For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MS Dhoni: 140 టార్గెట్ మస్త్ అనుకున్నా.. రాయుడి గాయం చిన్నదే! కంగారు పడాల్సిందేంలేదు!

MS Dhoni Gives Update On Ambati Rayudu’s Injury After Victory Against MI
IPL 2021 : MS Dhoni Gives Update On Ambati Rayudu’s Injury After Victory Against MI| Oneindia Telugu

దుబాయ్: ఐపీఎల్ 2021 మలిదశ లీగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ఆరంభించింది. డిఫెండింగ్ చాంపిన్స్ ముంబై ఇండియన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఇక పేలవ బ్యాటింగ్‌తో ఆరంభంలో తడబడిన చెన్నై.. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. ఆ తర్వాత బౌలింగ్‌లో సత్తా చాటి చిరస్మరణీ విజయాన్నందుకుంది.

ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానం చేరి ప్లే ఆఫ్స్‌కు మరింత చేరువైంది. ఇక మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ఆరంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో 140 పరుగులు చేస్తే చాలనుకున్నానని, కానీ 156 పరుగులు సాధించామని తెలిపాడు.

140 చాలనుకున్నా..

140 చాలనుకున్నా..

'30 పరుగుల్లోపే నాలుగు వికెట్లు కోల్పోవడంతో గౌరవప్రదమైన స్కోర్ చేస్తే బాగుంటుదనుకున్నా. అయితే రుతురాజ్, బ్రావో అనుకున్నదాని కంటే మెరుగ్గా ఆడారు. 140 పరుగులు చేస్తే చాలనుకుంటే .. 156 పరుగుల చేయడం అద్భుతం. ఈ పిచ్‌ చాలా నెమ్మదిగా ఉంది. ఆ కారణంగానే మేం వెంట వెంటనే వికెట్లు కోల్పోయాం.

పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కష్టపడాల్సిందే. గాయంతో అంబటి రాయుడు మైదానం వీడాడు. అతను మళ్లీ బ్యాటింగ్ చేయలేడని తెలుసు. అందుకే తెలివిగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టాం. రుతురాజ్ గైక్వాడ్ చివరి వరకు క్రీజులో నిలిచి జట్టుకు మంచి స్కోర్ అందించాడు. నేను బ్యాటింగ్ చేసేటప్పుడు ఎనిమిది లేదా తొమ్మిదో ఓవర్‌ నుంచి దూకుడుగా ఆడాలనుకున్నాను.

రాయుడు గాయం చిన్నదే..

రాయుడు గాయం చిన్నదే..

ఫాస్ట్‌ బౌలర్లు ఎలా ఆడుతున్నారో పరిశీలించాలి. వాళ్లు పూర్తిస్థాయిలో బౌలింగ్‌ చేయగలుగుతున్నారా లేదా అనేది చూడాలి. పేసర్లు ఎవరైనా చాలా కాలం ప్రాక్టీస్‌ లేకపోతే కెప్టెన్లకు ఇబ్బంది అవుతుంది. ఇక రాయుడు గాయం పెద్దదేం కాదు. డ్రెస్సింగ్ రూములో అతను నవ్వుతూ కనిపించాడు. కాబట్టి.. అతని మోచేతి గాయం తీవ్రమైనది కాదు.

తర్వాత మ్యాచ్‌కు ఇంకా నాలుగు రోజుల సమయం ఉంది. అతను పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించడానికి ఆ వ్యవధి ఉపయోగపడుతుంది. ఫిట్‌నెస్, పరిస్థితుల్ని బట్టి.. తర్వాత మ్యాచ్‌లో అతను ఆడటంపై నిర్ణయం తీసుకుంటాం'అని ధోనీ వెల్లడించాడు. షార్జా వేదికగా శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది.

బంతిని అంచనా వేయడంలో..

బంతిని అంచనా వేయడంలో..

ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో ముంబై ఫాస్ట్ బౌలర్ ఆడమ్ మిల్నే విసిరిన వేగవంతమైన డెలివరీని అంచనా వేయలేకపోయిన అంబటి రాయుడు (0 రిటైర్డ్ హర్ట్).. షార్ట్ పిచ్ బాల్ అనుకుని కిందకి వంగే ప్రయత్నం చేశాడు. కానీ.. ఎక్కువ బౌన్స్ కానీ బంతి నేరుగా వచ్చి అతని మోచేతికి బలంగా తాకింది. ఏడమ మోచేతికి తాకడంతో పాటు అదీ కొత్త బంతి కావడంతో నొప్పితో విలవిలలాడిపోయిన అంబటి రాయుడు.. ఫిజియో సపర్యల తర్వాత అతనితో కలిసి మైదానం వీడాడు. అయితే రాయుడికి తీసిన ఎక్స్‌రేలో ఎలాంటి ఫ్రాక్చర్ కాలేదు. దాంతో అతను తదుపరి మ్యాచ్‌కు అందుబాటులో ఉండనున్నాడు.

చెలరేగిన చెన్నై..

చెలరేగిన చెన్నై..

ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు సాధించింది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' రుతురాజ్‌ గైక్వాడ్ (58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 88 నాటౌట్‌) అజేయ హాఫ్ సెంచరీకి తోడుగా రవీంద్ర జడేజా (33 బంతుల్లో 26; 1 ఫోర్‌), డ్వేన్‌ బ్రావో (8 బంతుల్లో 23; 3 సిక్స్‌లు) కూడా కీలక ఇన్నింగ్స్‌ ఆడారు.

ముంబై బౌలర్లలో ఆడమ్‌ మిల్నే, బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ తలా రెండేసి వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 136 పరుగులు చేసి ఓడింది. సౌరభ్‌ తివారీ (40 బంతుల్లో 50 నాటౌట్‌; 5 ఫోర్లు) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు. చెన్నై బౌలర్లు బ్రావో (3/25), దీపక్‌ చహర్‌ (2/19) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. మోకాలి గాయంతో ముంబై రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంకాగా. పొలార్డ్‌ తాత్కాలిక సారథిగా వ్యవహరించాడు.

Story first published: Monday, September 20, 2021, 11:21 [IST]
Other articles published on Sep 20, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+