Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

CPL 2020ని మనం శాసించాం.. ఇక పార్టీ చేసుకుందాం: షారుక్‌ ఖాన్

Trinbago Knight Riders owner ShahRukh Khan celebrates CPL title win

తరౌబా (ట్రినిడాడ్): కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(సీపీఎల్‌) 2020 సీజన్ విజేతగా కీరన్ పోలార్డ్ నేతృత్వంలోని ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు నిలిచింది. సెయింట్ లూసియా జూక్స్ నిర్ధేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు ఉండగానే ఛేదించింది. దీంతో ట్రిన్‌బాగో ఖాతాలో నాలుగో టైటిల్ చేరింది. అయితే సీపీఎల్‌ 2020లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా టైటిల్‌ గెలుచుకున్న ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ ఆటగాళ్లపై ఫ్రాంచైజీ యాజమాని, బాలీవుడ్‌ హీరో షారుక్‌ ఖాన్‌ ప్రశంసలు కురిపించాడు.

'సీపీఎల్‌ 2020ని మనం శాసించాం. సమష్టి కృషితోనే టైటిల్ సాధ్యమైంది. మాకు మీరు గర్వకారణం. ఈ విజయాన్ని వేడుకగా జరుపుకుందాం. ఎటువంటి జన తాకిడి లేకుండా మస్త్ పార్టీ చేసుకుందాం. కీరన్ పొలార్డ్‌ గ్యాంగ్‌ ధన్యవాదాలు. ప్రత్యేకంగా డ్వేన్‌ బ్రేవో, డారెన్‌ బ్రేవో, కీరన్ పొలార్డ్‌లకు నా అభినందనలు. ఇది నైట్‌రైడర్స్‌కు నాలుగో టైటిల్‌. లవ్‌ యూ. ఇక ఐపీఎల్‌కు రండి' అని బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్ ట్వీట్‌ చేశాడు.

గురువారం రాత్రి బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన సీపీఎల్‌ 2020 ఫైనల్‌ పోరులో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సెయింట్‌ లూసియా జూక్స్‌ను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సెయింట్‌ లూసియా 19.1 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఆండ్రీ ఫ్లెచర్‌ (27 బంతుల్లో 39; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌. కీరన్‌ పొలార్డ్‌ (4/30) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. పొలార్డ్‌ దెబ్బకు సెయింట్‌ లూసియా బ్యాట్స్‌మన్‌ వరుసగా పెవిలియన్ చేరారు.

అనంతరం నైట్‌రైడర్స్‌ 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 157 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ లెండిన్‌ సిమన్స్‌ (49 బంతుల్లో 84 నాటౌట్‌; 8 ఫోర్లు, 4 సిక్సర్లు), డారెన్‌ బ్రావో (47 బంతుల్లో 58 నాటౌట్‌; 2 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో జట్టును గెలిపించారు. ముఖ్యంగా బ్రావో సిక్సులతో విరుచుకుపడ్డాడు. బ్రావో ఫోర్‌ కొట్టడంతో నైట్‌రైడర్స్‌ టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.ఇది ట్రిన్‌బాగోకు నాలుగో టైటిల్‌. ఫలితంగా సీపీఎల్‌ చరిత్రలో అత్యధిక టైటిల్స్‌ గెలిచిన జట్టుగా ట్రిన్‌బాగో నిలిచింది.

Story first published: Friday, September 11, 2020, 15:09 [IST]
Other articles published on Sep 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+