For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంఎస్ ధోనీ ట్విట్ట‌ర్ అకౌంట్ నుంచి బ్లూ టిక్ తొల‌గింపు.. గంటల వ్యవధిలోనే ఆగయా! ఇంతకు ఏమైంది?

MS Dhonis Twitter Account Blue Tick Has been Removed Due To Inactive For Months

హైదరాబాద్: గత జూన్ నెలలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా మరి కొంతమంది అగ్ర రాజకీయ నేతల ట్విట్టర్ ఎకౌంట్లకు బ్లూ టిక్ తీసేసింది ట్విట్టర్. అయితే ఆ తరువాత వచ్చిన నిరసనల నేపధ్యంలో మళ్లీ ఆ టిక్‌లు ఇచ్చేసింది. ఆ తరువాత మరికొందరి ప్రముఖుల ట్విట్టర్ ఎకౌంట్లకు బ్లూ టిక్ తీసేసిన ట్విట్టర్ జయమాన్యం.. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోనీకి షాక్ ఇచ్చింది. ధోనీ ఆఫీషియల్ ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్‌ను కూడా తీసేసింది. ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏమైందో ఏమో తెలియదు కానీ గంటల వ్యవధిలోనే మహీ ట్విట్టర్ ఖాతాకు మళ్లీ బ్లూ టిక్ వచ్చింది.

బ్లూ టిక్‌ ఆగయా:

బ్లూ టిక్‌ ఆగయా:

శుక్రవారమే ఎంఎస్ ధోనీ ఆఫీషియల్ ట్విట్టర్ ఖాతా బ్లూ టిక్‌ను ట్విట్టర్ జయమాన్యం తీసేసింది. మహీ ట్విటర్ ఖాతా 'మహేంద్ర సింగ్ ధోనీ'కు బ్లూ టిక్‌ లేదు. గత కొన్ని నెలలలుగా ధోనీ ట్విట్టర్ ఖాతా ఇన్ యాక్టీమ్‌గా ఉండడమే ఇందుకు కారణమట. జనవరి 8న మహీ లాస్ట్ పోస్ట్ చేశాడు. ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడన్న విషయం తెలిసిందే. కుటుంబం, ఆటకు సంబందించిన పోస్టులు మహీ సతీమణి సాక్షి సింగ్ ధోనీ చెపితే గాని అసలు విషయం బయటకు రాదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. మహీ అభిమానులు ట్విట్టర్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే బ్లూ టిక్‌ను పెట్టాలంటూ వారు డిమాండ్ చేశారు. మరి ఏమైందో ఏమో తెలియదు కానీ గంటల వ్యవధిలోనే మహీ ట్విట్టర్ ఖాతాకు మళ్లీ బ్లూ టిక్ వచ్చింది. ఎందుకు తీసేసిందో, మళ్లీ ఎందుకు పెట్టిందో ట్విట్టర్ జయమాన్యంకే తెలియాలి.

గతేడాది ఆటకు వీడ్కోలు

గతేడాది ఆటకు వీడ్కోలు

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చివరగా 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో 18 పరుగుల తేడాతో కోహ్లీసేన ఓటమిపాలైంది. అదే చివరి మ్యాచ్​ అని అప్పుడు ఎవరూ కూడా ఊహించలేదు. ఆ మ్యాచ్​ జరిగిన ఏడాదికి మహీ ఆటకు వీడ్కోలు చెప్పాడు. గతేడాది ఆగష్టు 15న మహి రిటైర్మెంట్ ఇచ్చాడు.

అంతర్జాతీయ కెరీర్‌లో ఎంఎస్ ధోనీ 90 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 4876 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 33 అర్ధ శతకాలు ఉన్నాయి. 350 వన్డే మ్యాచ్‌ల్లో 10773 రన్స్‌ చేశాడు. 10 శతకాలతో పాటు 73 అర్థ శతకాలు ఉన్నాయి. ఇక 98 టీ20 మ్యాచ్‌లలో 1600 పరుగుల బాదాడు.

IND vs ENG 1st Test: లేని పరుగు కోసం ప్రయత్నించి రహానే రనౌట్‌.. వైస్ కెప్టెన్‌పై తీవ్ర విమర్శలు!!

బ్లూ టిక్ అంటే

బ్లూ టిక్ అంటే

ఇక అసలు ట్విట్టర్ బ్లూ టిక్ కథ ఏమిటి అనేది తెలుసుకుందాం. ట్విట్టర్ రూల్స్ ప్రకారం.. బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్ (బ్లూ టిక్) అంటే ఖాతా నిజమైనది అని అర్ధం. అలాగే ప్రజా ప్రయోజనం కోసం నిర్వహిస్తున్నది అని ఇచ్చే ఓ గుర్తింపు. ఈ టిక్ పొందడానికి.. క్రియాశీల ట్విట్టర్ ఖాతా కలిగి ఉండటం చాలాచాలా ముఖ్యం. ప్రస్తుతం ట్విట్టర్ ప్రభుత్వ సంస్థలు, బ్రాండ్లు, లాభాపేక్షలేని సంస్థలు, వార్తా సంస్థలు, జర్నలిస్టులు, వినోదం, క్రీడలు, ఇ-స్పోర్ట్స్, కార్యకర్తలు, నిర్వాహకులు మరియు ఇతర ప్రభావకారుల యొక్క నిర్దిష్ట ఖాతాలను ధ్రువీకరించి ఈ బ్లూ టిక్ ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే చాలా మంది బ్లూ టిక్‌ను పొందారు.

ఎక్కువ కాలం క్రియాశీలంగా లేకపోతె

ఎక్కువ కాలం క్రియాశీలంగా లేకపోతె

నిబంధనల ప్రకారం ట్విట్టర్ నీలిరంగు టిక్‌లను తొలగించే అధికారం కలిగి ఉంటుంది. ఎవరైనా వారి హ్యాండిల్ పేరును మార్చుకుంటే లేదా వినియోగదారు తన ఖాతాను ధృవీకరించిన విధంగా ఉపయోగించకపోతే చర్యలు తీసుకుంటుంది. బ్లూ టిక్ (బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జ్) ఎటువంటి నోటీసు లేకుండా తొలగిస్తుంది. అదేవిధంగా ఎక్కువ కాలం క్రియాశీలంగా లేకపోయినా.. ఆ ఖాతాలకు బ్లూ టిక్ తొలిగించే అవకాశం ట్విట్టర్ యాజమాన్యంకు ఉంది. ఇప్పడు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఖాతాకు బ్లూ టిక్ తొలిగించడానికి కారణం క్రియాశీలంగా లేకపోవడమే అని ట్విట్టర్ పరోక్షంగా చెబుతోంది.

తొలగిస్తామని చెపుతున్నా

తొలగిస్తామని చెపుతున్నా

ట్విట్టర్ క్రియాశీలంగా లేని ఖాతాలకు బ్లూ టిక్ తొలగిస్తామని చెపుతున్నా.. క్రియాశీలంగా లేని అన్ని ఖాతాలనూ ట్విట్టర్ తొలగించలేదు. కేవలం దేశంలో ముఖ్యమైన వారికి చెందిన ఖాతాలను మాత్రమే ఇలా చేసింది. చనిపోయిన వారి ఖాతాలకు బ్లూ టిక్ కొనసాగడం గమనార్హం. దివంగత మాజీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ పటేల్, నటుడు ఇర్ఫాన్ ఖాన్.. చాలా మంది ట్విట్టర్ ఖాతాలు ధ్రువీకరించినవె. కొన్నిరోజుల క్రితం వరకు వీటికి బ్లూ టిక్ ఉంది.

ప్రణబ్ ముఖర్జీ ట్విట్టర్ ఖాతా నుంచి చివరి ట్వీట్ 2020 ఆగస్టులో ఆయన మరణానికి ముందు జరిగింది. అక్టోబర్ 2020 నుంచి అహ్మద్ పటేల్ ఖాతా యాక్టీవ్ గా లేదు. మే 2020 నుంచి ఇర్ఫాన్ ఖాతాలో ఒక్క పోస్ట్ లేదు. ఈ ఖాతాలను స్మారక ఖాతాలుగా కూడా ఉపయోగించడం లేదు. అయినా ఈ ఖాతాలకు బ్లూ టిక్ ఉండడం విశేషం.

చిన్నపాటి యుద్ధం

చిన్నపాటి యుద్ధం

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన నిబంధనల పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న ట్విట్టర్‌కు.. ప్రభుత్వానికి ఆ మధ్య ఓ చిన్నపాటి యుద్ధం జరిగింది. ప్రముఖుల ఖాతాలకు బ్లూ టిక్ తీసేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం ట్విట్టర్‌కు చివరి అల్టిమేటం జారీ చేసింది. ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల విషయంలో కచ్చితంగా ట్విట్టర్ ప్రతి స్పందించాల్సిందే అని తేల్చి చెప్పింది. నిబంధనలు పాటించి తీరాల్సిందే అని స్పష్టం చేసింది. అయినా ట్విటర్ ప్రముఖుల ఖాతాలకు బ్లూ టిక్ తీసేస్తోంది.

Story first published: Friday, August 6, 2021, 18:49 [IST]
Other articles published on Aug 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+