై ఈ బౌలింగ్‌ విభాగం చాలా పనికొస్తుందని సూచించాడు.

చెన్నైకి అదే ఇబ్బందికరం

చెన్నైకి అదే ఇబ్బందికరం

బ్యాటింగ్‌ విభాగంలో సీనియర్‌ ప్లేయర్‌ సురేశ్‌ రైనా లాంటి ఆటగాడుంటే మరింత కలిసివచ్చేదని వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా పేర్కొన్నాడు. దేశీయ బ్యాట్స్‌మెన్‌లో మురళీ విజయ్‌, ఎంఎస్ ధోనీ, అంబటి రాయుడు, కేదార్‌ జాధవ్‌ లాంటి వారు ఉన్నారన్నాడు. ఇక పేస్‌ విభాగంలో దీపక్‌ చాహర్‌, సామ్‌ కరన్‌, శార్ధుల్‌ ఠాకుర్‌, జోష్‌ హాజిల్‌వుడ్‌, లుంగీ ఎంగిడి, డ్వేన్‌ బ్రావో ఉన్నారని.. వారంతా సమర్థవంతమైన బౌలర్లని ఆయన చెప్పారు. ధోనీ, విజయ్‌, జాధవ్‌ లాంటి ఆటగాళ్లు చాలా రోజుల నుంచి ఆటకు దూరంగా ఉండటమే చెన్నైకి ఇబ్బందికర విషయమన్నాడు. ముంబై ఇండియన్స్‌ ఒక్కటే చెన్నైకి ప్రధాన పోటీదారని, గట్టి పోటీనిస్తుందని పేర్కొన్నాడు.

సర్వ‌త్రా ఆస‌క్తి

సర్వ‌త్రా ఆస‌క్తి

సెప్టెంబర్ 19న అబుదాబిలో డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో జరిగే ఐపీఎల్ 2020 ప్రారంభ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ నాయ‌క‌త్వంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ బ‌రిలోకి దిగ‌నుంది. ఏడాది విరామం త‌రువాత ధోనీ గ్రౌండ్‌లో ఎలా ఆడ‌తాడా అనేది సర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఎంఎస్ ధోనీ 2019 ప్రపంచ కప్ త‌రువాత మ‌ళ్లీ క్రికెట్ ఆడని విషయం తెలిసిందే.

CPL 2020ని మనం శాసించాం.. ఇక పార్టీ చేసుకుందాం: షారుక్‌ ఖాన్

Story first published: Friday, September 11, 2020, 16:58 [IST]
Other articles published on Sep 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+