Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

దోస్త్‌గానీ బర్త్‌డే పార్టీ‌.. హార్దిక్‌ పాండ్యాతో కలిసి స్టెప్పులేసిన ధోనీ.. పబ్‌లో రచ్చ రచ్చే(వీడియో)

MS Dhoni dances with Hardik Pandya and Ishan Kishan to Badshahs tunes at party in Dubai goes viral

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఏది చేసినా సంచలనమే. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమై రెండేళ్లు అవుతున్నా ధోనీ క్రేజ్ మాత్రం ఏం తగ్గడం లేదు. అతను ఏం చేసినా వార్తే అవుతోంది. ఐపీఎల్ కోసం గుండుతో సన్యాసిలా అవతారం ఎత్తినా, ఓరియో ప్రమోషన్ కోసం అభిమానులకు 'బిస్కెట్' వేసినా...అతనికే సాధ్యమవుతోంది. తాజాగా ఓ పబ్‌లో టీమిండియా స్టార్ హాల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, యువ వికెట్ కీపర్ ఇషాన్‌ కిషాన్‌, కృనాల్ పాండ్యాలతో కలిసి ధోనీ రచ్చ చేయడం చర్చనీయాంశమైంది.

పబ్‌లో రచ్చ రచ్చ..

తన స్నేహితుడి బర్త్‌డే పార్టీ‌లో పాల్గోనేందుకు దుబాయ్ వెళ్లిన మహీ.. అక్కడ పబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో రచ్చ చేశాడు. ఈ పార్టీకి పాండ్యా బ్రదర్స్, ఇషాన్ కిషన్‌లు కూడా హాజరయ్యారు. ఈ ముగురితో కలిసి ధోనీ స్పెప్పులేసాడు. సింగర్స్‌తో కలిసి పాట పాడుతూ చిందేసారు. ర్యాపర్ బాద్‌షా పాట పాడుతుంటే హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ల మీద చేతులేసి మాహేంద్ర సింగ్ ధోనీ స్టెప్పులేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది... ఈ వీడియో తీసిన మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి సాక్షి సింగ్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పోస్టు చేసింది. ఇక ధోనీ డ్యాన్స్‌ను చూసి అతని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

ఐపీఎల్ 20223తో..

అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తర్వాత కేవలం ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోనీ.. ఐపీఎల్ 2023 సీజన్ కోసం సిద్దమవుతున్నారు. గత సీజన్‌లో ఘోరంగా విఫలమైన చెన్నై సూపర్ కింగ్స్.. ఈ సారి మెరుగైన ప్రదర్శన ఇచ్చి ధోనీకి గ్రాండ్‌గా వీడ్కోలు పలకాలని భావిస్తోంది. ధోనీ సైతం చెపాక్ వేదికగా జరిగే మ్యాచ్‌తో ఆటకు గుడ్ బై చెప్పాలనుకుంటున్నాడు. గత సీజన్ ఆరంభంలో ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో జడేజా కెప్టెన్సీలో 2022 ఐపీఎల్ ఎడిషన్‌ని ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్, 8 మ్యాచులు ముగిసిన తర్వాత మళ్లీ కెప్టెన్‌ని మార్చింది. రవీంద్ర జడేజా స్థానంలో ధోనీ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. ఓవరాల్‌గా 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకుని, నాలుగు విజయాలతో సరిపెట్టుకున్న సీఎస్‌కే... పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.

సీఎస్‌కే మెంటార్‌గా..

సీఎస్‌కే మెంటార్‌గా..

ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో బరిలో దిగబోతోంది చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పటికే సీఎస్‌కే ఈ విషయాన్ని ఖరారు చేసింది. ఈ సీజన్ తర్వాత ధోనీ సీఎస్‌కే మెంటర్‌గా మారబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్... వన్డే సిరీస్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. ఈ ఇద్దరూ నేరుగా దుబాయ్ చేరుకుని, ధోనీ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి హాజరయ్యారు.

Story first published: Sunday, November 27, 2022, 15:20 [IST]
Other articles published on Nov 27, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+