Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సమయం మించిపోలేదు మిత్రమా.. పోరాడుతూనే ఉండాలి: గేల్

Chris Gayle backs Daren Sammy after his allegations of racist jibe

ఆంటిగ్వా: వర్ణ వివక్ష (జాత్యాంహకారం)పై పోరాడేందుకు మరీ ఎక్కువ ఆలస్యం కాలేదని వెస్టిండీస్ ​విధ్వంసక ఓపెనర్ 'యూనివర్సల్ బాస్' క్రిస్ గేల్ చెప్పాడు. క్రికెట్​లో తాను వర్ణ వివక్షతో కూడిన వ్యాఖ్యలను ఎదుర్కొన్నానని చెప్పిన విండీస్ మాజీ కెప్టెన్ డారెన్​ సమీకి మద్దతు తెలుపుతూ గేల్ ట్వీట్ చేశాడు. సమయం మించిపోలేదు మిత్రమా అని, పోరాడుతూనే ఉండాలని యూనివర్సల్ బాస్ సూచించాడు.

 సమయం మించిపోలేదు:

సమయం మించిపోలేదు:

అమెరికాలో నల్ల జాతీయుడు జార్డ్​ ఫ్లాయిడ్ మృతికి పోలీసు కారణవడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృమవుతున్న తరుణంలో జాతి వివక్షపై క్రీడాకారులు సైతం స్పందిస్తున్నారు. ఈ క్రమంలో క్రిస్ గేల్ తాజాగా డారెన్​ సమీకి మద్దతు తెలిపాడు. 'సరైన విషయం కోసం పోరాడేందుకు సమయం మించిపోలేదు. కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పోరాడేందుకు మరీ ఆలస్యం కాలేదు. నీ కథ లాగే ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పినట్టే క్రికెట్​లోనూ వర్ణ వివక్ష ఉంది' అని గేల్ ట్వీట్ చేశాడు.

'కాలూ... కాలూ' అని పిలిచేవారు:

'కాలూ... కాలూ' అని పిలిచేవారు:

ఐపీఎల్‌ మ్యాచ్‌ల సందర్భంగా తాను జాతి వివక్ష వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నానని డారెన్‌ స్యామీ ఇటీవల అన్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సమయంలో తనతో పాటు శ్రీలంక క్రికెటర్‌ తిసారా పెరీరా వర్ణ వివక్షకు గురయ్యాడని తెలిపాడు. 'సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమయంలో నన్ను, పెరీరాను 'కాలూ... కాలూ' అని పిలిచేవారు. అప్పుడు దానర్థం మాకు తెలిసేది కాదు. భారత్‌లో 'కాలూ' అంటే 'బలమైన వ్యక్తి' అని పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కానీ ఈ మధ్యే ఆ పదానికి అర్థం తెలుసుకున్నా. చాలా బాధగా ఉంది' అని స్యామీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొన్నాడు.

క్షమాపణలు చెప్పాలని సమీ డిమాండ్:

క్షమాపణలు చెప్పాలని సమీ డిమాండ్:

అయితే ఏ ఐపీఎల్‌ సీజన్‌ సందర్భంగా తాను ఈ వివక్షను ఎదుర్కొన్నాడో స్యామీ తెలపలేదు. జెంటిల్‌మెన్‌ క్రీడ క్రికెట్‌లో ఉన్న జాత్యాంహకారం పట్ల తీవ్రంగా పరిగణించాలని ఇటీవలే అతను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కి విజ్ఞప్తి చేశాడు. వివక్షతో కూడిన వ్యాఖ్యతో తనను సంబోధించిన వారు తనకు క్షమాపణలు చెప్పాలని సమీ డిమాండ్ చేశాడు. ఇప్పటివరకు 38 టెస్టులు, 126 వన్డేలు, 68 టి20లు ఆడిన స్యామీ.. విండీస్‌కు కెప్టెన్‌గా రెండు టీ20 ప్రపంచకప్‌లను అందించాడు.

టెండూల్కర్ కూడా:

టెండూల్కర్ కూడా:

తాజాగా జాతి వివక్షపై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. ఐసీసీ షేర్ చేసిన వీడియోని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఆ వీడియోకు మాజీ దక్షిణాఫ్రికా అధ్యకుడు నెల్సన్ మండేలా వ్యాఖ్యలని జత చేశాడు. 'నెల్సన్ మండేలా ఒకసారి ఇలా అన్నారు. ప్రపంచాన్ని మార్చగల శక్తి క్రీడకు ఉంది. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే శక్తి కూడా ఉంది. అద్భుతమైన పదాలు' అని సచిన్ రాసుకొచ్చాడు.

ఒహానియాన్ సంచలన నిర్ణయం:

ఒహానియాన్ సంచలన నిర్ణయం:

జార్జ్ ఫ్లాయిడ్ మృతికి రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ భర్త, ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ 'రెడిట్'‌ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియాన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జాత్యహంకారానికి నిరసనగా.. 15 సంవత్సరాల క్రితం స్థాపించిన 'రెడిట్' సంస్థ పదవి నుంచి ఒహానియాన్ వైదొలగాడు. అమెరికన్‌ వ్యాపార దిగ్గజం తన స్థానంలో ఓ నల్ల జాతీయుడిని నియమించాలని కోరాడు.

పంతం వదిలేసిన పాకిస్తాన్.. శ్రీలంకలో ఆసియా కప్?!!

Story first published: Wednesday, June 10, 2020, 11:12 [IST]
Other articles published on Jun 10, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+