
దుబాయ్: గత మ్యాచ్‌ల్లో చేసిన తప్పిదాలనే మళ్లీ పునరావృతం చేసి మూల్యం చెల్లించుకున్నామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 7 పరుగులతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ.. క్యాచ్‌లు, చేజార్చడం, నోబాల్స్ వేయడంతో ఓటమి పాలయ్యామన్నాడు. లీగ్ మ్యాచ్‌లు కాబట్టి సరిపోయిందని, అదే నాకౌట్ మ్యాచ్‌ల్లోనైతే ఇలాంటి ఆటతీరు పనికిరాదన్నాడు.
'మిడిల్ ఓవర్లలో బంతిని హిట్ చేయలేకపోయాను. బంతిని బలంగా బాదడం కష్టమైంది. ఇక్కడి పరిస్థితుల కారణంగా గొంతు ఎండుకపోయింది. ప్రస్తుతం బాగానే ఉంది. చాలా కాలం తర్వాత మేం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడాం. ఆటలో ప్రొఫెషనలీజం కావాలి. క్యాచ్‌లు చేజార్చడం, నోబాల్స్ వేయడం వంటి తప్పిదాలు పునరావృతం చేశాం. 16 ఓవర్ తర్వాత రెండు చెత్త ఓవర్లు వేశాం. ఓవరాల్‌గా కొంచెం బెటర్‌గానే ఆడాం. ఏ ఒక్కరు క్యాచ్‌లు చేజార్చకూడదు. లీగ్ మ్యాచ్‌లు కాబట్టి నడుస్తుంది. అదే నాకౌట్ స్టేజిలోనైతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇదే నాకౌట్ మ్యాచ్ అయితే పరిస్థితి ఏంది? ఇక ఈ మ్యాచ్‌లో చాలా సానుకూలంశాలు ఉన్నాయి. కొన్ని విషయాల్లో మేం మెరుగువ్వాలి. తదుపరి మ్యాచ్‌కు మా తప్పిదాలను సవరించుకొని బరిలోకి దిగుతాం'అని ధోనీ చెప్పుకొచ్చాడు. 2014 ఐపీఎల్ సీజన్ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడటం ఇదే తొలిసారి.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. అనామక ఆటగాళ్లు ప్రియామ్ గార్గ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీకి తోడు అభిషేక్ శర్మ(24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 31) రాణించాడు. 69 రన్స్‌కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఈ చిచ్చర పిడుగులు 77 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకున్నారు. చెన్నై బౌలర్లలో చాహర్ రెండు వికెట్లు తీయగా చావ్లా, ఠాకుర్ తలో వికెట్ తీశారు.
అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. మహేంద్ర సింగ్ ధోనీ(36 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47 నాటౌట్), రవీంద్ర జడేజా(35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50) రాణించినా ఫలితం లేకపోయింది. ఆఖరి బంతి వరకు ధోనీ క్రీజులో ఉండటం.. భువనేశ్వర్ గాయంతో ఓవర్ పూర్తి చేయకుండానే మైదానం వీడటంతో సన్‌రైజర్స్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. కానీ ఆఖరి ఓవర్ అందుకున్న అబ్ధుల్ సమద్ అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. అబ్దుల్ సమాద్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.