For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఎంఎస్ ధోనీ నాయకత్వంలో జట్టు ఎదిగింది.. మహీ విజయాలకు అసలు కారణం అదే'

MS Dhoni didnt make changes in playing XI says Aakash Chopra

ముంబై: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ బ్యాట్స్‌మన్‌, కామెంటేటర్ ఆకాశ్‌ చోప్రా ప్రశంసల వర్షం కురిపించారు. ధోనీ ప్రపంచంలోనే అత్యుత్తమ సారథి అని పేర్కొన్నాడు. ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం అందించడమే మహీ గొప్పతనమన్నాడు. రాణించే క్రికెటర్లకు జట్టులో నిలకడగా అవకాశాలు ఇవ్వడమే అతడి విజయాలకు అసలు కారణమన్నాడు.

ధోనీ గెలిచిన మూడు ఐసీసీ టోర్నీల్లో ఇదే ధోరణి కనిపించిందని ఆకాశ్‌ చోప్రా వెల్లడించాడు. 2004లో జట్టులోకి వచ్చిన ధోనీ.. 2007లోనే జట్టు పగ్గాలు అందుకున్నాడు. రాహుల్ ద్రవిడ్ నుంచి కెప్టెన్సీ అందుకున్న మహీ.. టీమిండియాకు ఎన్నో అద్భుత విజయాలు అందించాడు.

మూడు ఐసీసీ ట్రోఫీలు

మూడు ఐసీసీ ట్రోఫీలు

నాలుగు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఎంఎస్ ధోనీ భారతదేశానికి నాయకత్వం వహించాడు. అందులో భారత్ మూడు విజయాలు అందుకుంది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ. క్రికెట్ చరిత్రలో ఈ మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక కెప్టెన్ మహీనే. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ మూడు ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ ఆడింది. అందులో రెండు ఓడిపోగా.. 2002 ఛాంపియన్స్ ట్రోఫీని శ్రీలంకతో పంచుకుంది. ఇక ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంకా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు.

మార్పులు చేయకపోవడమే

మార్పులు చేయకపోవడమే

తాజాగా ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'ఎంఎస్ ధోనీ ఓ క్లాస్. అతడి నాయకత్వంలో భారత జట్టు ఎదిగింది. తుది జట్టులో ఎక్కువ మార్పులు చేయకపోవడమే అతడిని ప్రపంచంలోనే అత్యుత్తమ సారథిగా మార్చింది. అతడు ఏ ఒక్క ఆటగాడిని కూడా అభద్రతా భావానికి గురిచేసేవాడు కాదు. లీగ్‌ దశ నుంచి నాకౌట్‌ వరకు ధోనీ జట్టును పరిశీలిస్తే.. కీలక బృందం ఒకేలా ఉంటుంది. నాకౌట్‌ మ్యాచుల్లో పరుగులు చేయగల వారే అందులో ఉంటారు. తక్కువ పొరపాట్లు చేసే జట్టు క్వార్టర్స్‌, సెమీస్‌, ఫైనల్‌ గెలుస్తుంది. ఆటగాళ్ల చోటుపై అభద్రతాభావం లేని జట్టే నిలకడగా రాణిస్తుంది' అని అన్నాడు.

అప్పుడు బ్రాత్‌వైట్.. ఇప్పుడు స్టోక్స్! వరుస 4 సిక్సర్ల‌కి బదులు తీర్చుకున్నఇంగ్లీష్ ఆల్‌రౌండర్‌! (వీడియో )

ఒక ఆటగాడు గుర్తుండిపోతాడు

ఒక ఆటగాడు గుర్తుండిపోతాడు

'ఐసీసీ టోర్నీలలో ఎంఎస్ ధోనీ సారథ్యంలోని ఏ జట్టును చూసినా.. ఎవరో ఒక ఆటగాడు గుర్తుండిపోతాడు. 2007 టీ20 ప్రపంచకప్‌, 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ మ్యాచులలో గౌతమ్ గంభీర్‌ గుర్తుండి పోతాడు. 2011 ప్రపంచకప్‌ టోర్నీ మొత్తం యువరాజ్‌ సింగ్‌ గుర్తుంటాడు. 2011 ఫైనల్లో గంభీర్‌తో పాటు మహీ కూడా. ఇక 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీలో నిలకడగా రాణించిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. 2014లో విరాట్ కోహ్లీ రాణించాడు. మహీ ఎప్పుడూ కొంతమంది ఆటగాళ్లను నమ్ముతాడు, వారిపైనే ఆధారపడతాడు. వారు కూడా నాకౌట్‌లో బాగా ఆడతారు' అని ఆకాశ్‌ చోప్రా పేర్కొన్నాడు.

కోహ్లీకి క‌లిసిరాని ఐసీసీ టోర్నీలు

కోహ్లీకి క‌లిసిరాని ఐసీసీ టోర్నీలు

ఎంతటి గొప్ప బ్యాట్స్‌మెన్ అయినా, కెప్టెన్ అయినా ఐసీసీ ట్రోఫీ నెగ్గితేనే అతడి కెరీర్ పరిపూర్ణం అవుతుంది. ఎప్పుడూ అదృష్టం వెంటే ఉండే ఎంఎస్ ధోనీని పక్కనపెడితే.. క్రికెట్ దిగ్గజం స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఒక్క ట్రోఫీని ముద్దాడ‌టానికి ఏకంగా 22 ఏళ్లు ప‌ట్టింది. 1989లో క్రికెట్‌లో అడుగు పెట్టిన సచిన్.. 2011లో గానీ త‌న కల నెర‌వేర్చుకోలేక‌పోయాడు. మాస్టర్ ఏకంగా ఆరు ప్రపంచకప్‌లు ఆడాడు. చివరకు ధోనీ సారథ్యంలో ట్రోఫీని స‌గ‌ర్వంగా ముద్దాడే అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు సచిన్ త‌ర్వాత ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో ఆ స్థాయి బ్యాట్స్‌మ‌న్‌గా వెలుగొందుతున్న కోహ్లీది దాదాపు అదే ప‌రిస్థితి.

ఓ సాధార‌ణ ప్లేయ‌ర్‌గా 2011లో ప్రపంచకప్‌ అందుకునే అవ‌కాశ‌మైతే విరాట్ కోహ్లీకి దక్కింది కానీ.. ఓ కెప్టెన్‌గా మాత్రం ఐసీసీ టోర్నీలు అత‌నికి అంద‌ని ద్రాక్షగానే మిగిలింది. భారత్ తాజాగా ప్రపంచ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ఫేవ‌రెట్‌గా దిగినా.. చివ‌రికి ఓట‌మి త‌ప్ప‌లేదు.

Story first published: Wednesday, June 30, 2021, 16:24 [IST]
Other articles published on Jun 30, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+