పక్షిని కాపాడిన ఎంఎస్ ధోనీ.. ఆపై ఏం జరిగిందంటే?!!

జార్ఖండ్: కరోనా వైరస్ మహమ్మారితో దేశంలో లాక్‌డౌన్ విధించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత మార్చి నుంచి ఫామ్ హౌస్‌కే పరిమితమైయ్యాడు. అయితే ఇతర క్రికెటర్లలా ధోనీ సోషల్ మీడియాలో కనిపించడం లేదు. ట్విట్టర్, పేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ లైవ్ చాట్‌లు నిర్వహించడం లేదు. మహీ ఇంట్లో ఏం చేస్తున్నాడో అప్పుడప్పుడూ అతడి భార్య సాక్షి ధోనీ చెపితే గానీ అసలు విషయం తెలియట్లేదు. అయితే తాజాగా మహీ గాయపడ్డ ఓ పక్షిని రక్షించాడని అతడి కూతురు జీవా తెలిపింది.

నాన్న నీళ్లు తాగించాడు:
ఎంఎస్ ధోనీ గాయపడ్డ పక్షిని ఎలా కాపాడాడో కూతురు జీవా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీని పోస్టు చేసింది. జీవా కథనం ప్రకారం స్టోరీ ఇలా ఉంది. 'లాన్‌లో ఆడుకుంటున్న సమయంలో ఓ గాయపడ్డ పక్షిని చూశా. వెంటనే అమ్మనాన్నలను పిలిచాను. నాన్న వచ్చి ఆ గాయపడ్డ పక్షిని చేతుల్లో పట్టుకున్నాడు. దానికి కొన్ని నీళ్లు తాగించాడు. కొన్ని క్షణాల తర్వాత అది కళ్లు తెరిచింది. దాంతో అందరం సంతోష పడ్డాం. లాన్‌లోని చెట్టు మీది ఆకులపై ఓ బుట్ట పెట్టి దానిపై పక్షిని ఉంచాం' అని పేరొంది.
మళ్లీ అది కనిపిస్తుందనుకుంటా:
'ఈ పక్షిని క్రిమ్‌సన్ బార్బెట్ అంటారని, ఇంకా కాపర్ స్మిత్ అంటారని కూడా మమ్మీ (సాక్షి) చెప్పింది. పక్షి చూడడానికి చాలా అందంగా ఉంది. కొద్ది సమయం అందరం అక్కడే గడిపాం. మేమందరం చూస్తుండగానే ఒక్కసారిగా అది ఎగిరిపోయింది. నిజానికి అది అక్కడే ఉండాలనుకుంది. ఆ పక్షి తన తల్లికి దగ్గరకు వెళ్లినట్లు అమ్మ చెప్పింది. మళ్లీ అది కనిపిస్తుందనుకుంటా' అని జీవా తన ఇన్‌స్టా పోస్టులో పక్షి స్టోరీ గురించి రాసింది.

ఫామ్ హౌస్‌లో చక్కర్లు:
తాజాగా పెంపుడు శునకాలతో ఆడుకున్న వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ ఫాన్ క్లబ్ తన ఆధికారిక ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. ధోనీ తన కూతురు జీవాతో కలిసి సోపాలో కూర్చుని ఉండగా.. ఓ రెండు శునకాలు ధోనీ ఒడిలోకి వెళ్లి కూర్చున్నాయి. వాటికి ఆప్యాయంగా ధోనీ ముద్దు పెట్టి.. కౌగిలించుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న జీవా.. అసూయతో ధోనీ వంక అలా చూస్తుండిపోయింది. అప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతకుముందు గారాలపట్టి జీవాతో కలిసి జాలీగా బైక్ రైడ్ చేశాడు మహీ . అది కూడా తన సతీమణి సాక్షి సింగ్ లైవ్ సెషన్‌లో ఉండగానే తన ఫామ్ హౌస్‌లో చక్కర్లు కొట్టాడు.

10 నెలలుగా క్రికెట్‌కి దూరం:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్‌కు కూడా అందుబాటులో ఉండడం లేదు. దీంతో సెంట్రల్ కాంట్రాక్టు నుండి అతనిని బీసీసీఐ తప్పించింది. ఇక మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్‌కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. దీంతో ధోనీ ప్రొఫెషనల్ క్రికెట్‌లోకి తిరిగి రావడాన్ని ఆలస్యం చేసింది. ఐపీఎల్‌లో మహీ బాగా రాణించినట్లయితే.. అక్టోబర్-నవంబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం ఉండేది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో కచ్చితంగా చెప్పలేం. దీంతో ధోనీ అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు డైలమాలో పడింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
సమయం మించిపోలేదు మిత్రమా.. పోరాడుతూనే ఉండాలి: గేల్