
టైటిల్ విన్నర్ అనుకుంటే..
భారత మెంటార్‌గా ధోనీని నియమిస్తున్నామని బీసీసీఐ ప్రకటించిన వెంటనే ఈసారి టైటిల్ భారత్‌దేనని అంతా భావించారు. ధోనీ రాకతో కెప్టెన్ కోహ్లీపై సగం భారం తగ్గుతుందని, అతను బ్యాటింగ్‌లో చెలరేగుతాడని అనుకున్నారు. టీ20 ఫార్మాట్‌లో గొప్ప కెప్టెన్‌గా రికార్డున్న ధోనీ అనుభవం జట్టుకు ఉపయోగపడుతుందని, యువ ఆటగాళ్లకు అతని మార్గనిర్దేశకం అవసరమవుతుందని ఆశించారు. ముఖ్యంగా హై ఓల్టేజ్ మ్యాచ్‌ల్లో గేమ్‌ను బాగా రీడ్ చేసే ధోనీ.. పరిస్థితులకు తగ్గట్లు ధోనీ రచించే వ్యూహాలు భారత్ రాతను మారుస్తాయనుకున్నారు. రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో పటిష్టమైన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను మట్టికరిపించడంతో ఈసారి భారత్‌దే టైటిల్ అని అంతా భావించారు.

చేతులెత్తేసిన మెంటార్ ధోనీ..
కానీ పాకిస్థాన్ మ్యాచ్‌తోనే ఈ అంచనాలు, ఆశలు పటాపంచలయ్యాయి. టీమిండియా ఆటగాళ్లంతా ఒత్తిడికి చిత్తయ్యారు. ఇక్కడ మెంటార్ ధోనీ కూడా చేతులెత్తేసాడు. మెంటార్‌గా భారత ఆటగాళ్లలో స్పూర్తిని నింపాల్సిన మహీ డగౌట్‌కే పరిమితమయ్యాడు. అసలు మహీ ఈ మ్యాచ్ ప్రణాళికల్లో భాగస్వామి అయ్యాడా? లేదా? అనే సందేహం కలిగింది. టాపార్డర్ విఫలమైన వేళ.. కోహ్లీ అండతో ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచినా.. బౌలర్లు దాన్ని కాపాడలేకపోయారు. మ్యాచ్‌ను బాగా రీడ్ చేసే మహీ ఇక్కడ కెప్టెన్ విరాట్ కోహ్లీ, బౌలర్లకు ఏమైనా సలహాలు ఇచ్చాడా? పరిస్థితులకు తగ్గట్లు వ్యూహాలు రచించాడా? అంటే సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే ఈ మ్యాచ్‌లో టీమిండియా కనీస పోరాట పటిమ కనబర్చలేకపోయింది. ఒక్క వికెట్ తీయకుండా 10 వికెట్లతో చిత్తయింది. ఈ మ్యాచ్ సందర్భంగా మెంటార్ ధోనీ డగౌట్‌లో కూడా కనిపించకపోవడం అనేక సందేహాలకు దారి తీసింది. అసలు ధోనీ మాటలను కోహ్లీ, శాస్త్రి లెక్క చేయలేదా? అనే అనుమానాలు కలిగాయి.

బెడిసికొట్టిన ప్రయోగాలు..
ఇక న్యూజిలాండ్‌తో కీలక పోరు ముందు టీమ్ కాంబినేషన్‌లో భారత జట్టు మార్పులు చేసింది. అంతే కాకుండా సరికొత్త ప్రయోగానికి తెరదీసింది. ఈ మ్యాచ్‌లో మహీ ఎక్కువగా ఇన్వాల్ అయినట్లు టీవీ కెమెరాల్లో చూసినదాన్ని బట్టి అర్థమవుతోంది. లెఫ్ట్? రైట్ కాంబినేషన్ కోసమే మహీ ఓపెనింగ్ జోడీని మార్చినట్లున్నాడు. రోహిత్ శర్మకు బదులు ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపిస్తూ చేసిన ఈ ప్రయోగం బెడిసి కొట్టింది. కీలక మ్యాచ్‌లో తీవ్ర ఒత్తిడికి గురైన ఇషాన్ కిషన్(4) దారుణంగా విఫలమయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రోహిత్ ఫస్ట్ బాల్‌కే ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నా.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అలానే.. నెంబర్.3లో పాకిస్థాన్‌పై కోహ్లీ నిలకడగా రాణించాడు. కోహ్లీకి అచ్చొచ్చిన స్థానం అది. కానీ.. న్యూజిలాండ్‌పై రోహిత్ శర్మ నెం.3లో రావడంతో.. నెం.4లో ఆడిన కోహ్లీ 17 బంతులాడి 9 పరుగులే చేయగలిగాడు. దాంతో టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మూల్యం చెల్లించుకుంది.

ధోనీ పట్టించుకున్నాడా?
అయితే ఇషాన్ కిషన్‌ను ఓపెనర్‌గా పంపించడం సరైన నిర్ణయమే అయినప్పటికీ.. రోహిత్ శర్మకు బదులు కేఎల్ రాహుల్‌ను మిడిలార్డర్‌లో ఆడించాల్సిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్లు సైతం ఇదే విషయాన్ని చెప్పారు. అంతేగాకుండా మెంటార్‌గా బాధ్యతలు చేపట్టిన ధోనీ.. హార్దిక్ పాండ్యాను పట్టుబట్టి మరీ జట్టులో ఉంచాడు. అతను రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగా... బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అయితే టీమ్ కాంబినేషన్ విషయంలో ధోనీ, కోహ్లీ, రవిశాస్త్రి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో హెడ్ కోచ్ ధోనీతో పాటు బౌలింగ్, బ్యాటింగ్ కోచ్‌లు పూర్తిగా ధోనీకి సరండర్ అయ్యారా? లేక ధోనీ అస్సలు పట్టించుకోలేదా? అనేది అంతు పట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. మొత్తానికి ఏదైతే జరగకూడదనుకున్నామో అదే జరిగింది.! తట్టా బుట్టా సర్దుకొని టీమిండియా ఇంటిదారి పట్టాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications
