Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: మాట మార్చిన ధోనీ.. వచ్చే సీజన్ ఆడటంపై యూటర్న్!

MS Dhoni hints at IPL retirement after 2021 season

దుబాయ్: తన ఫేర్‌వెల్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున చెపాక్ మైదానంలో అభిమానుల మధ్యలోనే ఉంటుందని చెప్పిన భారత మాజీ కెప్టెన్, సీఎస్‌కే సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. అంతలోనే మాట మార్చాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో తాను ఆడే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదన్నాడు. వచ్చే ఏడాది ఫ్యాన్స్‌ తనను ఎల్లో జెర్సీలో చూడొచ్చంటూనే.. సీఎస్‌కేకు ఆడుతానో లేదోనన్న అనుమానం వ్యక్తం చేశాడు.

వచ్చే ఏడాది లీగ్‌లో జట్ల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 'ప్లేయర్ రిటెన్షన్ పాలసీ' వస్తే కానీ దీనిపై క్లారిటీ ఇవ్వలేనన్నాడు. ఇటీవల యూట్యూబ్ చానెల్ వేదికగా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయిన ధోనీ.. వచ్చే సీజన్‌లో తాను చెన్నైకి ఆడుతానని హింట్ ఇచ్చాడు. కానీ గురువారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్ టాస్ సందర్భంగా తర్వాతి సీజన్ ఆడటంపై హోస్ట్ అడిగిన ప్రశ్నకు మహీ స్పందించాడు.

మెగా వేలం.. రూల్స్ వచ్చాకే..

మెగా వేలం.. రూల్స్ వచ్చాకే..

'వచ్చే ఏడాది మీరు నన్ను ఎల్లో జెర్సీలో చూడొచ్చు. కానీ సీఎస్‌కే తరఫున బరిలోకి దిగుతానా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేను. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయంపై చాలా గందరగోళం ఉంది. వచ్చే ఏడాది కొత్తగా రెండు జట్లు వస్తుండటమే అందుకు కారణం. ప్లేయర్ రిటెన్షన్ పాలసీ ఎలా ఉంటుందో ఇంకా తెలియదు. ఎంతమంది భారత్, విదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుందో తెలియదు. అందువల్ల చాలా అనిశ్చితి ఉంది.

కొత్త, రూల్స్ వచ్చే దాకా ఏదీ కచ్చితంగా చెప్పలేను. నిబంధనలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయనే నమ్మకమైతే ఉంది.'అని ధోనీ చెప్పుకొచ్చాడు. దాంతో, ఐపీఎల్ ఆరంభ సీజన్‌ నుంచి ఆ ఫ్రాంచైజీ ఆడుతున్న మహీ.. వచ్చే ఏడాది ఆ జట్టుతో కొనసాగుతాడా లేదా అనే చర్చ మొదలైంది. ఒకవేళ కొనసాగినా మెంటార్‌గా సేవలిందించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతంది.

నలుగురికే ఛాన్స్..

నలుగురికే ఛాన్స్..

వచ్చే ఏడాది కొత్తగా రెండు జట్లు చేరుతుండటంతో ఈ ఏడాది డిసెంబర్‌లో మెగావేలం నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రణాళికలు రచిస్తోంది. అందుకు కావాల్సిన కార్యచరణను కూడా మొదలు పెట్టింది. మెగా వేలానికి సంబంధించిన విధివిధానాలను ఇప్పటికే రూపొందించిన బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మెగావేలంలో నేపథ్యంలో ఆటగాళ్ల రిటైన్ పాలసీని కూడా రూపొందించి ఓ బ్లూ ప్రింట్‌ను సిద్దం చేసింది.

దీనిక ప్రకారం ఫ్రాంఛైజీలకి గరిష్ఠంగా నలుగురు ఆటగాళ్లని రిటైన్ చేసుకునే వెసులబాటు ఉంటుంది. ఇందులో ముగ్గురు భారత క్రికెటర్లు, ఒక విదేశీ క్రికెటర్ లేదా ఇద్దరు భారత క్రికెటర్లు, ఇద్దరు విదేశీ క్రికెటర్లు ఉండొచ్చు. ఒకవేళ ముగ్గురు ప్లేయర్లనే ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంటే వారి సాలరీ రూ.15, రూ.11, రూ.7 కోట్లుగా ఉండనుంది.

ధోనీని రిటైన్ చేసుకుంటుందా?

ధోనీని రిటైన్ చేసుకుంటుందా?

ఒకవేళ ఇద్దరినే రిటైన్ చేసుకుంటే రూ.12.5, రూ.8.5 కోట్లు, ఒకవేళ ఒక్కరినే తీసుకుంటే అప్పుడు రూ.12.5 కోట్లు ఆ ప్లేయర్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి ఫ్రాంఛైజీల పర్స్ వాల్యూని రూ.5 కోట్లు పెంచారు. దాంతో.. ప్రతి ఫ్రాంఛైజీ పర్స్‌వాల్యూ రూ.90 కోట్లకి పెరగనుంది. వేలంలో ఈ పర్స్ వాల్యూలో కనీసం 75% కచ్చితంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.

దాంతో తమకు కావాల్సిన ఆటగాళ్ల కోసం కోట్లు కుమ్మరించేందుకు ఫ్రాంచైజీలు సిద్దమవుతున్నాయి. అయితే ఒక్క సీజన్ కోసం ధోనీకి అంత ధర వెచ్చించేందుకు సీఎస్‌కే సిద్దంగా ఉందా? లేక వేలంలోకి పంపించి రిస్క్ చేయనుందా? అనేదానిపై క్లారిటీ లేదు. అయితే ఆ జట్టు సీఈవో మాత్రం ధోనీని వదులుకోమని చెప్పాడు.

సినిమాలా? మన వల్ల కాదు..

సినిమాలా? మన వల్ల కాదు..

నటుడిగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే ఆలోచనే తనకు లేదని టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. అడ్వర్టైజ్‌మెంట్స్ వరకే నటిస్తానని స్పష్టం చేశాడు. నటన అనేది అంత సులువైన పనికాదని, ప్రస్తుత సినీతారలు అద్భుతంగా చేస్తున్నారని చెప్పాడు. అడ్వర్టైజ్‌మెంట్స్ చేస్తానని, క్రికెట్‌లోనే ఉంటానని చెప్పాడు. 'బాలీవుడ్ నాకు సెట్‌కాదు .

అడ్వర్టైజ్‌మెంట్స్ వరకు ఓకే. అవి చేయడానికి నేను సిద్దంగా ఉన్నా. కానీ సినిమాల్లో నటించడం అనేది చాలా కష్టమైన పని. దాన్ని మేనేజ్‌ చేయడం మనవల్ల కాదు. బాలీవుడ్‌ను మన సినీతారలకే వదిలేస్తున్నా. వారు అద్భుతంగా నటిస్తున్నారు. నేను క్రికెట్‌లోనే ఉంటా. అడ్వర్టైజ్‌మెంట్స్‌కు మించి ఏవి చేయను.'అని ధోనీ స్పష్టం చేశాడు.

Story first published: Friday, October 8, 2021, 16:19 [IST]
Other articles published on Oct 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+