For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాత స్నేహితులతో ఎంఎస్ ధోనీ లంచ్.. మహీ సింప్లిసిటీకి ఫాన్స్ ఫిదా! న్యూలుక్ వైరల్!!

MS Dhoni Having Lunch With Old Friends, New Look Of MSD Goes Viral

హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ గత రెండేళ్లుగా ఎక్కువగా రాంచీలోని తన ఫామ్‌ హౌస్‌కే పరిమితం అవుటున్నాడు. సేంద్రీయ వ్యవసాయం చేస్తూ కుటుంబంతో సరదా సమయం గడుపుతున్నాడు. ఫామ్‌హౌస్‌లో ధోనీ విశేషాలను అప్పుడప్పుడు అతని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకి తెలియజేయడం తప్ప.. అతని గురించి ఎలాంటి సమాచారం దొరకడం లేదు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 వాయిదా పడడంతో తనకు దొరికిన సమయాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులు, బంధువులతో సరదాగా గడిపేస్తున్నాడు.

గారేజ్‌లో భోజనం

గారేజ్‌లో భోజనం

తాజాగా హిమాచల్ ప్రదేశ్ టూర్‌ కంప్లీట్ చేసుకు స్వస్థలానికి వచ్చిన ఎంఎస్ ధోనీ.. తాజాగా రాంచీలో తన స్నేహితులను కలిశాడు. వారితో కలిసి కార్ గారేజ్‌లో భోజనం చేస్తూ సరదాగా టైమ్‌పాస్ చేశాడు. గారేజ్‌లో ఉండే బల్లపైనే భోజనం పెట్టుకుని మాట్లాడుకుంటూ తిన్నాడు. వారి వెనక పాతకాలం నాటి రోల్స్​ రాయిస్​ కారు కూడా ఉంది. దానిని ఓ వ్యక్తి రిపేర్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. నెరిసిన గడ్డంతో ధోనీ నవ్వుతూ ఆ ఫొటోలో కనిపిస్తున్నాడు. సాధారణ వ్యక్తిలా ధోనీ భోజనం చేసిన విధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

మహీ సింప్లిసిటీకి ఫాన్స్ ఫిదా

మహీ సింప్లిసిటీకి ఫాన్స్ ఫిదా

టీమిండియాకి 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన గొప్ప కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. అలా సింపుల్‌గా ఉండటంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మహీ సింప్లిసిటీకి ఫాన్స్ ఫిదా అవుతున్నారు. ధోనీ స్టార్ క్రికెటర్​ అయినప్పటికీ.. తన స్నేహితులకు తగిన సమయాన్ని కేటాయిస్తాడు. వారితో అత్యంత సన్నిహితంగా మెలుగుతాడు. సమయం దొరికినప్పుడల్లా వారితో ఎంజాయ్ చేస్తాడు. అందుకే అతన్ని చాలా మంది మిత్రులు ఎక్కువగా ఇష్టపడతారు. ఇక టీమిండియాలో కూడా మహీకి మిత్రులు ఎక్కువే.

పతకం దృష్టిలో పెట్టుకొని ఆడొద్దు.. ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ వెళ్లాలి: ధన్‌రాజ్‌

క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు

అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి ఏడాది గడిచినా.. ఎంఎస్ ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తర్వాత భారత దేశంలో అత్యధిక సంపాదన కలిగిన ఆటగాడు మహీనే. ప్రపంచంలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడైన ధోనీ నికర ఆదాయం 2021 మార్చి నాటికి 110 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో 826 కోట్లు. ఇందులో సగం బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ద్వారానే వస్తుంది. ఐపీఎల్ ద్వారా ఏడాదికి 15 కోట్లు వస్తుంది. ఒక్కో ప్రకటనకు మహీ 1-3 కోట్ల వరకు తీసుకుంటాడని సమాచారం. ప్రస్తుతం మహీ ఖాతాలో అటుఇటుగా 15 బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ఉన్నాయి.

ఐపీఎల్ కోసం యూఏఈకి

ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచ్‌లు సెప్టెంబర్ నెలలో యూఏఇలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే జరిగిన మ్యాచ్‌లలో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఐదు మ్యాచ్‌లలో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. ఐపీఎల్ టీమ్‌లు అన్నీ ఆగస్టు మూడవ వారంతో యూఏఈకి బయలుదేరనున్నాయని సమాచారం. యూఏఈ చేరుకున్న తరువాత టీమ్‌ల సభ్యులు 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు. ఆ తరువాత అందరికి కరోనా టెస్ట్‌లు నిర్వహిస్తారు. నెగిటివ్ వస్తే బుడగలోకి అనుమతిస్తారు. ఆపై మ్యాచ్‌లో ఆడేందుకు కొనసాగిస్తారు.

Story first published: Thursday, July 15, 2021, 13:53 [IST]
Other articles published on Jul 15, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+